Rahul Roy: సినిమా హీరోలు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వారికి సాయం చేస్తుంటారు. కొంత మంది వాటి గురించి బయటకు చెప్తారు. కొంతమంది మాత్రం ఎప్పటికీ బయటకు చెప్పరు. ఆ సాయం పొందిన వ్యక్తులే తర్వాత ఏదైనా సందర్భంలో చెబితేగానీ దాని గురించి ఎవరికీ తెలియదు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో గురించి కూడా అలాంటి వార్త ఒకటి బయటకు వచ్చింది. సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీలో ఎంతో మందికి సాయం చేస్తూ ఉంటారు. అలా సాయం పొందిన వారిలో ‘ఆషికీ’ సినిమా ఫేమ్ రాహుల్ రాయ్ ఒకరు. ఇటీవలే సల్మాన్ ఖాన్ తనకు చేసిన సాయం గురించి వెల్లడించారు రాహుల్. దీంతో సల్మాన్ మంచి మనసు చూసి ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


రాహుల్ రాయ్ బ్రెయిన్ సర్జరీ బిల్ కట్టిన సల్మాన్..


వాస్తవానికి ఈ విషయం జరిగి దాదాపు రెండేళ్లు గడిచిపోయింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాహుల్ రాయ్ దాని గురించి వెల్లిడించారు. 2020 లో రాహుల్ రాయ్ 'LAC - లైవ్ ది బాటిల్ ఇన్ కార్గిల్' షూటింగ్ సమయంలో తనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. తనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళారని తన మెదడు, గుండెకు యాంజియోగ్రఫీ తీసారని అన్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ఆ సమయంలో సాయం కోరితే సల్మాన్ వెంటనే స్పందించారని అన్నారు. తన సర్జరీకి అయిన బిల్ లు అన్నీ సల్మాన్ నే చెల్లించారని చెప్పుకొచ్చారు. ఇప్పుు అన్ని పెండింగ్ బిల్లులు పూర్తిగా చెల్లించబడ్డాయని అది సల్మాన్ వల్లనేనని తెలిపారు. 


బాలీవుడ్ డైమండ్ సల్మాన్: రాహుల్ రాయ్


ఇదే ఇంటర్వ్యూలో రాహుల్ సల్మాన్ గురించి చెబుతూ.. చాలా మంది సాయం చేసి బయటకు చెప్పుకుంటారని, కానీ సల్మాన్ తనకు చేసిన సాయం గురించి ఎక్కడా చెప్పలేదని అన్నారు. అదే సల్మాన్ ఖాన్ గొప్పతనం అని అన్నారు. స్టార్ అవ్వడం అంటే ఇదేనని, కెమెరా ముందు మాత్రమే స్టార్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు రాహుల్. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ డైమండ్ లాంటి వారని అన్నారు. సల్మాన్ గురించి చాలా మంది రకరకాలుగా అనుకుంటారని, కానీ ఆయన చాలా మంచి వ్యక్తి అని అన్నారు.


ఇక సల్మాన్ ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే.. ఆయన ఇటీవల ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌’లో కనిపించారు. ఇందులో పూజా హెగ్డే, వెంకటేష్, జస్సీ గిల్, జగపతి బాబు, రాఘవ్ జుయల్, భూమికా చావ్లా, భాగ్యశ్రీ, సిద్ధార్థ్ నిగమ్, షెహనాజ్ గిల్, పాలక్ తివార్, విజేందర్ సింగ్ తదితరులు నటించారు. రామ్ చరణ్, అబ్దు రోజిక్ ఈ చిత్రంలో అతిధి పాత్రలు పోషించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేకపోయింది. సల్మాన్ తదుపరి ‘టైగర్ 3’ లో నటిస్తున్నాడు. ఇందులో సల్మాన్ స్పై పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ కూడా నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also Read: రాఖీ భాయ్‌కు చిట్టిబాబు షాక్, ఆ దేశంలో ‘కేజీఎఫ్’ కలెక్షన్స్ బ్రేక్ చేసిన ‘రంగస్థలం’


Join Us on Telegram: https://t.me/abpdesamofficial