సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ‘రంగస్థలం’ మూవీ ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. అలాగే కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’ కూడా దేశవ్యాప్తంగా బ్లాక్‌బాస్టర్ కలెక్షన్లతో దక్షిణాది సినిమాల సత్తా చాటింది. అయితే, ‘రంగస్థలం’ పాన్ ఇండియా రిలీజ్ కాదు. కేవలం ‘కేజీఎఫ్’ మాత్రమే పాన్ ఇండియా మూవీ.. కలెక్షన్ల విషయంలో కూడా ‘కేజీఎఫ్’ టాప్‌లో ఉంది. అయితే, అదంతా ఇండియాలో. విదేశాల్లో మాత్రం రంగస్థలమే టాప్. ఔనండి, జపాన్‌లో ‘రంగస్థలం’ గత కేజీఎఫ్ రికార్డులను బద్దలకొట్టింది. అదేంటీ ‘రంగస్థలం’ ఎప్పుడో రిలీజ్ అయ్యింది కదా.. ఇప్పుడు కలెక్షన్ల గోలేంటి అని అనుకుంటున్నారా? అయితే.. చూడండి. 


‘రంగస్థలం’లో చిట్టిబాబు పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఫిదా చేసింది. ఇప్పుడు ఆ చిట్టిబాబు జపాన్ ప్రేక్షకులకు కూడా తెగనచ్చేస్తున్నాడట. కారణం.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీనే. రాజమౌళి తెరకెక్కించిన ఆ మూవీని ఇటీవల జపాన్‌లో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ అక్కడ ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు మంచి క్రేజ్ లభించింది. ఈ నేపథ్యంలో మేకర్స్ చెర్రీ చార్మ్‌ను సొమ్ము చేసుకునేందుకు ‘రంగస్థలం’ మూవీని శుక్రవారం రిలీజ్ చేశారు. అంతేకాదు, యశ్ నటించిన ‘కేజీఎఫ్’ను కూడా అదే రోజు రిలీజ్ చేశారు. అయితే, అక్కడి ప్రేక్షకులు రామ్ చరణ్‌కే ఓటేశారు. 


‘కేజీఎఫ్’ మేకర్స్ తమ మూబీ ‘ఆర్ఆర్ఆర్’ను బీట్ చేసిందంటూ ఇటీవల ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే, చిట్టిబాబు ఊహించని షాకిచ్చాడు. రాఖీభాయ్ కంటే ఎక్కువ కలెక్షన్లతో ఆశ్చర్యపరిచాడు. ఈ ఊపుతో త్వరలో జపాన్‌లో మరిన్ని రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలను విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు. సౌత్ సినిమాలకు కలెక్షన్స్ ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో మన మూవీస్‌ను నేరుగా ఆ భాషలోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. 


‘గేమ్ చేంజర్’తో వచ్చేస్తున్న చెర్రీ, కొత్త ప్రాజెక్టులు ప్రకటించని యశ్


‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ సోలో కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'గేమ్ చేంజర్' (Game Changer Movie). శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాణీ కథానాయిక. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అందులో చరణ్ హెయిర్ స్టైల్ కొత్తగా కనిపించింది. టైటిల్ మోషన్ పోస్టర్ అయితే సినిమాపై అంచనాలు పెంచింది. రాజకీయ నాయకులు, సివిల్ సర్వెంట్స్ (ఐఏఎస్ అధికారులు) నేపథ్యంలో 'గేమ్ చేంజర్' సినిమాను తెరకెక్కిస్తున్నారు శంకర్. గతంలో 'ఒకే ఒక్కడు', 'జెంటిల్ మన్', 'భారతీయుడు' వంటి సినిమాలు తీసిన ఘనత ఆయనది. సామజిక సందేశంతో సినిమా తీసిన ప్రతిసారీ శంకర్ సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు. అందుకని, 'గేమ్ చేంజర్' మీద మంచి అంచనాలు ఉన్నాయి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆ స్థాయి విజయాన్ని రామ్ చరణ్ అందుకుంటారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. అయితే, యశ్ మాత్రం ‘కేజీఎఫ్2’ తర్వాత ఎలాంటి ప్రాజెక్టును ప్రకటించలేదు. 


Also Read 'ఖుషి' - గుమ్మడికాయ కొట్టేశారు, కేక్ కట్ చేసిన విజయ్ దేవరకొండ


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial