రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), అగ్ర కథానాయికలలో ఒకరైన సమంత రూత్ ప్రభు (Samantha) జంటగా నటిస్తున్న సినిమా 'ఖుషి' (Kushi Movie). ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.  ఈ రోజుతో సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. అదేనండీ... సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన సినిమా యూనిట్, గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. 






అందమైన పెళ్లి జీవితం మెలోడీ అయితే?
ఇప్పటికి 'ఖుషి' నుంచి రెండు  పాటలు విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ఆరాధ్య పాటకు చిత్ర దర్శకుడు శివ నిర్వాణ సాహిత్యం అందించారు. ఈ పాటను సిద్ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు. తెలుగుతో పాటు మరో రెండు భాషల్లో ఈ పాటను తాను పాడినట్లు ఆమె పేర్కొన్నారు.


Also Read : బాలకృష్ణ సినిమా హీరోయిన్‌కి ఎంగేజ్‌మెంట్



విజయ్ దేవరకొండ, సమంతకు పెళ్లి జరిగే సన్నివేశం, తర్వాత వైవాహిక జీవితం నేపథ్యంలో ఆరాధ్య పాట వస్తుందని లిరికల్ వీడియో చూస్తే ప్రేక్షకులకు ఈజీగా అర్థం అవుతుంది. 'ఒకవేళ అందమైన పెళ్లి జీవితం ఓ మెలోడీ అయితే?' అంటూ చిత్ర బృందం ఈ 'ఆరాధ్య' పాటను విడుదల చేసింది. సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వాహాబ్ అందించిన బాణీ వినసొంపుగా, అందంగా ఉంది. పాటలో నటి రోహిణిని కూడా చూడొచ్చు. 


ద్రాక్షారామం గుడిలో కొన్ని సీన్లు!
ఇటీవల ఏపీలోని ద్రాక్షారామంలోని దేవాలయంలో 'ఖుషి' చిత్రీకరణ జరిగింది. ఆ షూటింగులో మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ కూడా పాల్గొన్నారు. వాళ్ళిద్దరూ యాగం చేస్తుంటే... వెనుక విజయ్ దేవరకొండ, సమంత నిలబడి ఉన్నారు. ఈ వీడియో విజయ్ దేవరకొండ స్వయంగా పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 'ది దేవరకొండ బ్రాడ్ కాస్ట్' ఛానల్ క్రియేట్ చేసిన ఆయన... అందులో ఈ వీడియో షేర్ చేశారు. ఇది 'ఖుషి' లాస్ట్ షెడ్యూల్ అని ఆయన పేర్కొన్నారు. 


Also Read : తమన్ వాయిస్‌లో 'జాణవులే' - బాగుంది 'బ్రో'


'ఖుషి'లోని ఆరాధ్య పాట మాత్రమే కాదు... 'నా రోజా నువ్వే' పాటను కూడా దర్శకుడు శివ నిర్వాణ రాశారు. పాన్ ఇండియా సినిమాగా 'ఖుషి' తెరకెక్కుతోంది.  తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు.  


మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు 'ఖుషి'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు : శివ నిర్వాణ, పోరాటాలు : పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హేషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.











ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial