రజనీకాంత్ ‘జైలర్’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘హుకుం’ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ‘ఏయ్... ఇక్కడ నేనే కింగ్. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నా ఇష్టం వచ్చినప్పుడు మారుస్తూనే ఉంటా. అప్పుడు గప్‌చుప్‌గా వాటిని ఫాలో అవుతూనే ఉండాలి. అది కాకుండా హడావుడిగా ఏమైనా చేస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేసి పారేస్తాను. ఇది హుకుం. టైగర్‌ కా హుకుం (తమిళ డైలాగ్‌కు తెలుగు ట్రాన్స్‌లేషన్)’ అని రజనీ పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పగానే... అంతే పవర్‌ఫుల్‌గా అనిరుథ్ రవిచందర్ ఇచ్చే మ్యూజిక్ ఇంకా ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన పూర్తి పాట ఆగస్టు 17వ తేదీన విడుదల కానుంది. 



తమిళంలో ‘జైలర్’ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదల అయిన ‘కావాలా’ పాట విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు ‘హుకుం’ సాంగ్ రిలీజ్ కానుంది. త్వరలో ఈ సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ట్రైలర్ ఈ నెలలోనే వచ్చే అవకాశం ఉంది.


కానీ తెలుగులో మాత్రం టీమ్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రమోషన్లు ప్రారంభించలేదు. రజనీ సినిమాలకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. దీనికి తోడు మెగా స్టార్ ‘భోళా శంకర్‌’తో జైలర్ పోటీ పడనుంది. కాబట్టి వీలైనంత త్వరగా ప్రమోషన్లు ప్రారంభిస్తే మంచిది. ‘జైలర్’ను తెలుగులో దిల్ రాజు విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.


ఈ ‘జైలర్’ సినిమాలో మలయాళ సూపర్ స్టార్  మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ నటులతో పాటు హిందీ నటుడు జాకీ ష్రాఫ్, తెలుగు నటుడు సునీల్, రమ్య కృష్ణ, తమన్నా,  వినాయకన్, మిర్నా మీనన్, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్, కిషోర్, బిల్లీ మురళీ, సుగుంతన్, కరాటే కార్తీ, మిథున్, అర్షద్, మరిముత్తు, నమో నారాయణ, రిత్విక్, అనంత్, శరవణన్, అరంతాంగి నిషా, మహానటి శంకర్, కలై అరసన్ కూడా ఈ సినిమాలో నటించనున్నారు.


గత నెలలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలియజేస్తూ కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక జైలర్ మూవీ షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా సెట్స్ లో  చిత్ర యూనిట్ తో కలిసి రజనీకాంత్ ఓ భారీ కేక్ ని కట్ చేస్తూ ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ‘జైలర్’తో పాటు కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లాల్ సలాం’ సినిమాలో కూడా తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను రజనీకాంత్ పూర్తి చేశారు.