ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ?
పద్దెనిమిదో తేదీన ఢిల్లీలో జరగనున్న నేషనల్ డెమెక్రటిక్ అలయన్స్ మీటింగ్ ఏపీ రాజకీయాల్లో కీలకం అవుతోంది. నిజానికి అది ఎన్డీఏ మిత్రపక్షాల మీటింగ్ కాదు. ఎన్డీఏ ఏర్పడి పాతికేళ్లయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విందు సమావేశం. ఇందలో ఎన్డీఏలో భాగస్వామ్యగా ఉన్న వాళ్లని కాకుండా గతంలో ఎన్డీఏలో భాగంగా ఉన్న పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నారు. కూటమిలో చేరే ఉద్దేశం ఉన్న పార్టీలు వస్తాయి.. లేకపోతే లేదు. ఆ ఉద్దేశంతోనే ఇప్పటికీ ఉన్న మిత్రపక్షాలకు...విడిపోయిన మిత్రపక్షాలకు కూడా సమాచారం పంపినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ నుంచి టీడీపీ, జనసేనలకు ఆహ్వానం అందిందని అంటున్నారు. ఇంకా చదవండి
టార్గెట్ రేవంత్ గా కేటీఆర్ మాస్టర్ ప్లాన్!
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను క్యాష్ చేసుకునేందుకు బీఆర్ఎస్ భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. జులై 17 నుంచి 10 రోజుల పాటు బీఆర్ఎస్ రైతు సమావేశాలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం నిర్మించిన ప్రతి రైతు వేదిక వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇంకా చదవండి
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గరం గరం!
పార్టీ ఫిరాయింపులు, జంపింగ్ జపాంగ్ లతో అధికార పార్టీ బీఆర్ఎస్ లో వర్గ పోరు కొనసాగుతోంది. అధికార పార్టీకి చెందిన నేతలే పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి తాండూరు అసెంబ్లీ టికెట్ ఎవరికి వస్తుందన్న దానిపై రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఇంకా చదవండి
విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయం ఎప్పుడంటే ? - అసలు విషయం చెప్పిన వైవీ సుబ్బారెడ్డి!
సీఎం జగన్ ఎప్పుడు విశాఖకు క్యాంప్ కార్యాలయాన్ని తరలిస్తారనేది సస్పెన్స్ గామారింది. సెప్టెంబర్ నుంచి తన కాపురం విశాఖ నంచే ఉంటుందని .. సీఎం జగన్ గతంలో ఉత్తరాంధ్ర సభల్లో ప్రకటించారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణకు వచ్చినా తేలలేదు. తదుపరి విచారణ డిసెంబర్ కు వాయిదా పడింది. అంటే అప్పటి వరకూ కేసు తేలే అవకాశం లేదు. చట్ట పరంగా రాజధానిని తరలించడానికి లేదు. అందుకే సీఎం జగన్ విశాఖకు క్యాంప్ కార్యాలయం తరలిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. ఇంకా చదవండి
నేడు చాలా చోట్ల వర్షాలు, ఇక్కడ మాత్రం భారీ వానలు
నిన్న ఉత్తర కోస్తాఆంధ్రప్రదేశ్ మీద 5.8 కిలో మీటర్ల నుండి 7.6 కిలో మీటర్ల ఎత్తు మధ్యలో ఉన్న ఆవర్తనం ఈ రోజు బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలో లోని ఒడిశా - గ్యాంగ్టక్ పశ్చిమ బెంగాల్ తీరాల్లో సగటు సముద్రమట్టం నుండి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు ఒక ఆవర్తనం ఏర్పడి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుగా వంగి ఉంది. ఇంకా చదవండి
సుప్రీంకోర్టుని ఆశ్రయించిన రాహుల్
పరువు నష్టం దావా కేసులో గుజరాత్ హైకోర్టు స్టే పిటిషన్‌ని కొట్టేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 2019లో ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటి పేరుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఓ బీజేపీ నేత సూరత్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు రాహుల్‌ని దోషిగా తేల్చింది. ఇంకా చదవండి
‘ఇక్కడ నేను పెట్టిందే రూల్’ - పవర్‌ఫుల్‌గా రజనీ ‘హుకుం’ ప్రోమో!
రజనీకాంత్ ‘జైలర్’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘హుకుం’ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. ‘ఏయ్... ఇక్కడ నేనే కింగ్. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నా ఇష్టం వచ్చినప్పుడు మారుస్తూనే ఉంటా. అప్పుడు గప్‌చుప్‌గా వాటిని ఫాలో అవుతూనే ఉండాలి. అది కాకుండా హడావుడిగా ఏమైనా చేస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేసి పారేస్తాను. ఇది హుకుం. టైగర్ కా హుకుం (తమిళ డైలాగ్‌కు తెలుగు ట్రాన్స్‌లేషన్)’ అని రజనీ పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పగానే... అంతే పవర్‌ఫుల్‌గా అనిరుథ్ రవిచందర్ ఇచ్చే మ్యూజిక్ ఇంకా ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన పూర్తి పాట ఆగస్టు 17వ తేదీన విడుదల కానుంది. ఇంకా చదవండి
సంక్రాంతి రేసులో విజయ్ దేవరకొండ సినిమా - అఫీషియల్ గురూ!
రాబోయే సంక్రాంతి రేసులో 'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా ఎంటరయ్యారు. ఆయన కథానాయకుడిగా 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా రూపొందుతోంది. విజయ్ దేవరకొండతో 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి (VD13 Movie Release Date) విడుదల చేయనున్నట్లు నేడు వెల్లడించారు. పండక్కి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అని పేర్కొన్నారు. ఇంకా చదవండి
వింబుల్డన్‌లో సంచలనం - ఫైనల్లో అన్‌సీడెడ్ మార్కెటా వోండ్రౌసువా వన్‌సైడెడ్ విక్టరీ!
వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సంచలనం నమోదైంది. అన్‌సీడెడ్ మార్కెటా వోండ్రౌసువా 6-4, 6-4తో ఆరో సీడ్ ఆన్స్ జబ్యూర్‌పై విజయం సాధించింది. అన్‌సీడెడ్ మార్కెటా వోండ్రౌసువాకు ఇదే మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్. వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా నిలిచింది. 2019 ఫ్రెంచ్ ఓపెన్‌లో మార్కెటా వోండ్రౌసువా ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటివరకు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో అదే మార్కెటా వోండ్రౌసువాకు అత్యుత్తమ ప్రదర్శన. ఇంకా చదవండి
హ్యుందాయ్ కార్లు కొనాలనుకుంటున్నారా - అయితే జులై బెస్ట్
హ్యుందాయ్ మోటార్ జూలైలో ఎంపిక చేసిన కార్ల కొనుగోలుపై తన వినియోగదారులకు అనేక ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. కస్టమర్లు ఈ ఆఫర్‌పై నగదు తగ్గింపు, కార్పొరేట్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్ కింద మీరు రూ. ఒక లక్ష వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇంకా చదవండి