NDA Meeting :  పద్దెనిమిదో తేదీన  ఢిల్లీలో జరగనున్న నేషనల్ డెమెక్రటిక్ అలయన్స్ మీటింగ్ ఏపీ రాజకీయాల్లో కీలకం అవుతోంది. నిజానికి అది ఎన్డీఏ మిత్రపక్షాల మీటింగ్ కాదు. ఎన్డీఏ ఏర్పడి పాతికేళ్లయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విందు సమావేశం. ఇందలో ఎన్డీఏలో భాగస్వామ్యగా ఉన్న వాళ్లని కాకుండా గతంలో ఎన్డీఏలో  భాగంగా ఉన్న పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నారు. కూటమిలో చేరే ఉద్దేశం ఉన్న పార్టీలు వస్తాయి.. లేకపోతే లేదు. ఆ ఉద్దేశంతోనే ఇప్పటికీ  ఉన్న మిత్రపక్షాలకు...విడిపోయిన మిత్రపక్షాలకు కూడా సమాచారం పంపినట్లుగా చెబుతున్నారు.  ఈ క్రమంలోనే ఏపీ నుంచి టీడీపీ, జనసేనలకు ఆహ్వానం అందిందని అంటున్నారు.                   


ఆహ్వానంపై ఎలాంటి ప్రకటనలు చేయని  టీడీపీ, జనసేన


ఎన్జీఏ మిత్రపక్షాల మీటింగ్‌కు ఆహ్వానం వచ్చిందా లేదా అన్న అంశంపై తెలుగుదేసం పార్టీ కానీ.. జనసేన కానీ స్పందించలేదు. అయితే  ఢిల్లీ బీజేపీ వర్గాలు మాత్రం.. సమాచారం పంపించామని..  రెండు పార్టీల నేతలూ హాజరవుతున్నారని చెబుతున్నారు. మంగళవారం ఉదయం చంద్రబాబు, పవన్ వేర్వేరుగా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఖరారు కాలేదు. పవన్ కల్యాణ్ రెండో విడత వారాహి యాత్రను  తుణుకులో ముగించారు.  సోమవారం తిరుపతికి వెళ్తున్నారు. అక్కడ్నుంచే ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. చంద్రబాబు టూర్ షెడ్యూల్ పై స్పష్టత లేదు. ఆదివారం లేదా సోమవారం .. క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.         


విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయం ప్రారంభం ఎప్పుడంటే ? - అసలు విషయం చెప్పిన వైవీ సుబ్బారెడ్డి !


కేవలం ఎన్డీఏ, పూర్వ మిత్రపక్షాల డిన్నర్ మీటింగ్ మాత్రమే! 


ఎన్డీఏ పక్షాల మీటింగ్ కాదని బీజేపీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. రాజకీయ అజెండా ఉన్నప్పటికీ.. ఎన్డీఏలో ఇప్పుడు భాగంగా లేకపోయినా గతంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలన్నింటినీ పిలుస్తున్నారు. ఎన్డీఏ ఆవిర్భావ సమయంలో చంద్రబాబు అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఎన్డీఏ కన్వీనర్ గా కూడా ఉన్నారు. తర్వాత రాజకీయ పరిణామాలతో విడిపోవడం.. మళ్లీ కలవడం జరిగాయి. ఇప్పుడు విడిపోయి..మళ్లీ బీజేపీకి దగ్గరవుతున్నారు. కానీ వైసీపీతో కూడా బీజేపీ దగ్గరగా ఉండటంతో.. బీజేపీతో కలిసేందుకు టీడీపీ వెనుకాడుతోంది. బీజేపీ అగ్రనేతలు చేసిన ఆరోపణలకు తగ్గట్లుగా జగన్ సర్కార్ పై చర్యలకు టీడీపీ డిమాండ్ చేస్తోంది.                              


ఎమ్మెల్యే కోనప్ప ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలి - BSP చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్


హాజరైన ఇప్పటికి పొత్తులపై స్పష్టత వచ్చే చాన్స్ లేనట్లే !


ఎన్డీఏ పూర్వ, ప్రస్తుత పక్షాల సమావేశానికి పవన్, చంద్రబాబు హాజరైనా.. పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం  లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికైతే  బీజేపీ తెలుగురాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. వైసీపీతో అనుకున్నంతగా  దూరం జరగలేకపోవడం ఓ కారణం అయితే.. ఏదో ఓ పార్టీని పొత్తులో కలుపుకుంటే..మరో పార్టీ దూరం అవుతుందని.. అలా కాకుండా రెండు పార్టీలతో సత్సంబంధాలు కొనసాగిస్తే.. ఎవరికి పార్లమెంట్ సీట్లు వచ్చినా తమకే మద్దతిస్తారని  బీజేపీ అనుకునే అవకాశం ఉంది.