JackFruit Flour: డయాబెటిస్ ఉన్నవారికి ఔషధం పనస పిండి - బియ్యం, గోధుమలకు బదులు దీన్ని వాడండి

డయాబెటిస్ రోగులపాలిట వరం ఈ పనస పిండి.

Continues below advertisement

JackFruit Flour: డయాబెటిస్ రోగులు ఏం తినాలన్నా ఇబ్బంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. అందుకే అన్నాన్ని తగ్గించి గోధుమలతో చేసే చపాతీలను తినేవారి సంఖ్య అధికంగా ఉంది. గోధుమలలో కూడా గ్లూటెన్ ఉంటుంది. ఇది కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి సహకరిస్తుంది. కాకపోతే నెమ్మదిగా అరుగుతుంది, కాబట్టి చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగవు. అందుకే బియ్యానికి బదులు గోధుమలతో చేసిన చపాతీలను తినేందుకు ఇష్టపడతారు. ఇప్పుడు ఈ రెండింటి కన్నా మంచి ఎంపిక ‘పనస పిండి’. ఈ పిండి అన్నిఈ కామర్స్ సైట్లలో కూడా జాక్ ఫ్రూట్ ఫ్లోర్ అని వెతికితే చాలు ఈ పిండి లభిస్తుంది. ఇది డయాబెటిస్ ఫ్రెండ్లీ ఆహారం. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ.

Continues below advertisement

దీనిలో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ క్రియను నెమ్మదించేలా చేస్తాయి. ఫలితంగా ఆహారంలోని గ్లూకోజ్ అధికంగా ఒకేసారి విడుదలవ్వదు. దీనివల్ల గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్ పొట్టని నిండుగా ఉంచుతాయి. కాబట్టి ఎక్కువ కాలం పాటు మీరు ఏమీ తినకుండా ఉంటారు. దీనివల్ల బరువు కూడా పెరగరు.

ఈ పిండితో మీరు దోశెలు చేసుకోవచ్చు. ఈ పనస పిండిని తొలిసారి కేరళకు చెందిన జేమ్స్ జోసెఫ్ తయారు చేశారు.అతనే దీన్ని పేటెంట్‌ను పొందారు. మధుమేహంతో జీవించే వ్యక్తుల కోసం దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. పచ్చి పనసకాయని ఎండబెట్టి అందులోని గింజలను పొడిగా మారుస్తారు. గ్లూటెన్ ఫ్రీ ఆహారం. మధుమేహం ఉన్నవారు, ప్రీడయాబెటిస్ బారిన పడినవారు ఈ  పనస పిండిని వాడితే మంచిది. దీని తయారీలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. 

బియ్యం పిండిని వాడే స్థానంలో 50 శాతం ఈ పనస పిండిని ఉపయోగించడం వల్ల అందరికీ ఆరోగ్యకరమే. భోజనంలో గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీనివల్ల గ్లైసమిక్ లోడ్ తగ్గుతుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి అని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పనస పిండిని కూడా మీ ఆహారంలో భాగం చేసుకోండి. డయాబెటిస్ బారిన పడిన వారు ఈ పిండిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉన్నట్టు తేలింది. ఇది పూర్తిగా మొక్కల నుంచి వచ్చిన ఆహారం. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 50 నుంచి 60 మధ్యలో ఉంటుంది. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫ్లేవనాయిడ్లు, విటమిన్ బి, విటమిన్ సిలు ఉంటాయి. ఇది దీర్ఘకాలంలో రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడతాయి.

పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాను కాపాడడానికి కూడా పనస పిండిలోని పోషకాలు సహకరిస్తాయి. మన రోగనిరోధక వ్యవస్థను శక్తివంతంగా చేశాయి. కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ తమ ఆహారంలో పనస పిండిని భాగం చేసుకోవడం మంచిది. వారానికి ఒకసారి అయినా పనస పిండితో చేసిన దోసెలు వంటివి తింటే ఎంతో ఆరోగ్య కరం.

Also read: మీరు వాడుతున్న నూనె కల్తీదో, మంచిదో ఇలా తెలుసుకోండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Continues below advertisement
Sponsored Links by Taboola