కొన్ని రోజుల్లో పెళ్లి వంటి వేడుకలు ఉన్నప్పుడు చర్మాన్ని త్వరగా కాంతివంతంగా మార్చే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. రెండు వారాల్లో మీ చర్మాన్ని మెరిసేలా చేసే ఒక జ్యూస్ ఉంది. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకొని ప్రతి రోజూ తాగితే చాలు. రెండు వారాల్లో మీకు మెరిసే చర్మం సొంతమవుతుంది. దీని తయారు చేయడం చాలా సులువు. రుచి కూడా బాగానే ఉంటుంది. దీని ఎలా చేయాలో ఒకసారి తెలుసుకోండి.


దోసకాయను తీసుకొని ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పుదీనా ఆకులను కూడా తీసుకోవాలి. ఉసిరికాయ ముక్కలు, అర స్పూను జీలకర్ర పొడి, నిమ్మరసం, నీరు రెడీగా ఉంచుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి జ్యూస్‌లా చేసుకోవాలి. వాటిని పరగడుపున తాగేయాలి. ఇలా మీరు రెండు వారాలు చేస్తే చాలు, మీ చర్మం కాంతివంతంగా మారిపోతుంది.


ఇది ఒక వెజిటేబుల్ జ్యూస్. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తికి చాలా ముఖ్యమైనది. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి, చర్మం యవ్వనంగా ఉండేలా చూస్తుంది. ఇందులోని విటమిన్ సి... సూర్యరశ్మి, పర్యావరణ కారకాలు చర్మాన్ని రక్షిస్తుంది. విటమిన్ సి ఇక్కడ ఒక యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇక ఈ రసంలో ఉన్న మరో ముఖ్యమైన పోషకం పొటాషియం. ఇది శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. కూరగాయల రసంలో నీటి కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది. 


ఆరోగ్యానికి కూడా ఈ రసం ఎంతో ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి జీర్ణక్రియ సులభంగా జరిగేలా చేస్తుంది. దీనివల్ల శరీరం శరీరంలో ఇన్ఫ్లమేషన్ రాదు. కేవలం ఈ రసమే కాదు, బీట్రూట్ రసం, పాలకూర జ్యూస్ కూడా చర్మాన్ని నేర్పించడానికి ముందుంటాయి. ఈ జ్యూస్‌ను తాగుతూ రాత్రిపూట ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్ర పోవాలి. అప్పుడే చర్మం మెరుస్తూ ఉంటుంది. ఈ రసంలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం, సోడియం వంటివి నిండుగా ఉంటాయి. ఫైబర్ కూడా దీనిలో అధికంగా ఉంటాయి. ఈ జ్యూస్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇది సూపర్ ఎనర్టీ డ్రింకుగా ఇది పనిచేస్తుంది.చర్మ ఆరోగ్యానికి ఈ గ్రీన్ డ్రింకు చాలా అవసరం.  


Also read: ఇకపై రోగనిర్ధారణ పరీక్షల్లో లాలీపాప్స్ సహాయం, చెబుతున్న కొత్త అధ్యయనం





Also read: డయాబెటిస్ ఉన్నవారికి ఔషధం పనస పిండి - బియ్యం, గోధుమలకు బదులు దీన్ని వాడండి



























































































































































































































































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.