Warning Signs of Kidney Damage : మూత్రపిండాలు మొత్తం ఆరోగ్యంలో ముఖ్యమైనపాత్ర పోషిస్తాయి. ఇవి రక్తం నుంచి వ్యర్థాలను, అదనపు ద్రవాలను తొలగిస్తాయి. వాటిని శరీరం నుంచి బయటకు పంపడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. శరీరంలోని సోడియం, పొటాషియం, కాల్షియం వంటి రసాయనాల స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. రక్తపోటును నియంత్రించే హార్మోన్ల తయారీకి కిడ్నీలు బాధ్యత వహిస్తాయి. అందుకే వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. అయితే మూత్రపిండాల సమస్యలు అంత త్వరగా బయటపడవు. 


కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే.. అది వడపోత ప్రక్రియను నిర్వహించలేదు. దీనివల్ల శరీరంలో అదనపు నీరు టాక్సిన్లు పేరుకుపోతాయి. ఇవి వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. మూత్రపిండాల సమస్యలను మొదట్లో గుర్తించడం కష్టం. కానీ కొన్ని లక్షణాలతో కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించొచ్చు అంటున్నారు నిపుణులు. అలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు అశ్రద్ధ చేయొద్దంటున్నారు. మూత్రపిండాల పనితీరులో లోపాలను చూపే లక్షణాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 


అలసట


బ్లెడ్​ని ఫిల్టర్ చేసి.. శరీరం నుంచి విషాన్ని పంపడంలో మూత్రపిండాలు బాధ్యత వహిస్తాయి. అయితే అవి సరిగ్గా పనిచేయనప్పుడు.. శరీరంలో టాక్సిన్లు ఏర్పడతాయి. ఇవి ఎనర్జీని తగ్గించి అలసటనిస్తాయి. ఎర్ర రక్తకణాలను తయారు చేయడంలో కూడా కిడ్నీలు విఫలమవుతాయి. దీనివల్ల RBC తగ్గుతుంది. దీనివల్ల కండరాలు, మెదడుకు సరైన మొత్తంలో ఆక్సిజన్ అందదు. అప్పుడు మీరు ఏమి చేసినా.. చేయకున్నా అలసిపోతూ ఉంటారు. పైగా అలసట పలు ఆరోగ్య సమస్యల్ని సూచిస్తుంది. అందుకే మీరు త్వరగా నీరసపడిపోతున్నారనిపిస్తే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 


బ్లెడ్ యూరిన్


కిడ్నీలు సరిగ్గా పని చేయకుంటే.. మూత్రంలో అల్బుమిన్ అనే ప్రోటీన్ అధిక స్థాయిలో పెరుగుతుంది. దీనివల్ల యూరిన్​ ద్వారా నురుగు వస్తుంది. అలాగే మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకుండా.. యూరిన్ గోధుమరంగు లేదా లైట్​ కలర్​లో మారిపోతుంది. మూత్రంశయంలోకి రక్తం లీక్​ అయ్యే ప్రమాదం ఎక్కువ అవుతుంది. దీనివల్ల యూరిన్ ద్వారా బ్లెడ్ లీక్ అవ్వొచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు, కణితులు, ఇన్​ఫెక్షన్ల వల్ల కూడా మూత్రం నుంచి రక్తం లీక్ అవుతుంది. 



కండరాల తిమ్మిరి..


మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకుంటే కండరాల తిమ్మిరికి దారితీస్తుంది. ఎందుకంటే ఇది శరీరంలోని రసాయనాలను అసమతుల్యం చేస్తుంది. దీనివల్ల కండరాలు, నరాలపై ప్రెజర్ పడుతుంది. వాటి పనిలో అంతరాయం కలుగుతుంది. కండర రాశి దెబ్బతింటే.. ఏ పని చేసుకోవాలన్నా కష్టమే అవుతుంది.


ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దగ్గరకు వెళ్లాలి. వారు సూచించే మందులు, ఫుడ్​ని రెగ్యూలర్​గా తీసుకుంటే పరిస్థితి తీవ్రం కాకుండా ఉంటుందంటున్నారు నిపుణులు. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచే కొన్ని ఫుడ్స్​ను రెగ్యూలర్​గా డైట్​లో చేర్చుకోవాలి. అలాంటి వాటిలో రెడ్ బెల్ పెప్పర్స్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, వెల్లుల్లి, ఉల్లిపాయ, యాపిల్స్, బెర్రీలు తీసుకోవచ్చు. ఈ ఫుడ్స్​లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 



Also Read : ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పనులు అస్సలు చేయొద్దట.. మొదటి మూడు నెలల్లో ఇవి కచ్చితంగా ఫాలో అవ్వాలట