Activities to avoid during pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు. ఇంట్లో పెద్దలు ఉంటే ఈ విషయం చెప్తారు. కానీ కొందరు పేరెంట్స్​కి దూరంగా ఉంటారు. ఒకవేళ రెండో ప్రెగ్నెన్సీ అయినా ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదనే అంశాలపై అవగాహన ఉంటుంది. కానీ మొదటిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు కొన్ని విషయాలపై కచ్చితంగా అవగాహన ఉండాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొన్ని పనులకు వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు. 


ప్రెగ్నెంట్ అయినా ప్రతి స్త్రీకి దీని గురించి తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లపై అంతగా అవగాహన ఉండదు. ఆ సమయంలో ఏమి చేయాలో? ఏమి చేయకూడదో కూడా పెద్దగా ఐడియా ఉండదు. అందుకే ప్రతి స్త్రీ ప్రెగ్నెన్సీకి ముందు లేదా ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని విషయాలపై అవగాహన తెచ్చుకోవాలి అంటున్నారు నిపుణులు. గర్బిణీ స్త్రీలు వేటికి దూరంగా ఉండాలి? ముఖ్యంగా గర్భం దాల్చిన మొదటి నెలల్లో ఏమి చేయకూడదు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


హెల్తీ లైఫ్ స్టైల్


హెల్తీ ప్రెగ్నెన్సీ లీడ్ చేయాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా గర్భిణీలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. పోషకాహారంపై దృష్టిపెట్టాలి. పోషకాలతో నిండిన డైట్​ నిపుణుల సలహా మేరకు తీసుకుంటే మంచిది. మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఈ రెండు కూడా మానసికంగా, శారీరకంగా మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తాయి. అలాగే మీరు విటమిన్లు, పెయిన్ కిల్లర్స్, ఓవర్ ది కౌంటర్ వంటి మెడిసెన్స్ తీసుకునేవారు అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కచ్చితంగా మీరు వైద్యుల సలహా తీసుకోవాలి. వారి సూచనల మేరకే వీటిని వినియోగించాలి. 



స్ట్రాంగ్​గా ఉండేందుకు


ప్రెగ్నెన్సీ సమయంలో కచ్చితంగా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. రెగ్యూలర్​గా వీటిని చేయడం వల్ల మీరు నీరసంగా ఉండకుండా యాక్టివ్​గా, శక్తివంతంగా ఉంటారు. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే కొన్ని అసౌకర్యాలను ఇది దూరం చేస్తుంది. దీనిని కంటిన్యూ చేస్తే డెలివరి సమయంలో కూడా మీరు శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్​గా ఉంటారు. కాబట్టి రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయండి. పది నిమిషాలు చేసి రెస్ట్ తీసుకుని మరో పది నిమిషాలు చేయండి. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయేంటి అంటే ఎక్కువ బరువులు ఎత్తడాలు, ఎక్కువ ప్రెజర్ పెట్టే వ్యాయామాలు చేయకూడదు. తేలికపాటి వ్యాయామలు చేస్తే చాలు. 


వేటికి దూరంగా ఉండాలంటే.. 


ప్రెగ్నెన్సీతో ఉన్నవారు మద్యం, పొగాకు, గంజాయి, డ్రగ్స్ వంటివాటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవన్నీ కడుపులోని పిండానికి హాని కలిగిస్తాయని చెప్తున్నారు. ఇవి పుట్టబోయే బిడ్డలకే కాకుండా గర్బిణీలకు కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి. కఠిన వ్యాయామాలు, పనులు అస్సలు చేయకూడదని వైద్యులు చెప్తున్నారు. ధూమపానం, మద్యం వంటి అలవాట్లు వీలైనంత త్వరగా మానేయడానికి ట్రై చేయండి. 


Also Read : 15 ఏళ్ల కిడ్స్​లో పెరుగుతోన్న లైంగిక సమస్యలు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న WHO.. కారణమిదే


వాటి వల్ల ఇన్​ఫెక్షన్లు వస్తాయట


హాట్ షవర్స్​ అస్సలు చేయకూడదు. ఎందుకంటే వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశముంది. ఇది మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మీరు స్నానం చేసే నీరు 36 డిగ్రీల కంటే తక్కువగానే ఉండాలి. వైద్యుల సూచనలు లేకుండా కొన్ని మెడిసిన్స్ అస్సలు తీసుకోకూడదు. ఎండలో ఎక్కువసేపు ఉండకండి. సన్​స్క్రీన్ కచ్చితంగా అప్లై చేసుకోవాలి. చెవిపోగులు కుట్టించుకోవడం, టాటూలు వేయించుకోవడం అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇవి ఇన్​ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి. 



పిండంపై ఒత్తిడి పెరుగుతుందట


ప్రెగ్నెన్సీ సమయంలో స్కూబా డైవింగ్ వంటివి చేయకపోవడమే మంచిది. ఇవి బిడ్డకు హాని కలిగించి.. పిండంపై ఒత్తిడిని పెంచుతాయి. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. థ్రిల్లింగ్ గేమ్స్, భయపెట్టే అడ్వెంచర్లకు దూరంగా ఉండాలి. ఇవి కడుపులోని పిండానికి మంచిది కాదు. ఆల్కహాల్ లేని డ్రింక్స్ మాత్రమే తీసుకోవాలి. వైద్యులు ఇచ్చిన మెడిసిన్స్ రెగ్యూలర్​గా ఉపయోగించాలి. అలాగే ఫుడ్, బెడ్ విషయంలో ఎలాంటి కాంప్రిమైజ్​లు లేకుండా చూసుకోవాలి అంటున్నారు నిపుణులు. 


Also Read : పిల్లలు పుట్టేందుకు ఏజ్ లిమిట్ ఉందా? ఆ వయసు దాటితే పేరెంట్స్ కాలేరా?