STI prevention among Gen Z : కౌమారదశలోని పిల్లల్లో లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు ఎక్కువవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. 15 ఏళ్ల వయసున్న వారిలో దాదాపు మూడింట ఒకవంతు మంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారని తెలిపింది. ఈ జెన్​ జి కిడ్స్ కండోమ్స్ వాడకం, గర్భనిరోధక మాత్రలు ఉపయోగించకుండా అసురక్షితమైన లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని ఇటీవలి అధ్యయనం తెలిపింది.


అసురక్షితమైన లైంగిక చర్యలు శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, మానసిక ఆరోగ్యాన్ని, సామాజిక శ్రేయస్సును కూడా ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక ప్రతికూల అంశాలను ప్రేరేపిస్తుంది. రెగ్యూలర్​గా అసురక్షితమైన లైంగిక చర్యల్లో పాల్గొనడం వల్ల గణనీయమైన ప్రమాదాలకు గురవుతారు. ఇది కాలక్రమేణా ఎక్కువై.. సామాజిక, ఆరోగ్య పర్యవసనాలకు దారి తీస్తుందని హెచ్చరించింది. 


లైంగికంగా సంక్రపించే అంటువ్యాధులు..


అసురక్షితమైన శృంగారంలో తరచుగా పాల్గొంటే వచ్చే అతి ముఖ్యమైన ప్రమాదాల్లో STIలు ఒకటి. లైంగికంగా సంక్రమించే ఈ అంటువ్యాధులు దీర్ఘకాలిక సమస్యలకు దారి తీస్తాయి. అంతేకాకుండా పూర్తి ఆరోగ్యంపై ప్రతికూలంగా ప్రభావం చూపిస్తాయి. మగవారిలో, ఆడవారిలో ఇవి ఎలాంటి సమస్యలను కలిగిస్తాయో ఇప్పుడు చూద్దాం. 



మహిళల్లో క్లామిడియా, గోనేరియా వంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి. పెల్విక్ ఇన్​ఫ్లమేటరీ డీసీజ్​లు వస్తాయి. ఇవి వంధ్యాత్వానికి, దీర్ఘకాలిక పెల్విక్ నొప్పికి దారి తీస్తాయి. పురుషుల్లో అయితే ఈ లైంగిక అంటు వ్యాధులు ఎపిడిడైమిటిస్​కు దారితీస్తుంది. ఇది ఎపిడిడైమిస్​ వాపు, పురుషుల్లో సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు. హెర్పెస్ అనే వైరస్ పునరావృతమయ్యే వ్యాప్తికి కారణమవుతుంది. దీని దీర్ఘకాలిక స్వభావం కారణంగా తరచూ అసౌకర్యంగా ఉండడంతో పాటు.. మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. 


HIV


అసురక్షితమైన లైంగిక చర్యవల్ల కలిగే అత్యంత ప్రధానమైన సమస్యల్లో HIV ఒకటి. దీనికి చికిత్స లేదు కాబట్టి ఎయిడ్స్​గా మారుతుంది. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది. జ్వరం, నీరసంతో ఆయుర్దాయం అవుతుంది. ఈ హెచ్​ఐవీ-హ్యూమన్ పాపిల్లోమా వైరస్ స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్​కు దారి తీస్తుంది. పురుషులు, స్త్రీలలో గొంతు క్యాన్సర్​తో సహా వివిధ క్యాన్సర్లకు కారణమవుతుంది. 


అన్​వాంటెడ్ ప్రెగ్నెన్సీ 


అసురక్షితమైన సెక్స్ ఆరోగ్యాన్ని శారీరకంగా, మానసికంగా ప్రభావితం చేస్తుంది. అన్​వాంటెడ్ ప్రెగ్నెన్సీకి దారి తీస్తుంది. ఈ తరహా గర్భాలు పిల్లలపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఎర్లీ ప్రెగ్నెన్సీ మధుమేహం, ఫ్రీక్లాంప్సియా వంటి ఆరోగ్యసమస్యలకు దారి తీస్తుంది. ఈ రెండూ కూడా బాలికల ఆరోగ్యంపై శాశ్వత ప్రభావాలను కలిగిస్తాయి. ప్రసవానంతరం కూడా పలు సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలిక శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి. 


మానసిక ఒత్తిడి.. 


ఈ తరహా ప్రెగ్నెన్సీ ఆందోళన, మానసిక క్షోభను పెంచుతుంది. ముఖ్యంగా మానసిక సవాళ్లను పెంచుతుంది. ముఖ్యంగా పెళ్లికాకముందు ప్రెగ్నెన్సీ అనేది మానసిక, శారీరక సమస్యలను పెంచుతుంది. పిల్లల పెంపకం ఇబ్బంది అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఖర్చులు పెరిగి ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది. కెరీర్​ పరంగా ముందుకు వెళ్లలేరు. విద్యపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. 


Also Read : ఈ రెగ్యూలర్​ ఫుడ్స్​తో లైంగిక ఆరోగ్యానికి ఎన్ని లాభాలో.. శృంగార జీవితానికి ఇవి చాలా మంచివట


శారీరక ఆరోగ్య సమస్యలు 


అసురక్షితంగా లైంగిక చర్యలో పాల్గొంటే ఇన్​ఫెక్షన్లు ఎక్కువ అవుతాయి.  జననేంద్రియాల్లో చికాకు వస్తుంది. సంభోగం తర్వాత చికాకు.. పుండ్లు పడడం, వాపునకు కారణమవుతుంది. చికాకు వల్ల చిన్నపాటి ఇన్​ఫెక్షన్లు కాస్త.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. మహిళల్లో యోని ఇన్​ఫెక్షన్లు పెరుగుతాయి. 


ఎలా రక్షించుకోవచ్చంటే.. 


లైంగిక ఇన్​ఫెక్షన్లు, అన్​వాంటెడ్ ప్రెగ్నెన్సీ నుంచి రక్షించుకునేందుకు కండోమ్స్​ వాడాలి. లేదంటే గర్భనిరోధకాలను ఉపయోగిస్తే మంచిది. లైంగిక సమస్యలను ముందుగానే గుర్తించి.. జాగ్రత్తలు తీసుకోవాలి. మీ భాగస్వాములతో డైరక్ట్​గా మాట్లాడుకుంటే.. ఆరోగ్య ప్రమాదాలు రాకుండా కేర్ తీసుకోవచ్చు. ఇది ఇద్దరి ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణుసు. అయితే ఓ ఏజ్ వచ్చే వరకు, ఈ అంశాలపై అవగాహన వచ్చేవరకు ఈ చర్యల్లో పాల్గొనకపోవడమే మంచిది అంటున్నారు. 


Also Read : రాత్రుళ్లు ఆ పనులు చేస్తే సైలెంట్ హార్ట్ ఎటాక్స్ తప్పవట.. ఆ మిస్టేక్స్ అస్సలు చేయొద్దంటోన్న నిపుణులు