Natural Libido Boosters for Men/Women : హెల్తీ లైఫ్.. హెల్తీ లైఫ్ స్టైల్ అంటే శారీరక, మానసిక ఆరోగ్యాలతో పాటు.. లైగింక ఆరోగ్యం కూడా బాగుండడమనే అంటున్నారు నిపుణులు. అందుకే ఈ విషయాన్ని విస్మరించవద్దని చెప్తున్నారు. ఫుడ్​ అనేది ఈ మూడు ప్రధాన అంశాలపై ప్రభావం చూపిస్తుంది. శారీరక ఆరోగ్యంతో పాటు.. మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందో.. అలాగే లైంగిక ఆరోగ్యంపై కూడా ఫుడ్ మంచి ప్రభావం చూపి మెరుగైన ఫలితాలు అందిస్తుంది. 


కొన్నిరకాల ఫుడ్స్ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు.. కొన్ని సమస్యలను దూరం చేస్తాయి. మానసిక స్థితిని మెరుగుపరచి.. శృంగార జీవితాన్ని ప్రమోట్ చేస్తాయి. ఇంతకీ ఎలాంటి ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలో.. వాటి వల్ల కలిగే లాభాలు ఏమిటో వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


డార్క్ చాక్లెట్స్..


చాక్లెట్ అంటే కేవలం ఆడవారే కాదు.. డార్క్ చాక్లెట్స్​ను మగవారు కూడా తీసుకోవచ్చు. ఇవి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లతో పుష్కలంగా నిండి ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఫెనెథైలమైన్, సెరోటోనిన్​ను శరీరంలో విడుదల చేసి లైంగిక కోరికను పెంచుతాయి. 


యాపిల్స్


యాపిల్స్ ఆరోగ్యానికి చాలా మంచివని అందరికీ తెలుసు. అయితే ఇది లైంగిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రెగ్యూలర్​గా యాపిల్ తినడం వల్ల మీ లైంగిక ఆరోగ్యం, డ్రైవ్ మెరుగుపడుతుందని.. ఆర్కైవ్ ఆఫ్ గైనకాలజీ అండ్ అబ్​స్టెట్రిక్స్​లో పబ్లిష్​ చేసిన అధ్యయనంలో ఉంది. ముఖ్యంగా యువతులు రెగ్యూలర్​గా యాపిల్ తీసుకోవడం వల్ల లైంగికంగా యాక్టివ్​గా ఉంటారని తెలిపింది. 


అల్లం


అల్లాన్ని అస్సలు తక్కువ అంచనా వేయకండి. ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. లైంగిక ఆరోగ్యానికి కూడా అన్ని బెనిఫిట్స్ ఇస్తుంది. ఇది మెరుగైన రక్తప్రవాన్ని అందించి.. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది శృంగారంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. పురుషులు, స్త్రీలలో లిబిడోను ప్రోత్సాహిస్తుంది. 


తేనె


దాదాపు అందరిళ్లల్లో ఉండే తేనె ఉంటుంది. మీకు తెలుసో లేదో కానీ ఇది స్టామినాను పెంచడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలోని బోరాన్.. హార్మోన్ సమస్యలను దూరం చేస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ లైంగిక కోరికను పెంచుతుంది. 


మెంతులు


మెంతుల్లో యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి లిబిడోని స్థాయిల్ని పెంచుతాయి. అంతేకాకుండా శరీరంలో ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్​ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. లైంగికంగా ప్రేరేపించి భావప్రాప్తిని అందిస్తాయి. వీటిలోని మెగ్నీషియం, జింక్ సంతానోత్పత్తిని ప్రోత్సాహిస్తాయి. 



దానిమ్మ


పురుషులు, మహిళల్లో లైంగిక కోరికను ప్రమోట్ చేయడంలో దానిమ్మ ముఖ్యపాత్ర పోషిస్తుంది. పైగా ఇది శృంగారం ఎక్కువసేపు కొనసాగేలా హెల్ప్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉన్న ఈ ఫ్రూట్​ని తీసుకుంటే ఒత్తిడి తగ్గి.. స్పెర్మ్ నాణ్యత పెరుగుతుంది. 


ఇవే కాకుండా అవకాడోలు, కుంకుమపువ్వు, వైన్ వంటివి కూడా లైంగిక ఆరోగ్యాన్ని ప్రమోట్ చేస్తాయి. అయితే వీటిని ఎలా తీసుకోవాలి. క్వాంటిటీ, క్వాలిటీ ఎంత ఉండాలో, ఎప్పుడు తీసుకోవాలో.. మీ శరీరానికి అవి మంచిదో కాదో వంటి విషయాలను నిపుణులను అడిగి తెలుసుకుంటే మంచిది. వైద్యుల సలహాలు తీసుకుని ఫాలో అయితే మెరుగైన ఫలితాలుంటాయి. 


Also Read : ఈ ఒక్క మసాలా దినుసుతో మగవారికి ఎన్ని ప్రయోజనాలో.. లైంగిక సమస్యలను కూడా దూరం చేస్తుందట















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.