పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు కిర్రాక్ అప్డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్ (Music Director Thaman)! 'ఓజీ' సినిమా (OG Movie First Single)లో ఫస్ట్ సింగిల్ గురించి ఆయన ఓ విషయం చెప్పేశారు. అది కొన్నాళ్ల నుంచి వినిపిస్తున్న వార్తే. ఇప్పుడు అఫీషియల్ చేసేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
పవన్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన శింబు!
పవర్ స్టార్ పవన్ కథానాయకుడిగా ఆయన డై హార్డ్ ఫ్యాన్ సుజిత్ రూపొందిస్తున్న సినిమా 'ఓజీ' (They Call Him OG). ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఇందులో టైటిల్ సాంగ్ కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడారు. ఆయనతో తమన్, సుజిత్ కలిసి ఫోటో దిగారు. ఆ స్టిల్ ట్వీట్ చేశారు తమన్.
సాంగ్ రెమ్యునరేషన్ తీసుకోలేదు...
ముందే విరాళం ప్రకటించేసిన శింబు!
పవన్ కళ్యాణ్ సినిమాలో శింబు పాట పాడుతారు అనేది కొన్ని రోజుల క్రితమే బయటకు వచ్చింది. ఎందుకంటే... ఏపీ, తెలంగాణలో ఇటీవల తలెత్తిన వరద విపత్తు సహాయక చర్యల కోసం శింబు విరాళం ప్రకటించారు. 'ఓజీ' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాలో సాంగ్ పాడినందుకు గాను రెమ్యూనరేషన్ ఇవ్వబోతే ఆయన ససేమిరా వద్దని చెప్పేశారు. అక్కడికి నిర్మాతలు బలవంతం చేయడంతో ఆ డబ్బులను తెలుగు ప్రజల కోసమే విరాళంగా ఇచ్చేసి తన మంచి మనసు చాటుకున్నారు శింబు. అది సంగతి!
Also Read: గిన్నిస్ రికార్డుల్లో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పేరు... తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబురం
త్వరలో సాంగ్ రిలీజ్ చేస్తారా?
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా 'ఓజీ' సినిమాలో సాంగ్ విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ సాంగ్ ఎప్పుడు విడుదల చేస్తాం అనేది సెప్టెంబర్ రెండున అప్డేట్ ఇస్తామని కూడా ముందు చెప్పారు. అయితే... ఏపీలో అనూహ్యంగా కురిసిన భారీ వర్షాలు, ఆ నీటి వరదకు ప్రజలు ఇబ్బంది పడడంతో ఓజీ అప్డేట్స్ కాదు కదా పవన్ సినిమాలకు సంబంధించిన ఏ అప్డేట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. దాంతో అప్పుడు సాంగ్ రిలీజ్ ఆగింది. ఇప్పుడు ఫ్యాన్స్ ఆ విషయం గుర్తు చేస్తూ త్వరలో ఏమైనా సాంగ్ విడుదల చేస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
పవన్ కళ్యాణ్ హీరోగా ముంబై మాఫియా నేపథ్యంలో సుజిత్ రూపొందిస్తున్న యాక్షన్ డ్రామా 'ఓజీ'లో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద అగ్ర నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్న చిత్రమిది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.