Pawan Kalyan Reaction on Chiranjeevi Name in Guinnis World Records | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి చేరింది. దాంతో చిరంజీవికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు అభినందలు తెలిపారు. పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు చిరంజీవి అరుదైన ఘనతపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తన అన్నయ్య చిరంజీవి పేరు గిన్నిస్ రికార్డుల్లో లిఖితం కావడం సంతోషదాయకం అన్నారు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్.


అన్నయ్య చిరంజీవికి సినీ ప్రపంచంలో రికార్డులు, విజయాలు కొత్త కాదు కానీ, ఈ రోజు అన్నయ్య చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకం. 156 చిత్రాలు... 537 పాటలు... 24 వేల స్టెప్స్ తో అలరించిన నటుడిగా చిరంజీవి పేరు నమోదు కావడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. ‘ద మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా’ అని గౌరవించడం ప్రతి ఒక్కరికీ ఆనందాన్నిస్తుంది. అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియచేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.




#GuinnessRecordForMEGASTAR 
#MegaGuinnessRecord 


చిరుకు దర్శక దిగ్గజం రాజమౌళి కంగ్రాట్స్ 
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో 24,000 పాటలకు డ్యాన్స్ చేశారని ఇందాకే చదివాను. చిరంజీవి 46 ఏళ్ల ప్రయాణం చాలా అద్భుతం. భారతీయ చిత్రసీమలో అత్యంత ప్రఖ్యాతి గాంచిన నటుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించినందుకు చిరంజీవికి అభినందనలు తెలుపుతూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి పోస్ట్ చేశారు.






 


హైదరాబాద్‌లో ఆదివారం నాడు జరిగిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్‌ నటుడు అమిర్‌ఖాన్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి ఈ అవార్డును అందుకున్నారు. చిన్నప్పటి నుంచి తనకు డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని, రేడియోలో పాటలు వింటూ ఉత్సాహంగా స్టెప్పులు వేసే వాడినని అవార్డు అందుకున్న సందర్భంగా చిరంజీవి చెప్పారు. ఎన్‌సీసీలో చేరిన తర్వాత సైతం రాత్రిళ్లు స్నేహితులు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తుంటే అంతే ఉత్సాహంగా డాన్స్ చేసేవాడినని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.