బహుశా ఎన్టీఆర్ కూడా ఈ విధంగా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. దేవర సినిమా గురించి ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఇప్పటివరకు అభిమానుల ముందుకు రాలేదు. నేరుగా అభిమానులకు కనిపించింది లేదు. 'దేవర' ప్రీ రిలీజ్ ఫంక్షన్ అభిమానుల సమక్షంలో జరపాలని కోరుకున్నారు. ఆయనను చూడాలని ఫ్యాన్స్, అభిమానుల మధ్యలో ఈవెంట్ చేయాలని ఆయన ఆశపడ్డారు. అయితే... అనూహ్యంగా ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానుల కోసం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. 


అభిమానుల కంటే నా బాధ పెద్దది!
''అభిమాన సోదరులకు నమస్కారం. ఈరోజు దేవర ఈవెంట్ జరగకపోవడం, క్యాన్సిల్ కావడం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు. అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, 'దేవర' గురించి మీకు చెప్పాలని నాకు ఉంటుంది. 'దేవర' కోసం మేం పడిన కష్టం మీ అందరికీ వివరించాలని చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈవెంట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్లీ చెబుతున్నాను మీతో పాటు నేను బాధపడుతున్నాను.‌ నా బాధ నీ కంటే పెద్దది'' అని ఎన్టీఆర్ తెలిపారు. 


నిర్మాతలు ఈవెంట్ నిర్వాహకులపై ఆగ్రహం వద్దు!
'దేవర' ఫంక్షన్ క్యాన్సిల్ కావడంతో ఈవెంట్ నిర్వహణ సంస్థ శ్రేయాస్ మీడియా మీద అభిమానులు ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు నిర్మాతలను సైతం నిందిస్తున్నారు. అయితే ఈ తరుణంలో వారికి అండగా ఎన్టీఆర్ నిలబడ్డారు. ''దేవర ఈవెంట్ క్యాన్సిల్ కావడం వల్ల నిర్మాతలు లేదంటే ఈవెంట్ నిర్వహకులను బ్లేమ్ చేయడం తప్పు'' అని ఆయన చెప్పారు.


Also Read: కుర్చీలు విరగొట్టిన ఫ్యాన్స్... 'దేవర' ప్రీ రిలీజ్ క్యాన్సిల్‌ అయ్యాక రచ్చ రచ్చ






అభిమానుల ఆశీర్వాదం నాకు అవసరం!
'దేవర' ఈవెంట్ ద్వారా అభిమానులను కలవడం కుదరకపోయినా...‌‌ ఈ శుక్రవారం (సెప్టెంబర్ 27న) థియేటర్లలో కలుద్దామని, ఇంతకు ముందు నుంచి చెబుతున్నట్లు అభిమానులు అందరూ కాలర్ ఎగరేసేలా ఈ సినిమా ఉంటుందని ఎన్టీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా చేయడం తన బాధ్యత అని, దానివల్ల వచ్చే ఆనందం మాటల్లో వర్ణించలేనని ఆయన వివరించారు.


Also Readబ్రేకింగ్ న్యూస్... 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ - మెయిన్ రీజన్స్ ఇవే



కొరటాల శివ అద్భుతమైన సినిమా తీశారని, 'దేవర' అందరిని మెప్పించేలా ఉంటుందని, ప్రేక్షకుల ఆశీర్వాదం ఈ సినిమాకు ముఖ్యంగా తనకు చాలా అవసరమని ఎన్టీఆర్ అన్నారు. తనమీద ఇంత ప్రేమ అభిమానం కురిపిస్తున్న ప్రేక్షకులకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. ఈవెంట్ కోసమని వచ్చిన ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి వెళ్లాలని ఆకాంక్షించారు.