గురక చాలా మందిలో కలిగే సాధారణ సమస్య. కానీ దీనివల్ల గురక పెట్టే వారి కన్నా మిగతావారే ఎక్కువ ఇబ్బంది పడతారు. ముఖ్యంగా టీనేజీ పిల్లలు గురక వినిపిస్తే సరిగా నిద్రపోలేరు. అలాగే భర్త గురక భరించలేక గొడవలు పడిన భార్యలూ ఉన్నారు. కొన్నిసార్లు గురక శబ్ధం చాలా ఎక్కువ కూడా వస్తుంది. అది అర్థరాత్రి పూట వినేందుకు భయపెట్టేలా కూడా ఉంటుంది. గురక రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. గురక నుంచి తప్పించుకునేందుకు ఆయుర్వేదం కొన్ని చిట్కాలను చెబుతోంది. ఇవి పాటించి చూడండి... మీ కుటుంబ సభ్యులను ప్రశాంతంగా నిద్రపోనిచ్చినవారవుతారు.
Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే
చిట్కాలివిగో...
1. యాలకులను పొడి చేసి చిన్న డబ్బాలో దాచుకోండి. రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో చిటికెడు యాలకుల పొడి కలుపుకుని తాగి పడుకోండి. కొన్ని రోజులకు గురక సమస్య తగ్గుముఖం పడుతుంది.
2. శ్వాసనాళాలలో ఏదైనా అడ్డంకి ఏర్పడినప్పుడు కూడా ఇలా గురక వస్తుంది. కాబట్టి పడుకునే ముందు గోరువెచ్చటి నీళ్లలో కాస్త పసుపు కలుపుకుని తాగితే శ్వాసనాళాల మార్గం క్లియర్ అవుతుంది. గురక వచ్చే అవకాశం తగ్గుతుంది.
3. రాత్రి పడుకునే ముందు రోజూ గుప్పెడు పచ్చి అటుకులు తినడం అలవాటు చేసుకోండి. దీనివల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు.
4. దాల్చిన చెక్కను పొడి చేసి రెడీగా పెట్టుకోండి. ఒక టీస్పూను తేనెలో కాస్త దాల్చిన చెక్క పొడి కలుపుకుని రాత్రి పడుకోబోయే ముందు తీసుకోండి. ఇలా రోజూ చేస్తుంటే సమస్య తగ్గే అవకాశం ఉంది.
5. పడుకునే భంగిమ వల్ల కూడా గురక సమస్య పెరగచ్చు. ముఖ్యంగా వెల్లకిలా పడుకుంటే గురక అధికంగా వస్తుంది. కాబట్టి ఓ వైపుకు తిరిగి పడుకునేందుకు ప్రయత్నించండి.
6. రాత్రి భోజనంలో పచ్చి ఉల్లిపాయను భాగం చేసుకోండి. దీనిలో సల్ఫర్, యాంటీ మైక్రోబియల్ గుణాలు అధికంగా ఉంటాయి. గురక సమస్యను పచ్చి ఉల్లిపాయ కాస్తయినా తగ్గిస్తుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే
Also read: తొలిసారి కరోనాకు చెక్ పెట్టేందుకు టాబ్లెట్... బ్రిటన్ ఆమోదం
Also read:ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి