Prevent Nighttime Heart Attacks : వివిధ కారణాల వల్ల చాలామందిలో హృదయ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా వయసు నలభై దాటిన పురుషుల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం తెలిపింది. నిద్రలో కూడా గుండె ఆగిపోయి.. ప్రాణాలు వదులుతున్నవారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. దానివల్ల ఈ తరహా గుండె సమస్యలను కంట్రోల్ చేయవచ్చని అంటున్నారు. ఇంతకీ వారు ఇచ్చే సలహాలు ఏమంటే.. 


అధిక కొలెస్ట్రాల్​లే కారణం..


అధిక కొలెస్ట్రాల్ నిద్రలో గుండె ఆగిపోవడానికి ప్రధాన కారణమవుతుందని స్టడీలో తేలింది. ముఖ్యంగా పురుషుల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా పెరిగి.. ఈ తరహా హార్ట్ ఎటాక్స్​కు కారణమవుతున్నాయని నిపుణులు తెలిపారు. అందుకే హై కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేసి.. గుండె సమస్యలను దూరం చేసుకోవాలంటున్నారు. సాధారణంగా చెడు కొవ్వు శరీరంలో ఎక్కువగా పేరుకుపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. పూర్తిగా జీవనశైలిని ఇది ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉంటే.. అది ప్రధానంగా గుండెపై ప్రభావం చూపిస్తుంది. 


గుండెకు ఆటంకం కలిగిస్తుంది..


శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే.. అది గుండెకు చేరే రక్తాన్ని అడ్డుకుంటుంది. గుండెకు సంబంధించిన బ్లాక్స్​ను క్లోజ్ చేస్తుంది. అంతేకాకుండా.. రక్తంలో కూడా కొలెస్ట్రాల్ పెరిగి.. అది గుండె పంపింగ్​కు ఆటంకంగా నిలుస్తుంది. తద్వార ఇది గుండెపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ధమనుల్లో కొలెస్ట్రాల్ పెరిగి.. గుండెకు రక్తప్రసరణ అందడం కష్టమవుతుంది. ఆ సమయంలో గుండెపోటు.. స్ట్రోక్స్ సహా.. తీవ్రమైన గుండె సమస్యలు పెరుగుతాయి. ఇవి ప్రాణాంతకమవుతాయి. అందుకే ఈ ఎల్​డిఎల్ స్థాయిలను కంట్రోల్ చేసి.. రాత్రి సమయంలో గుండెపోటును నివారించే చర్యలను ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. 


డైట్​లో మార్పు.. 


అధిక కొలెస్ట్రాల్​తో ఇబ్బంది పడుతున్నప్పుడు కచ్చితంగా ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. హెల్తీ డైట్​ను ఫాలో అయితే కొలెస్ట్రాల్ స్థాయిలో అదుపులో ఉంటాయని చెప్తున్నారు. వ్యాయామంతో పాటు.. కొన్నిరకాల ఫుడ్స్ రెగ్యూలర్​గా తీసుకోవాలంటున్నారు. ఒమేగా ఫ్యాటీ 3 కలిగిన ఫుడ్స్ తీసుకుంటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. బయటి ఫుడ్, చక్కెర ఎక్కువ కలిగిన ఫుడ్స్, ఫ్యాట్ ఎక్కువగా ఉండే రెడ్ మీట్ వంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 


వ్యాయామం కూడా..


ఉదయం వ్యాయామం చేసే వీలు లేకుంటే.. సాయంత్రమైనా వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు. ఇది మెరుగైన నిద్రను అందించడంతో పాటు.. కొలెస్ట్రాల్ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా జీవనశైలిలో మార్పులు చేసి.. నిద్రకు ప్రాముఖ్యతను ఇవ్వాలంటున్నారు. రెగ్యూలర్​గా వైద్య చికిత్సలు చేయించుకుంటే.. సమస్య కంట్రోల్​లో ఉంటుందంటున్నారు. 



ఈ లక్షణాలు కనిపిస్తే.. 


కొలెస్ట్రాల్​ అంత త్వరగా బయటకు కనిపించదు. కాళ్లు, పాదాలలో కొలెస్ట్రాల్ లక్షణాలు కనిపిస్తాయి. చిన్న చిన్న గడ్డలుగా ఏమైనా మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుని దగ్గరకు తీసుకెళ్లండి. ఇవి కంట్రోల్​లో లేకుంటే.. రక్తంలో ఎల్​డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి.. గుండెకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఇవే కాకుండా.. ఎక్కిళ్లు కూడా ఎక్కువగా వస్తాయి. కాబట్టి కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేస్తే రాత్రుళ్లే కాదు.. పగలు కూడా గుండె సమస్యలు రాకుండా హ్యాపీగా ఉండొచ్చని చెప్తున్నారు. 


Also Read : చిన్న వయసులోనే ఆడపిల్లలు పెద్దమనిషి అవ్వడానికి కారణాలు ఇవే.. ఆ ప్రమాదకర సమస్యలు తప్పవట






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.