Who Is Pavithra Gowda: ఒక స్టార్ హీరో అయ్యిండి ఒక మర్డర్ కేసులో నిందితుడిగా నిలవడంతో ప్రస్తుతం దర్శన్ గురించే అన్నీ భాషల పరిశ్రమల్లో చర్చలు నడుస్తున్నాయి. పైగా దర్శన్‌కు ఇదివరకే పెళ్లయినా కూడా పవిత్ర గౌడ అనే నటితో రిలేషన్‌షిప్‌లో ఉండడం, తనకోసం ఒక మర్డర్ చేయడం అనేది మరింత సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా విచారణ జరుగుతుండగా అసలు ఈ పవిత్ర గౌడ ఎవరు అని ప్రేక్షకులు తెలుసుకోవడం మొదలుపెట్టారు. నటిగా పవిత్రకు అంతగా గుర్తింపు రాకపోయినా.. కేవలం దర్శన్‌తో ప్రేమ వ్యవహరం వల్లే తను శాండిల్‌వుడ్‌లో ఒక రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకుందని నెటిజన్లు అంటున్నారు.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ..
పవిత్ర గౌడ.. మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది. వెండితెరపైకి వచ్చిన తర్వాత పవిత్ర గురించి ప్రేక్షకులకు తెలుసు. కానీ అసలైతే తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిందనే విషయం తాజాగా బయటపడింది. పవిత్ర గౌడ తండ్రి ఒక కిరాణా షాప్ ఓనర్ అని సమాచారం. కొన్నాళ్లు ఆమె దాని బాధ్యతలు చూసుకుందని, ఆ తర్వాత యాక్టింగ్ మీద ప్యాషన్‌తో మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిందని తెలిసింది. ఈ క్రమంలో ఆమెకు మిస్ బెంగుళూరు కిరీటం కూడా దక్కింది. దీంతో ఆమెకు వెండితెరపై హీరోయిన్‌గా అవకాశాలు రావడం మొదలయ్యింది. ముందుగా 2016లో ‘54321’ అనే తమిళ చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది పవిత్ర.
పెళ్లయ్యి విడాకులు..
తమిళంలో హీరోయిన్‌గా నటించిన సినిమా హిట్ అవ్వకపోయినా.. పవిత్ర గౌడకు కన్నడలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. ‘చత్రిగలు సార్ చత్రిగలు’, ‘అగమ్య’, ‘ప్రీతి కితాబు’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అదే సమయంలో తనకు స్టార్ హీరో దర్శన్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికే పవిత్రకు పెళ్లయ్యి ఒక కూతురు కూడా ఉన్నా మొదటి భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటోంది. అప్పుడే దర్శన్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత కొన్నిరోజులకే వీరిద్దరూ కలిసి లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉండడం మొదలుపెట్టారు. పవిత్రకు విడాకులు అయినా దర్శన్ మాత్రం తన భార్య విజయలక్ష్మితో కలిసుంటూనే పవిత్రతో కూడా రిలేషన్‌లో ఉన్నాడు.
గిఫ్ట్‌గా ఇల్లు, కారు..
దర్శన్‌తో కలిసున్న ఫోటోలు, వీడియోలను ఓపెన్‌గానే సోషల్ మీడియాలో షేర్ చేసేది పవిత్ర గౌడ. సినిమాలు తనకు అంతగా వర్కవుట్ అవ్వకపోయినా ప్రస్తుతం తను చాలా విలాసవంతమైన జీవితం గడుపుతోంది. దానికి కారణం దర్శనే అని కన్నడ ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఆర్ఆర్ నగర్‌లో పవిత్రకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిని కూడా దర్శనే తనకు గిఫ్ట్‌గా ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా పవిత్ర దగ్గర ఉన్న లగ్జరీ కారు కూడా ఆయన కొనిచ్చిందేనట. ఈ రిలేషన్‌షిప్ వల్ల దర్శన్‌కు, ఆయన భార్య విజయలక్ష్మికి పలుమార్లు గొడవలు కూడా అయ్యాయట. కానీ దర్శన్ ఇలా చేయడాన్ని తట్టుకోలేకపోయిన ఫ్యాన్స్ మాత్రం పవిత్ర పోస్టులపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.