Renuka Swamy Autopsy Report: కన్నడ స్టార్ హీరో దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచనలం సృష్టించడంతో.. పోలీసులు పకడ్బందీగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న దర్శన్, పవిత్ర గౌడ, పవిత్ర పని మనిషి పవన్, చిత్రదుర్గ దర్శన్ అభిమాన సంఘం అధ్యక్షుడు రాఘవేంద్రతో పాటు సుమారు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్శన్ తో పాటు పవిత్రగౌడను పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడి అయ్యాయి. రేణుకాస్వామిని చంపాలనే ఉద్దేశం తమకు లేదని, కేవలం అతడిని భయపెట్టాలని చూశామని చెప్పారు. రేణుకాస్వామి కిడ్నాప్ కోసం అభిమాన సంఘ అధ్యక్షుడు రాఘవేంద్ర సాయం తీసుకున్నట్లు వెల్లడించారు. తాజాగా రేణుకాస్వామికి సంబంధించి పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి.


కరెంట్ షాక్ ఇచ్చి.. దారుణంగా హింసించి..  


పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్ లు పెడుతున్న రేణుకాస్వామికి గట్టి బుద్ది చెప్పాలని దర్శను భావించాడు. చిత్రదుర్గలో ఉండే రేణుకాస్వామిని అదే ప్రాంతానికి చెందిన తన అభిమాన సంఘం నాయకుడు రాఘవేంద్రతో కిడ్నాప్ చేయించాడు. అక్కడి నుంచి రేణుకాస్వామిని బెంగళూరు సమీపంలోని ఓ షెడ్ లోకి తీసుకొచ్చారు. కారులో ఎక్కించుకున్నప్పటి నుంచి రేణుకాస్వామిని కొడుతూనే తీసుకొచ్చారు. బెంగళూరుకు తీసుకొచ్చాక అత్యంత ఘోరంగా హింసించినట్లు పోస్టుమార్టం రిపోర్టు వెల్లడించినట్లు సమాచారం.


విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పోస్ట్ మార్టం రిపోర్టులో ఈ విషయాలు బయటపడినట్లు తెలిసింది. కర్రలతో పాటు బెల్టుతో తీవ్రంగా కొట్టారు. బలమైన దెబ్బలకు రేణుకాస్వామి వెముకలు విరిగాయి. ప్రైవేట్ పార్ట్స్ మీద దారుణంగా కొట్టారు. తలతో పాటు శరీరంపై 30కి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. తల మీద బలంగా కొట్టడంతో పాటు కరెంట్ షాక్ ఇచ్చి చంపినట్లు శవపరీక్షలో వెల్లడైంది. శరీరంలో పలు చోట్ల తీవ్ర రక్తస్రావం అయినట్లు వైద్యులు అటాప్సీ రిపోర్టులో తెలిపారు.


మురికి కాల్వలో పడేసిన డేడ్ బాడిని కారులో వచ్చిన చూసిన దర్శన్   


రేణుకాస్వామి చనిపోయిన తర్వాత అతడి బాడీని పవన్, రాఘవేంద్ర కలిసి మురికి కాలువలో పడేశారు. డెడ్ బాడీనికి కుక్కలు తింటుండగా చూసి ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విచారణ మొదలు పెట్టిన పోలీసులకు సంచనల విషయాలు తెలిశాయి. మురికి కాలువలో వేసిన దర్శన్ డెడ్ బాడీని చూసేందుకు దర్శన్ అక్కడికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దర్శన్ వచ్చిన విజువల్స్ అక్కడి సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. ఆ విజువల్స్ ను పోలీసులు రిలీజ్ చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 15 మందికిపైగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ A1, దర్శన్ A2, పవిత్ర గౌడ పని మనిషి పవన్ A3, చిత్రదుర్గ దర్శన్ అభిమానసంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర A4గా ఉన్నారు.  


Read Also: భూమ్మీదకు రాని ఆ బిడ్డకు న్యాయం జరగాలి, అతడికి శిక్ష పడాల్సిందే - దర్శన్ అరెస్టుపై కిచ్చా సుదీప్ కీలక వ్యాఖ్యలు