Bigg Boss RJ Kajal About Her Remuneration: ఆర్జే కాజల్.. ఇప్పుడు అందరూ ఈమెని బిగ్ బాస్ కాజల్ అంటే గుర్తుపడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ - 5కి వెళ్లి ఫేమస్ అయ్యింది. ఆర్జేగా రేడియోలో గల గల మాట్లాడుతూ శ్రోతలను ఉర్రూతలూగించింది కాజల్. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా షోస్ చేస్తూ తన కెరీర్ కొనసాగిస్తుంది. అయితే, బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక సంపాదన పెరిగిందని, హ్యాపీగా ఉన్నానని చెప్తోంది కాజల్. ఆమె ఏమన్నారంటే?
మూడింతలు పెరిగింది..
బిగ్ బాస్ కి వెళ్లి వచ్చాక తను ఫైనాన్షియల్ గా సెట్ అయ్యానని, రెమ్యునరేష్ కూడా మూడింతలు పెంచేశానని చెప్పింది కాజల్. బిగ్ బాస్ తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగిందని, ఎందుకంటే బిగ్ బాస్ కి ముందు ఒక ఈవెంట్ కి తీసుకునే రెమ్యునరేషన్ మూడు రెట్లు పెరిగిందని చెప్పింది. దాంతో హ్యాపీగా ఉన్నానని అన్నారు కాజల్.
స్ట్రాటజీతో ఆడలేం..
బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాటజీతో ఆడారని, ప్లానింగ్ ప్రకారం ఉన్నారని అడిగిన ప్రశ్నకి ఆమె క్లారిటీ ఇచ్చారు. "బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు నా రియాక్షన్ ఒక పువ్వు విచ్చుకున్నట్లు నా గుండె బ్లూమ్ అయ్యింది. చాలా హ్యాపీ అనిపించింది. నేను సాధించాను అనిపించింది. ఫస్ట్ మా ఆయనకు చెప్పాను, అక్కకు చెప్పాను. మా ఆయన రియాక్షన్ ఏంటంటే? వద్దు వెళ్లొద్దు, మంచిది కాదు. నెగిటివిటీ అవసరమా అది ఇది అన్నాడు. అప్పుడు నేను.. ‘అయితే ఒప్పుకోకు.. నేను బిగ్ బాస్ కి వెళ్లి, మా ఆయన వద్దన్నాడు, అయినా వచ్చానని చెప్పి దాన్ని సింపతీగా చేసుకుంటా’ అన్నాను. అప్పుడు అమ్మ తల్లి నీకో దండం వెళ్లు అని ఒప్పుకున్నాడు. హౌస్ లోపలికి వెళ్లినప్పుడు ప్లాన్ చేసుకుని వచ్చాను అనే ఫీలింగ్ ఉంది. కానీ షో చూడటం వేరు అక్కడ యాక్టింగ్ చేయడం వేరు. అక్కడ యాక్టింగ్ చేయలేం, రియాల్టీ ఉంటుంది. కోర్ పర్సనాలిటీ బయటికి వస్తుంది. రెండు రోజులు యాక్టింగ్ చేయగలం. అంతేకాని ఎక్కువ రోజులు చేయలేం. నేను టాస్క్ ఆడినా ఏదైనా రియల్ గా చేశాను. ప్లానింగ్ వర్కౌట్ అవ్వదు బిగ్ బాస్ లో. కానీ బిగ్ బాస్ నుంచి వచ్చేశాక అనుకున్నాను కొంతమంది కొన్ని కొన్ని స్ట్రాటజీస్ తో వచ్చారు. నేను గేమ్ ప్లాన్ స్ట్రాటజీ వేసుకోలేదే అనిపించింది. నేను ఫ్లోలో ఆడేశాను. స్ట్రాటజీతో ఏమీ ఆడలేదు. నా ఒక్కదాన్నే కాదు. గీతూ, ఆదిరెడ్డిని అందరినీ అలానే అనుకున్నారు. నేను చెప్పుకోవడం వల్లే నాకు అలా అయ్యింది. నేను చెప్పుకున్నాను కాబట్టి అలా అనుకున్నారు. ఆదిరెడ్డి, గీతూ షోకి రివ్యూస్ ఇస్తున్నారు. షోని ఎనలైజ్ చేస్తున్నారంటే వాళ్లకు మొత్తం తెలుసు అనే ఫీలింగ్ వస్తుంది. ఎవ్వరూ ప్లాన్ చేయరు. చేసి వెళ్లి ఆడలేరు. వెళ్లాకే తెలిసింది ఆ విషయం కూడా."
బిగ్ బాస్ వల్ల మంచి చెడు రెండూ ఉంటాయి...
"బిగ్ బాస్ ని ప్రతి ఒక్కరు ఎక్స పీరియెన్స్ చేయాలి అంటాను. బిగ్ బాస్ వళ్ల చెడు ఉంటుంది మంచి ఉంటుంది. నో వేర్ టూ సమ్ వేర్.. ఎలాంటి ఫేమ్ లేనివాడివి నీ పేరుతో సహా అందరికీ తెలుస్తుంది బిగ్ బాస్ వల్ల. అనీ కెరీర్ ని ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే. ఫేమస్ అవ్వాలి అనుకుంటే బిగ్ బాస్ రైట్ ఫ్లాట్ ఫాం. కానీ, ఆ తర్వాత కంటిన్యూ గా కనిపించాలి. అప్పుడే అందరికీ గుర్తుండిపోతారు. ఆడియెన్స్ మెమొరి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం కనిపించాలి వాళ్లకు కచ్చితంగా ఏదో ఒక షో లో ఉండాలి. లేదంటే మనం జీరో అయిపోయాం అనుకుంటారు అందరూ."
కలుస్తున్నాం.. కానీ, వాళ్లు బిజీ
"బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక నేను, మానస్, సన్నీ కలుస్తున్నాం. నేను, సన్నీ ఎక్కువగా కలుస్తాం. సన్నీ పార్టీస్ కి బాగా వెళ్తాడు. నేను కూడా వెళ్తాను. మానస్ పెద్దగా రాడు. కంప్లీట్లీ ఫ్యామిలీ మ్యాన్. 9 కల్లా ఇంటికి వెళ్లాలి. 12 లోపు ఇంట్లో ఉండాలి అలా ఉంటాడు. మేం ముగ్గురమే ప్లాన్ చేసుకుని కలవాలి అనుకోవడం చాలా తక్కువ. వాళ్లు కొంచెం బిజీగా ఉంటారు. అందుకే ప్లాన్ చేసి కలవలేకపోతున్నాం అంతే" అని బిగ్ బాస్ జర్నీ గురించి వివరించారు కాజల్.
Also Read: ‘బాహుబలి’ సీన్‌ను రీక్రియేట్ చేసిన నయన్ భర్త విఘ్నేష్ శివన్ - నీటిలో మునుగుతూ..