Trinayani Today Episode గాయత్రీ పాప చేతిలో గ్లౌజ్ తీసి నేనే ఇస్తాను అని తిలోత్తమకు అంటే తిలోత్తమ వద్దు అని వల్లభని తీసుకోమని చెప్తుంది. ఇక గ్లౌజ్ ఎవరు తీసుకొని ఉంటారు అని సుమన అడిగితే హాసిని విక్రాంతే అని అంటుంది. విక్రాంత్ అక్కడ లేడు కాబట్టి విక్రాంతే తీసుంటాడు అని అనేస్తుంది. తర్వాత గాయత్రీ పాపని తీసుకొని హాసిని వస్తుంది. నిన్ను గాయత్రీ పాప అని పిలవాలా అని పెద్దత్తయ్య అని పిలవాలా అని అంటుంది. 


విశాల్: వదినా అలా అని కొంప కూలగొట్టకు. ఏ క్షణాన నువ్వు నిజం బయట పెట్టేస్తావా అని భయంతో ఉంటున్నాను. 
హాసిని: అరే ఈ బుజ్జి తల్లిలా రిలాక్స్‌గా ఉండు విశాల్. ఇంతలో నయని అక్కడికి వస్తుంది. ఇద్దరూ టాపిక్ మార్చేస్తారు. నయని తిలోత్తమ గ్లౌజ్ విషయం బయట పడిపోతుందని తనకు అనిపిస్తుందని అంటుంది. సిక్త్‌సెన్స్‌కి అనిపిస్తే అది నిజం అవుతుందని విశాల్ అంటాడు. ఇక హాల్‌లో విక్రాంత్ ఫైల్ చెక్ చేస్తాడు. విశాల్‌ని కూడా చూడమంటే హాసిని వచ్చి మీ అన్నయ్య అయితే ఆలోచించాలి కానీ విక్రాంత్ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు అంటుంది. ఇంతలో గుమ్మడికాయ తీసుకొని డమ్మక్క వస్తుంది. విశాలాక్షి తీసుకురమ్మని చెప్పిందని అంటుంది. ఇంతలో విశాలాక్షి కూడా వస్తుంది. 


బయట నుంచి వచ్చిన విశాలాక్షిని ఇంట్లో వాళ్లు నమ్ముతున్నారు కానీ సొంత చెల్లిని నమ్మి ఆస్తి ఇవ్వడం లేదు అని తిలోత్తమ అంటుంది. దానికి హాసిని ఈ పది రోజుల్లో మీరు ఎంత ఆస్తి సంపాదించారు అని అడుగుతుంది. తిలోత్తమ 300 కోట్లు అని చెప్తే దాన్ని మీ ఇద్దరు కొడుకుల్ని పంచి ఇచ్చారా అని అడుగుతుంది. తిలోత్తమ తాను ఇవ్వనని చెప్తుంది. దానికి హాసిని సొంత కొడుకులకే మీరు ఇవ్వకపోయినప్పుడు నయని వాళ్లు చెల్లికి ఇవ్వలేదు అని గొడవలు పెట్టకండి అని అంటుంది. 


సుమన: అవన్నీ సరే కానీ ఇంతకీ గుమ్మడికాయ ఎందుకు తీసుకొచ్చారో చెప్పలేదు.
విశాలాక్షి: బలి ఇవ్వడానికి. 
హాసిని: ఎవరికి ఇస్తారు.
డమ్మక్క: ఈ కూస్మాండాన్ని బలి ఇవ్వాలి.
విశాలాక్షి: ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు పోవాలి అంటే గుమ్మడికాయ బలి ఇవ్వాలి.
డమ్మక్క: నయని పసుపు కుంకుమ కర్పూరం తీసుకొని రా. 
తిలోత్తమ: సడెన్‌గా ఇలాంటి పూజ చేయడం ఏంటి. దుష్ట శక్తులు ఎక్కడున్నాయని. అసలు ఉన్నాయి అని మీకు ఎవరు చెప్పారు.
విశాల్: లేకపోతే విశాలాక్షి చెప్పదమ్మ.
సుమన: పూజ పేరు చెప్పి ఎంతో కొంత నొక్కేయడానికి అత్తయ్య.
డమ్మక్క: నొక్కేయడానికి కాదు తొక్కేయడానికి. 
విక్రాంత్: అర్ధమైంది దుష్టశక్తిని కాల రాయడానికి ఈ పూజ చేస్తున్నారు.
తిలోత్తమ: ఆ పూజలు ఏవో మీరే చేసుకోండి.
విశాలాక్షి: నువ్వు ఉండాలి తిలోత్తమ అమ్మ. దుష్ట శక్తి ఇంటిలో నుంచి వెళ్లిపోవడం చూడాలి కదా.
తిలోత్తమ: నేను ఉండను. పూజ అంతా అయ్యాక పిలవండి వస్తాను.
విశాల్: పూజ ఎంత సేపు కాదమ్మా.
నయని: గుమ్మడికాయ గుమ్మానికి మూడుసార్లు తిప్పితే చాలు.
విశాలాక్షి: గుమ్మానికి కాదు. మీ అత్తయ్యకి చుట్టూ తిప్పాలి. నువ్వు ఉండకపోతే ఈ కూస్మాండం(గుమ్మడికాయ) నిన్ను ఎక్కడా కుదురుగా ఉండనివ్వదు.
తిలోత్తమ: అలాగా అది చూస్తాను అని వెళ్లిపోతుంది. 
విశాలాక్షి: డమ్మక్క కూస్మాండాన్ని కూడా వెళ్లనివ్వు. 


తిలోత్తమ బయట వెళ్లి కూర్చొంటే గుమ్మడి కాయ కూడా వెనకాలే వెళ్తుంది. అందరూ షాక్ అవుతారు. తిలోత్తమ చూసి షాక్ అవుతుంది. తిలోత్తమ ఎటు తిరిగితే అటు గుమ్మడికాయ తిరుగుతుంది. తిలోత్తమ గారడి ఆపమని ఇలాంటి పనులు చేస్తే బాగోదు అని విశాలాక్షిని అంటుంది. దానికి విశాలాక్షి నువ్వు చేసిన పనులు బాగున్నాయా అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్కీ, జున్నులను ఎత్తుకొని పరుగులు పెట్టిన మిత్ర.. చూసేసిన లక్ష్మీ!