Chiranjeevi Lakshmi Sowbhagyavathi serial today episode: మనీషా లక్ష్మీని చూస్తుంది. దేవయానికి చెప్పి మొత్తం హడావుడిగా వెతికిస్తుంది. దేవయాని చనిపోయిన మనిషి బతకడం కష్టమని మనీషా మాటలు కొట్టేస్తుంది. ప్రోగ్రాం దగ్గరకు మనీషాని తీసుకెళ్తుంది. ఇక లక్ష్మీ కూడా తను బతికున్నాను అని ఎవరికీ తెలీకూడదు అని ఎవరి కంట పడకూడదు అని అనుకుంటుంది. ఇక లక్ష్మీ మనీషా వాళ్లు వచ్చారు అంటే ఈ స్కూల్‌లో ఎవరి పిల్లలు చదువుతున్నారు అని అనుకుంటుంది. మరోవైపు భాస్కర్ అర్జున్‌ని కలుస్తాడు. ఇక లక్ష్మీ తన బిడ్డతో అర్జున్‌ వాళ్లతోనే వెళ్లిపోయిందని భాస్కర్ అనుకొని ఆ విషయం అర్జున్‌ని అడగాలి అనుకుంటాడు.


భాస్కర్: సార్ ఐదేళ్ల క్రితం లక్ష్మీ అనే ఒకామె తన బిడ్డతో మీ దగ్గరకు వచ్చింది కదా. తను ఇప్పుడు ఎక్కడుంది. నేను తనకి అన్నయ్య అవుతాను సార్.
అర్జున్: మనసులో లక్ష్మీ ఎవరికీ తన గతం చెప్పకూడదు అనుకుంది. నేను ఇప్పుడు చెప్తే తను లేని పోని చిక్కులో పడుతుంది. అందుకే నేను చెప్పకూడదు అనుకొని తనకు తెలీదు అని చెప్పేస్తాడు అర్జున్.
భాస్కర్: మీ దగ్గర ఉంది అని చాలా సంతోషంగా ఉన్నాను సార్. తను మీకు కనిపిస్తే చెప్పండి సార్ తనకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. విలువైనది అందించాలి.


ఇంతలో అర్జున్‌కి కాల్ వస్తుంది. అర్జున్ లక్ష్మీ దగ్గరకు వచ్చి  లక్ష్మీ కంగారు పడటంతో ఏమైందని ప్రశ్నిస్తాడు. లక్ష్మీ కవర్ చేస్తుంది. ఇక తన గురించి ఇందాక ఒకరు అడిగారు అని అర్జున్‌ చెప్తే లక్ష్మీ కంగారుగా ఎవరు అడిగారు.. ఏం అడిగారు.. అని ప్రశ్నలు కురిపిస్తుంది. కంగారు పడాల్సింది లేదని భాస్కర్ అడిగాడు అని చెప్తాడు. లక్ష్మీ బిడ్డతో రావడం అతను చూశాడని నీ గురించి అడిగినా ఏం చెప్పలేదు అని అర్జున్ అంటాడు. ఇక కాల్ రావడంతో వెళ్లిపోతాడు. భాస్కర్ తనకు విలువైనది ఏంటి అందించాలి అనుకుంటున్నాడు అని లక్ష్మీ ఆలోచిస్తుంది.


మరోవైపు పిల్లలు వాళ్ల తండ్రులకు పోటీలు మొదలవుతాయి. అర్జున్ వెళ్లిపోవడంతో జున్ను ఒంటరి అయిపోతాడు. అందరూ జున్నుని చూసి జాలి పడతారు. జున్నుని పక్కకి తప్పుకోమని జాను చెప్తుంది. ఇక జున్ను డల్ అయిపోతాడు. లక్కీ మిత్రతో అంకుల్ లేకపోవడం వల్ల జున్ను ఒంటరి అయిపోయాడు అని అంటుంది. జున్ను ఒంటరిగా పోటీలో పాల్గొంటాడు. అది చూసి మిత్ర గతంలో జున్ను తనతో గడిపిన మంచి సంఘటనలు గుర్తు చేసుకొని ఓ వైపు లక్కీని మరోవైపు జున్నుని ఎత్తుకొని పరుగు పెడతాడు. అది లక్ష్మీ చూస్తుంది. షాక్ అయిపోతుంది. మిత్రకు లక్కీకి ఏంటి సంబంధం అని జున్నుని మిత్ర ఎందుకు ఎత్తుకున్నాడని లక్ష్మీ ఆలోచిస్తుంటుంది. ఇక ఇద్దరిని ఎత్తుకొని పరుగెత్తినందుకు మా నాన్న గ్రేట్ అని లక్కీ అంటే జున్ను సెటైర్‌గా అవును అవును అంటాడు. ఇందులో మిత్ర ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని గెలిపించాడని జాను చెప్తుంది. ఇక జున్ను మిత్ర, అరవిందలను వేదిక మీదకు పిలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మి దాచిన ఫొటో గురించి ఇంట్లో అందరికీ చెప్పేసిన సీత.. నడి రోడ్డు మీద ఒంటరిగా మహా!