Seethe Ramudi Katnam Today Episode: సుమతి బతికే ఉంది అని తెలుసుకున్న మహాలక్ష్మి సుమతికి సంబంధించిన గుర్తులు, ఫొటోలు కాల్చేశాను అని  ఇంకా ఏమైనా ఫొటోలు ఉన్నాయా అని తన చీరల్లో వెతికితో మహాలక్ష్మి, సుమతి కలిసి ఉన్న ఒక్క ఫొటో కనిపిస్తుంది. అది చూస్తుండగా ఫొటో ఎగిరిపోతుంది. ఇక సీత అటుగా రావడం ఆ ఫొటోని రివర్స్‌లో పట్టుకొని చూడబోతే మహాలక్ష్మి సీత దగ్గర నుంచి లాక్కుంటుంది.


సీత: ఏంటి అత్తయ్య అంత కంగారు పడుతున్నారు. ఎందుకు ఫొటోని లాగేసుకున్నారు. ఫొటోలో ఏముందేంటి.
మహాలక్ష్మి: అది నీకు అనవసరం. 
సీత: ఏమైనా సీక్రెట్ ఉందా అత్తయ్య. నాతో చెప్పకూడదా.
మహాలక్ష్మి: నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు తప్పుకు.
సీత: అత్తయ్య అంత కంగారుగా ఎక్కడికి వెళ్తుంది. ఏదో రహస్యం ఉన్నట్లు ఉంది నేను తెలుసుకోవాలి. వెనకే వెళ్లాలి. అని ఆటోలో ఫాలో అవుతుంది


మహాలక్ష్మి రౌడీ కోటికి కాల్ చేసి కలుస్తుంది. సుమతి ఫొటో చూపించి తనని వెతకమని అంటుంది. ఇక సీత అందతా చాటుగా చూస్తుంది. ఎవరి ఫొటో అది తనకి చూపించకుండా రౌడీకి ఎందుకు చూపిస్తుంది అని అనుకుంటుంది. రౌడీ ఆ ఫొటోని ఫొటో తీసుకుంటాడు. ఇక సీత మహాలక్ష్మి దగ్గరకు వచ్చి ఫొటో లాక్కోవాలి అని ప్రయత్నిస్తుంది. సీత ఆ ఫొటో తీసుకుంటుంది. అందులో సుమతిని చూసి షాక్ అవుతుంది. 


సీత: ఇన్నాళ్లు సుమతి అత్తయ్య ఫొటో ఇంటి దగ్గర ఒక్కటి కూడా లేదని నేను అడిగితే ఈ ఫొటో ఉండి కూడా లేదు అని చెప్పారు. 
మహాలక్ష్మి: సుమతి గుర్తుగా దాచుకున్నాను.
సీత: కాస్త నమ్మేలా చెప్పండి అత్తయ్య. ఈ ఫొటో ఎందుకు దాచుకున్నారు. ఈ విషయం ఇంట్లో చెప్తే ఏమవుతుందో తెలుసా. మామయ్య గారు, మామ ఏమంటారో తెలుసా. ఇంట్లో అందరికీ ఈ ఫొటో గురించి చర్చ పెడతాను. అసలు రౌడీకి ఎందుకు ఫొటో చూపించారు. ఇప్పుడే నాతో నిజం చెప్పండి.


ఇంతలో ఇద్దరు ఆడవాళ్లు వచ్చి సీతని ఎవరు అని అడిగితే తన డ్రైవర్‌అని కొత్తగా పనిలో పెట్టుకున్నాను అని చెప్తుంది. ఇక వాళ్లు మహాలక్ష్మిని పొడుగుతారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత సీత నిజం చెప్పమంటే మహాలక్ష్మి చెప్పను అనేస్తుంది. ఇక సీత మహాలక్ష్మి కారు తాళం దాచేస్తుంది. ఇక సీత కారు నడుపుతాను అని మహాలక్ష్మిని పక్కన కూర్చొపెట్టుకుంటుంది. సీత డ్రైవింగ్‌కు మహాలక్ష్మి భయపడుతుంది. బ్రేక్ వేయమంటే బ్రేక్ ఏది అని సీత అంటుంది. కాళ్ల కిందని తొక్కు అని మహాలక్ష్మి అంటే యాక్సిలేటర్‌ తొక్కేస్తుంది. దీంతో మహాలక్ష్మి తాను డ్రైవింగ్ చేస్తాను అని అంటుంది. సీత సరే అని మహాలక్ష్మిని దిగమని మహాలక్ష్మి దిగాక నడిరోడ్డు మీద మహాలక్ష్మిని వదిలేసి వెళ్లిపోతుంది. ఇక సీత మహాలక్ష్మి కారులో ఆ ఫొటో పట్టుకొని ఇంటికి వస్తుంది. హాల్‌లో అందరూ కూర్చొని ఉంటారు. అందరూ ఎక్కడికి వెళ్లావు సీత అని అడిగితే ఒక నిజం వెనక వెళ్లానని చెప్తుంది. 


సీత: మీ అందరికీ ఓ నిజం చెప్పాలి. సుమతి అత్తయ్య ఫొటో కాలిపోయిన తర్వాత ఇంకో ఫొటో ఏదైనా ఉంటే బాగున్ను అనుకున్నాం కదా. మనతో పాటు సుమతి అత్తయ్య ఫొటో ఇంకొకటి లేదు అని మహా అత్తయ్య కూడా బాధపడింది. కానీ సుమతి అత్తయ్య ఫొటో ఉంది. ఇక అందరూ మహాలక్ష్మి అబద్ధం చెప్తుందా అని అడుగుతారు. దానికి సీత ఫొటో మహాలక్ష్మి అత్తయ్య దాచి పెట్టిందని ఫొటో అందరికీ చూపిస్తుంది. అందరూ ఫొటో చూసి షాక్ అయిపోతారు. ఫొటో వెనక ఏదో రహస్యం కూడా అత్తయ్య దాస్తుంది అని రోడ్డు మీద ఓ వ్యక్తికి ఈ ఫొటో చూపించి ఏదో చెప్పిందని ఏంటని ఎంత అడిగినా చెప్పడం లేదు అని అంటుంది. కారణం లేకుండా మహాలక్ష్మి ఏం చేయదు అని గిరిధర్, అర్చన, ప్రీతిలు అంటారు. మహాలక్ష్మి వచ్చి నిజం చెప్తుందని అంటారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: సత్యభామ సీరియల్: రేణుకని హాస్పిటల్‌కి తీసుకెళ్లిన రుద్ర.. బావ ప్లాన్ పసిగట్టేసిన సత్య హడావుడిగా పరుగులు!