Trinayani Today Episode వల్లభ తిలోత్తమకు కుడి చేతి గురించి అడిగితే అది రహస్యం అని తన చేయి వల్ల పట్టిందల్లా బంగారం అవుతుందని, ప్రతి దాంట్లో తిరుగులేని విజయం దక్కుతుందని దాని ద్వారా వీలైనంత ఆస్తి సంపాదించి నీకు ఇస్తాను అని నువ్వు చక్రవర్తి అవుతావు అని తిలోత్తమ చెప్తుంది. ఇక విక్రాంత్‌ గురించి అడిగితే వాడు తనవాడు కాదు అని తనని అనుమానిస్తున్నాడు అని వాడికి ఏమీ ఇవ్వనని అంటుంది. ఇక ఆ చేతి గురించి చెప్తే నేను కూడా నీలా చేసి డబ్బు సంపాదిస్తానని నాకు చెప్పడం లేదా అని వల్లభ తల్లిని అడుగుతాడు. దానికి తిలోత్తమ నువ్వు అంత రిస్క్ చేయలేవు అని అంటుంది. 


తిలోత్తమ: నేను తప్పు చేయలేదు కానీ నేరం చేశాను. అది ఏంటి అన్నది ఎవరికీ తెలీకుండా మ్యానేజ్ చేస్తూ వచ్చాను. నువ్వు ఎవరికీ చెప్పలేవు వల్లభ. నేను హింట్ ఇచ్చాను కానీ ఆన్సర్ చెప్పలేదు. అది తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. 
వల్లభ: మమ్మీ నాకు భయం వేస్తుంది. టెన్షన్ పెడుతున్నావు.
తిలోత్తమ: టెన్షన్ పడకు రేపు అఖండ స్వామి దగ్గరకు వెళ్తే కొద్ది కొద్దిగా నీకే అర్థమవుతుంది. 
వల్లభ: ఇప్పటికే మమ్మీ చేసిన ఘోరాలు చాలా ఉన్నాయి. లేటెస్ట్‌గా ఏం చేసిందో ఏంటో.


ఇక తిలోత్తమ వాళ్ల ఇంటి గేటు దగ్గర ఓ అబ్బాయి ఉంటాడు. ఇంటిని తొంగి తొంగి చూస్తాడు. వాడిని నయని చూస్తుంది. దగ్గరకు వెళ్లి ఎవరు అని అడుగుతుంది. ఆ పిల్లవాడు తన పేరు హర్ష అని చెప్తాడు. ఇక నయని తనకు ఆ పిల్లవాడికి ప్రమాదం జరుగుతున్నట్లు ముందే కనిపించిందని గుర్తు చేసుకొని బాబు నీకు ఏదో అపాయం కలిగింది కదా ఏం జరిగిందని అడుగుతుంది.ఆ పిల్లాడి కడుపునకు గాయం జరిగింది కదా అని అంటే హర్ష షాక్ అయి పారిపోతాడు. ఇక హాసిని, విశాల్ అక్కడికి వస్తారు. తిలోత్తమ చేతికి ఉన్న గ్లౌజ్ మనమే తీసేయాలి అని అంటుంది. 


హాసిని: విశాల్ తెచ్చిన బిందెలో కుబుసం లేకుంటే ఆ చేతి వెనక ఏముందో బట్టబయలు అయిపోయి ఉండేది.
విశాల్: అందులోకి కుబుసం ఎలా వచ్చిందో తెలీడం లేదు. 
 హాసిని: తెగించడమే ఈ సమస్యకు పరిష్కారం. ఆవిడని గట్టిగా పట్టుకొని గ్లౌజ్ తీసేద్దాం.
విశాల్: అప్పుడు అంతే సింపుల్‌గా నీ ప్రాణం తీసేస్తుంది.
నయని: అత్తయ్యకి ముసుగు వేద్దాం. అని నయని ఐడియా చెప్తుంది. 
విక్రాంత్: సుమన మా అమ్మ చేయి రహస్యం బయట పడకూడదు అని నువ్వు సాయం చేస్తున్నావా. మా అమ్మ చేతి మీద హారతి పడి గ్లౌజ్ కాలిపోతే మంటలు ఆరడానికి నీటిలో చేయి పెట్టింది కదా తర్వాత చేయి తీస్తే అందులో కుబుసం ఉంది కదా దాన్ని నువ్వే అందులో వేశావ్ కదా.
సుమన: అవ్వా మీకు ఆ మాట ఎలా అనాలి అనిపించింది. హారతి తెచ్చిన హాసిని అక్కని, హారతి తోసేసిన గాయత్రీ పాపని, నీళ్లు తెచ్చిన విశాల్‌బ్రోని ఏమీ అనడం లేదు కానీ నన్ను మాత్రం అంటున్నారు. అయినా మీ అమ్మ మీద మీకు జాలి లేదా. మీరెక్కడి కొడుకు అండీ. కన్న తల్లినే అనుమానిస్తున్నారు.
విక్రాంత్: మా అమ్మ ఏదో చేసింది. అందుకే పది రోజుల్లో కోటీశ్వరురాలు అయిపోయింది. అ రహస్యం నేను చేధిస్తా.


తిలోత్తమ రాత్రి కిందకి వస్తుంటుంటే నయని, విశాల్, హాసిని చాటుగా ఆమెను చూస్తుంటారు. గ్లౌజ్ ఎలా తీస్తామని ఆలోచిస్తూ తన ప్లాన్ ప్రకారం గ్లౌజ్ రహస్యం ఛేదించాలి అనుకుంటారు. సోఫాలో తిలోత్తమ కూర్చొని పడుకుంటే హాసిని తన వెంట తెచ్చుకున్న క్లాత్‌ని తిలోత్తమ ముఖం మీద కప్పుతాను అని ఈలోపు మీరు చేతిని చూసేయండి అని చెప్పి లోపలికి వెళ్తారు. హాసిని తిలోత్తమకు ముసుగు వేస్తుంది. నయని చేతి గ్లౌజ్ తీస్తుంటుంది. తిలోత్తమ ముసుగు తీయండని వేడుకుంటుంది. ఇంతలో కరెంట్ పోతుంది. విశాల్ వచ్చి నయని, హాసినీలను తీసుకెళ్లిపోతాడు. ఎవరు.. ఎవరు.. అని గోల చేస్తుంది. ఇక అందరూ హాల్‌లోకి వచ్చి ఏమైందని అడిగితే దగ్గరకు రావొద్దని అందరి మీద అరుస్తుంది. ఇక వల్లభ కరెంట్ ఫ్యూజ్ చెక్ చేస్తా అని వెళ్తాడు. 


తిలోత్తమ తన చేతికి చీర కొంగుని చుట్టేస్తుంది. ఎందుకు చేతిని అలా దానుకున్నావ్ అని విశాల్ అడుగుతాడు. దానికి తిలోత్తమ నేను చెప్పడం కాదు మీరు చెప్పండి నా ముఖానికి ముసుగు వేసింది ఎవరు? నా కళ్లు కప్పి నా చేతికి ఉన్న గ్లౌజ్ తీసి పారేశారు ఎవరు? అని సీరియస్‌గా ప్రశ్నిస్తుంది. ఇంతలో గాయత్రీ పాప కిందకి దిగుతుంది. గాయత్రీ పాప చేతిలో గ్లౌజ్ ఉంటుంది. అది చూసిన సుమన పాప చేతి గ్లౌజ్ తీసిందని చెప్తుంది. తిలోత్తమ కోపంతో ఎంత పని చేశావే నిన్ను అవతల విసిరి పారేస్తాను అని సీరియస్‌గా వెళ్తుంది. ఇంతలో నయని సీరియస్‌గా తిలోత్తమ చేయి పట్టుకొని నా కూతురు మీద చేయి వేస్తే బాగోదని హెచ్చరిస్తుంది. ఇక తిలోత్తమ ఆ గ్లౌజ్‌ని వల్లభకి తీసి ఇవ్వమని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జున్నుకి తనకి సంబంధం ఏంటన్న మిత్ర.. మనీషా కంట పడిన లక్ష్మీ బతికే ఉందని తెలిసిపోతుందా!