Satyabhama Today Episode రుద్ర క్రిష్‌ని పిలిచి రెస్టారెంట్‌లో టేబుల్ రిజర్వ్ చేశాను అని కానీ తండ్రి పని చెప్పడంతో రేణుకని తీసుకెళ్లడం కుదరదు అని సత్యని తీసుకెళ్లమని క్రిష్‌తో చెప్తాడు. నేను పోను అని క్రిష్ చిరాకు పడతాడు. రుద్ర మాత్రం వదలకుండా క్రిష్‌ని ఒప్పిస్తాడు. ఇక క్రిష్ సత్యని లంచ్‌కి పిలవాలి అని వెళ్తాడు. రుద్ర మాత్రం రేణుకని తీసుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్తాను అని అదే తన ప్లాన్ అని అనుకుంటాడు. ఇక క్రిష్ రెస్టారెంట్‌కి వెళ్దామని సత్యని అడిగితే రేణుక విషయం చెప్పొచ్చని సత్య సరే అంటుంది. ఇంట్లో వాళ్లకి చెప్తాను అని సత్య అంటే క్రిష్ వద్దనేస్తాడు. ఇద్దరూ బయల్దేరుతారు. 


రుద్ర: అడ్డం పడటానికి ఇప్పుడు సత్య లేదు. రూట్ మొత్తం క్లియర్‌ అయింది. రేణుకని హాస్పిటల్‌కి తీసుకెళ్లి గుట్టగా పని కానివ్వాలి. మనద్దరం బయటకు వెళ్లి చాలా రోజులు అయింది కదా. ఈ రోజు నిన్ను బయటకు తీసుకెళ్లాలి అనిపిస్తుంది. నీకు ఓ సర్‌ఫ్రైజ్ ఉంది పదా.
రేణుక: నేను రాను. నువ్వు ఎక్కడికి తీసుకెళ్తావో నాకు తెలుసు.
రుద్ర: నువ్వు ఇలా మొండికేస్తే నేను హాస్పిటల్‌కి కూడా తీసుకెళ్లను. నా సంగతి నీకు తెలుసు కదా. నువ్వు తెగిస్తే నేను తెగిస్తా. నీ కడుపులో ప్రాణం కాదు నీది కూడా తీసేస్తా. మర్యాదగా నడు.  
సత్య: అసలు మీ ఇంట్లో మగవాళ్లకి భార్యల్ని బయటకు తీసుకెళ్లే అలవాటే లేదు అనుకుంటా. మీ ఇంట్లో యజమాని బానిస అనే బంధం తప్ప భార్యాభర్తల బంధం ఉండదు అనుకుంటా.
క్రిష్: ఏంటి సత్య ఇది. మా ఫ్యామిలీ మీద దాడి చేస్తున్నావా ఏంటి. మనం బయటకు వచ్చింది ముచ్చట్లు చెప్పుకొని ఎంజాయ్ చేయడానికి ఇలా చాడీలు చెప్పుకోవడానికి కాదు.


ఇంతలో సత్యకు ఎక్కిళ్లు వస్తాయి. నీళ్లు తాగినా తగ్గకపోతే క్రిష్ సడెన్‌గా ముద్దు పెడతాడు. దీంతో ఎక్కిళ్లు అగిపోతాయి. ఏం చేశావ్ అని సత్య అడిగితే ఇది తన టెక్నిక్ అని నీ ఎక్కిళ్లు తగ్గిపోయాయని అంటాడు. తన ఫ్యామిలీ గురించి మాట్లాడినందుకే ఇలా అయిందని చెప్తాడు. 


క్రిష్‌: సత్య నీకు ఓ మాట చెప్పనా చూడటానికి మొండి వాడిలా కనిపిస్తాడు కానీ మా అన్నకి వదిన అంటే చాలా ఇష్టం తెలుసా. వదిన కోసమే రెస్టారెంట్‌లో లంచ్‌కి టేబుల్ బుక్ చేశాడు. లాస్ట్ మినిట్‌లో మా బాపు అన్నకి ఏదో పని చెప్పడంతో నిన్ను నాతో తీసుకెళ్లమని చెప్పాడు. 
సత్య: మనసులో.. సడెన్‌గా బావగారికి ఈ ప్రేమ ఏంటి. ఏదో ప్లాన్ వేసినట్లున్నారు. అందుకు అడ్డం అని నన్ను బయటకు పంపాలని ఇలా ప్లాన్ చేశారు. కొంపతీసి అక్కని హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి అని ఇదంతా చేస్తున్నారా. అక్క కడుపులోని బిడ్డ.. 


మరోవైపు రుద్ర రేణుకని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తుంటాడు. రేణుకు తనకు బిడ్డ కావాలి అని ఎంత చెప్పినా రుద్ర వినడు. గర్భం తీయించాల్సిందే అని తిడతాడు. ఇంతలో సత్య రేణుకకి కాల్ చేస్తుంది. రుద్ర ఫోన్ తీసుకొని కట్ చేసి కారు వెనక సీటులో ఫోన్ పడేస్తాడు. రేణుక కాల్ కట్ చేసింది అంటే దాని అర్థం పక్కన రుద్ర ఉంటాడని సత్య అనుకుంటుంది. ఇక రేణుక గదిలో చూసిన ఫైల్ గుర్తు చేసుకొని ఆ హాస్పిటల్‌కే తీసుకెళ్తాడు అనుకుంటుంది. సత్య క్రిష్‌ని కారు పక్కకి ఆపమని హాస్పిటల్‌కి వెళ్దామని చెప్తుంది. క్రిష్‌ ఒప్పుకోకపోతే కారు దిగిపోతాను అని చెప్తుంది. దాంతో క్రిష్ ఒప్పుకుంటాడు. ఇక తను చెప్పిన హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి అని లేదంటే ఎక్కడ రాను అని అంటుంది. హాస్పిటల్‌కి వెళ్లిన తర్వాత రెస్టారెంట్‌కి వెళ్దామని చెప్తుంది. క్రిష్ సరే అని ఒప్పుకుంటాడు. రుద్ర రేణుకని హాస్పిటల్‌ దగ్గరకు తీసుకెళ్తాడు. డాక్టర్‌తో మాట్లాడుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీపకి జ్యోత్స్న వార్నింగ్.. ఐలవ్‌యూ చెప్పి కార్తీక్‌ని కట్టిపడేసిన జ్యో.. బాబోయ్ శ్రీధర్ డబుల్ యాక్షన్ అదుర్స్!