Guppedanta Manasu Serial Today Episode: వసుధార వెళ్లిపోతూ తన చాంబర్‌లో రాసిన లెటర్ శైలేంద్ర కు దొరుకుతుంది. అది తీసుకుని చదువుతాడు. అందులో మను తండ్రి మహేంద్ర అని రాసి ఉంటుంది. దీంతో షాక్ అయిన శైలేంద్ర ఆ లెటర్ తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు. ఆ విషయం దేవయానికి చెప్తాడు. ఆమె షాక్ అవుతుంది. అయితే అదే లెటర్ స్థానంలో శైలేంద్ర వేరే లెటర్ రాసి పెట్టానని చెప్తాడు. అందులో మను తండ్రి లేరని ఆయన ఎప్పుడో చచ్చపోయాడని రాశానని చెప్తాడు. నిజం చెప్పలేక, అనుపమ మేడం చాలా బాధపడేవారని ఆ లెటర్‌లో రాశానని ఆ లెటర్ మను చూశాడని చెప్పడంతో దేవయాని, శైలేంద్ర చెంప పగులగొడుతుంది.
శైలేంద్ర: ఏంటి మామ్ ఇలా కొట్టావు..
దేవయాని: నీ తెలివి ఏడ్చినట్టు ఉంది.
శైలేంద్ర: ఇప్పుడు నేనేం చేశాను.
దేవయాని: ఇన్ని చేసిన వాడివి.. ఆలెటర్ రాసే ముందు నాకు ఒక్క మాట చెబితే ఏం రాయలో చెప్పేదాన్ని కదా?
శైలేంద్ర: నేను రాశాను కదా మామ్. వాడు కచ్చితంగా అది నిజమని నమ్ముతాడు.
దేవయాని: వాడు అది నమ్మడురా? నమ్మకపోగా వాడికి లేని పోని డౌట్స్ క్రియేట్ చేశావు నువ్వు. ఇన్ని సంవత్సరాలుగా తన తండ్రి ఎవరో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాడు. తన తల్లి ముందు బాధ వెళ్లగక్కుకున్నాడు. అసలు ఈ లెటర్ రాసింది వసుధార కాదని అది నువ్వే రాశావని అసలు లెటర్ నీ దగ్గరే ఉందని వాడు అనుమానిస్తాడు.
శైలేంద్ర: మరి అయితే ఈ లెటర్ చించివేద్దామా?
దేవయాని: ఇక నుంచి నువ్వు వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపడిపోయి వాణ్ని ఏదో చేయాలనుకుని లెటర్ విషయం వాడి దగ్గర ఎత్తకు..
శైలేంద్ర: సరే మామ్ కానీ ఇప్పుడు ఏం చేద్దాం..
దేవయాని: ఈ లెటర్ ను మనం అస్త్రం గా వాడి వాణ్ని మనకు అడ్డు రాకుండా చేద్దాం..
శైలేంద్ర: అందుకే కదా మామ్ ఈ లెటర్ ని నీదగ్గరకు తెచ్చాను..
ధరణి: ఏ లెటర్ అండి
అంటూ ధరణి వస్తుంది. శైలేంద్ర, దేవయాని షాక్ అవుతారు. ధరణికి సమాధానం చెప్పరు దీంతో ఏం చెప్పరేంటని ధరణి అడగ్గానే అది ఇన్‌లాండ్ లెటర్ అంటూ శైలేంద్ర ఏదేదో చెప్తుంటే మీరు ఏదో మాట్లాడుతున్నారు అని ధరణి అనగానే శైలేంద్ర, ధరణిని అక్కణ్నించి వెళ్లిపోమ్మని అరుస్తాడు. ధరణి వెళ్లిపోతుంది. మరోవైపు రంగా ఇంట్లో ఉన్న వసుధార రిషి సార్ అంటూ కలవరిస్తుంది. పక్కన కూర్చున్న రంగ వసుధారనే చూస్తుంటాడు. ఇంతలో సరోజ బట్టలు తీసుకుని వస్తుంది.
సరోజ: ఏయ్ బావ ఏం చేస్తున్నావు..?
రంగ: నేనేం చేస్తున్నా.. నేనేం చేయట్లేదు..
సరోజ: ఏం చూస్తున్నావు..
రంగ: నేనేం చూస్తున్నాను నేనేం చూడలేదు..
సరోజ: నువ్వు ఆ పిల్లని అలానే చూస్తున్నావు..అంతలా మైమరచిపోయి చూస్తున్నావు పక్కన మనిషి వచ్చినా పట్టించుకోకుండా.. అంత అందంగా ఉందా?
రంగ: ఏయ్ ఏం మాట్లాడుతున్నావు. నీకు తెలుసుగా నాకు అమ్మాయిలు అంటే ఎంత సిగ్గో.. అంతెందుకు చిన్నప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు అయినా నీతో మాట్లాడటానికి ఎంత భయపడేవాణ్ని..
సరోజ: మాట్లాడ్డానికి ఇబ్బంది పడతావేమో కానీ చూడ్డానికి ఇబ్బంది పడవు.. అందుకే అంతలా చూస్తున్నావు. పెళ్లానికి బాగోలేకపోతే మొగుడు దగ్గరుండి సపర్యలు చేస్తాడు చూడా అలా చేస్తున్నావు.
అంటూ సరోజ మాట్లాడుతుంటే ఎందుకు ఆవిడను డిస్టర్బ్ చేస్తున్నారు అంటూ మీరు బయటకు వెళ్లండి అంటాడు రంగ. దీంతో కోపంగా సరోజ వెళ్లిపోతాను నా బట్టలు కూడా ఇవ్వను అంటుంది. తర్వాత తను దొంగేమో అందుకే రౌడీలు తరిమారేమో అంటుంది సరోజ.. తన ముఖం చూస్తుంటే అలా అనిపించడం లేదని రంగ చెప్తాడు. దీంతో బట్టలిచ్చి సరోజ వెళ్లిపోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.