Brahmamudi Serial Today Episode: సుభాష్‌ పూజలో కూర్చోవడం తనకు ఇష్టం లేదని అలాంటి పూజ చేసినా నాకు శుభం జరగదని అపర్ణ కోపంగా చెప్తుంది. మమ్మీ నువ్వు ఆవేశపడకు అని రాజ్‌ చెప్పగానే ఈ పూజ పూర్తి చేసి వెళ్తాను అని సుభాష్‌ చెప్పినా అపర్ణ వినదు. ఆయన్ను వెంటనే అక్కడి నుంచి లేచిపోమ్మను అని చెప్తుంది అపర్ణ. ఇంతలో రుద్రాణి కల్పించుకుని ఇంత ద్రోహం చేసిన తర్వాత ఏ భార్య మాత్రం భర్తను క్షమిస్తుంది చెప్పు అంటుంది. ప్రకాష్‌, రుద్రాణిని తిడతాడు. అందరూ టైం దొరికితే చాలు నీ మీద అరుస్తారు మమ్మీ నువ్వు ఊరుకో మమ్మీ అంటాడు రాహుల్‌.


అపర్ణ: ఇన్ని మాటలు అన్నా ఆ మనిషి అక్కడి నుంచి లేవడం లేదు చూశారా? పంతానికి వస్తే నేనేం అయిపోయినా పర్వాలేదు. నేను ఇంట్లో ఒక్క క్షణ కూడా ఉండను.


సుభాష్‌: ఆగండి నేను పూజలో కూర్చోవడం లేదు. ( అంటూ లోపలికి వెళ్లిపోతాడు.)


అపర్ణ: పంతులు గారు పూజలో నా కొడుకు కోడలు కూర్చుంటారు. ఈరోజు నుంచి మీ పెద్ద కోడలు జంటగా కూర్చుని చేయాల్సిన ఏ పుణ్యకార్యాలైనా.. నా కొడుకు కోడలు చేతుల మీదుగానే జరిపించండి అత్తయ్య.


ఇందిరాదేవి: సరే అవేశపడకు. నీ మనసుకు కష్టం కలిగించేది ఏదీ ఇక్కడ జరగనివ్వను.


అని చెప్పగానే రాజ్‌, కావ్య ఇద్దరూ పూజలో కూర్చుంటారు. పూజ జరుగుతుంది. కావ్య నగలు పాలల్లో కడిగి ఇవ్వమని ఇందిరాదేవికి చెప్తుంది అపర్ణ. సరేనంటుంది ఇందిరాదేవి. తర్వాత అనుపమ తల్లిదండ్రులు నీ మొగుణ్ని నీ గ్రిప్పులోకి తెచ్చుకో ఆస్థిలో వాటా పంచుకో అని చెప్పి వెళ్లిపోతారు. కనకం కూడా ఏం మాయ చేశావు అని కావ్యను అడుగుతారు. ఓపిక పట్టానని కావ్య చెప్పడంతో కనకం, మూర్తి, అప్పు హ్యాపీగా వెళ్లిపోతారు. తర్వాత రుద్రాణి కడుపుమంటతో అపర్ణ అన్న మాటలు గుర్తుచేసుకుని బాధపడుతుంది.


రాహుల్‌: హమ్మయ్యా బతికే ఉన్నావా? అత్తయ్యని పైకి పంపిస్తానని చెప్పి నువ్వే ఎటైనా వెళ్లిపోయావేమోనని కంగారుపడ్డాను.


రుద్రాణి: మా వదిన చేస్తున్న పనులు చూస్తుంటే నాకు నిజంగానే హర్ట్ల్‌ అటాక్‌ వచ్చి పోయేలా ఉన్నాను.


రాహుల్‌: ఆవిడేం చేసింది మామ్‌.. కావ్య మీద సీరియస్‌గానే ఉంది కదా?


రుద్రాణి: పిచ్చోడా పైకి అలా కోపం చూపిస్తుంది కానీ అది కూడా ప్రేమేరా?


రాహుల్‌: ఊరుకో మామ్‌ కావ్య మీద ప్రేమ ఏంటి? అది అంటేనే అసలు పడదు కదా?


  అనగానే ఇన్ని రోజులు నేను అలాగే అనుకున్నాను. కానీ మా వదిన గుండె కరిగిపోయినట్లుంది. అనామిక ఫ్యామిలీని అస్సలు పట్టించుకోలేదు. కానీ కనకం ఫ్యామిలికీ సపర్యలు చేయమంది. అని ఎలాగైనా  అపర్ణ మనసులో ధ్వేషం రగిలేలా చేస్తానని రుద్రాణి అంటుంది. మరోవైపు కావ్య ఆలోచిస్తుంటే.. రాజ్‌ వస్తాడు. మళ్లీ ఈ కళావతి ఏదో ఆలోచిస్తుంది అనుకుంటాడు.  అయితే తాను అత్తయ్య, మామయ్యల గురించే ఆలోచిస్తున్నాను అని కావ్య చెప్తుంది. ఇద్దరూ కలిసి సుభాష్‌ దగ్గరకు వెళ్లి ఓదారుస్తారు. గార్డెన్‌లో ఒంటరిగా కూర్చున్న అపర్ణ దగ్గరకు సుభాష్‌ ను వెళ్లి మాట్లాడమని చెప్తారు. సుభాష్‌ అపర్ణ దగ్గరకు వెళ్లి మాట్లాడబోతుంటే.. అపర్ణ తిడుతుంది. దీంతో నేను చేసిన తప్పుకు ప్రాణాలు కూడా తీసుకోవాలనుకున్నాను అని సుభాష్‌ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: VIJAY SETHUPATHI SUHAS VIRAL INTERVIEW | షార్ట్ ఫిలిం తీయాలంటే ఇన్ని కష్టాలా?