Shraddha Kapoor: సినీ పరిశ్రమలో డేటింగ్ రూమర్స్ అనేవి చాలా కామన్. ముఖ్యంగా బాలీవుడ్ భామలంతా ఇండస్ట్రీతో సంబంధం లేనివారితో, ఆఫ్ స్క్రీన్ పనిచేసేవారితో రిలేషన్‌షిప్‌లో ఉంటూ ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. అందులో శ్రద్ధా కపూర్ ఒకరు. ఇప్పటికే శ్రద్ధా కపూర్.. పలువురు హీరోలతో రిలేషన్‌లో ఉందని వార్తలు వచ్చాయి. కానీ అవేమి తను సీరియస్‌గా పట్టించుకోలేదు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో తన రిలేషన్‌షిప్‌పై క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ స్టోరీ చూసి ఒక్కసారిగా తన ఫ్యాన్స్ షాకవుతున్నారు. అంతే కాకుండా దీనిని తెగ షేర్ చేస్తూ శ్రద్ధా కపూర్ రిలేషన్‌షిప్ గురించి చర్చిస్తున్నారు.


అధికారికంగా ప్రకటించలేదు..


శ్రద్ధా కపూర్ గత కొన్నేళ్లుగా రాహుల్ మోడీ అనే రైటర్‌, అసిస్టెంట్ డైరెక్టర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. పైగా వీరిద్దరూ కలిసి వెకేషన్స్‌కు వెళ్లడం, బాలీవుడ్ వెడ్డింగ్స్‌కు వెళ్లడం కూడా తరచుగా జరుగుతూనే ఉంటుంది. వీటికి సంబంధించిన ఫోటోలు కూడా పలుమార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. శ్రద్ధా, రాహుల్ ప్రేమలో ఉన్నారని అందరికీ అర్థమవుతున్నా కూడా వీరిద్దరూ మాత్రం దీని గురించి ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ శ్రద్ధా కపూర్ తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ మాత్రం వీరి ప్రేమ గురించి కన్ఫర్మ్ చేసేస్తోంది. దీంతో శ్రద్ధా ఫ్యాన్స్.. తమ హార్ట్ బ్రేక్ అయ్యిందంటున్నారు.


ఇంట్రెస్టింగ్ క్యాప్షన్..


రాహుల్ మోడీతో క్లోజ్‌గా దిగిన ఫోటోతో పాటు ఒక ఇంట్రెస్టింట్ క్యాప్షన్‌ను షేర్ చేసింది శ్రద్ధా కపూర్. ‘మనసు నీ దగ్గరే ఉంచుకో. కానీ నిద్ర మాత్రం తిరిగి ఇచ్చేయ్’ అంటూ రాహుల్ మోడీని ట్యాగ్ చేసింది. దీంతో ఈ ఫోటోను తెగ షేర్ చేసేస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకంటే రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఎలా చెప్తారు అని వారు అనుకుంటున్నారు. శ్రద్ధా, రాహుల్ తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఇష్టపడినా కూడా రిలేషన్‌షిప్ గురించి స్పందించడానికి మాత్రం సిద్ధంగా లేరని వారి సన్నిహితులు చెప్తున్నారు. వారిద్దరూ పర్సనల్ లైఫ్‌ను ప్రైవేట్‌గా ఉండడానికి ఇష్టపడే వ్యక్తులే అని అంటున్నారు.






మెడలో లాకెట్..


శ్రద్ధా కపూర్, రాహుల్ మోడీ ఇప్పటికే పలుమార్లు కలిసి కనిపించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. అంతే కాకుండా కొన్నిరోజుల క్రితం శ్రద్ధా కపూర్ ఒక వెకేషన్‌కు వెళ్లింది. దానికి రాహుల్ కూడా వెళ్లాడని వార్తలు వినిపించాయి. అయితే ఆ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోల్లో శ్రద్ధా మెడలో ఆర్ అనే అక్షరంతో లాకెట్ కనిపించింది. దీంతో శ్రద్ధా, రాహుల్ రిలేషన్‌లో ఉన్నట్టు కన్ఫర్మ్ అయినట్టే అని ఫ్యాన్స్ అనుకున్నారు. ఇప్పుడు షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో ఈ విషయాన్ని స్వయంగా శ్రద్ధనే కన్ఫర్మ్ చేసేసింది కూడా. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘స్త్రీ 2’తో బిజీగా ఉంది ఈ బాలీవుడ్ బ్యూటీ.


Also Read: సోనాక్షి పెళ్లిపై శత్రుఘ్న సిన్హా మనస్తాపం- పెళ్లికొడుకు తండ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!