Happy Birthday Kajal Aggarwal: టాలీవుడ్‌ 'చందమామ' కాజల్‌ అగర్వాల్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్లాప్‌తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస సక్సెస్‌లు చూసింది. అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. సీనియర్‌ హీరోల నుంచి జూనియర్‌ హీరోలందరితో నటించిన ఈ చందమామ దశాబ్దకాలంగా స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. పెళ్లయిన ఈ పంజాబీ భామ క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. పెళ్లికి ముందు గ్లామర్ రోల్స్‌తో ఆకట్టుకున్న కాజల్‌.. ఇప్పుడు లేడీ ఒరియంటెడ్‌, కీలక పాత్రలతో మెప్పిస్తుంది. నేడు ఈ 'మిత్రవింద' బర్త్‌డే. జూన్‌ 19న కాజల్‌ అగర్వాల్‌ 39వ వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఒకసారి కాజల్‌ సినీ జర్నీ,పర్సనల్‌ లైఫ్‌ గురించి తెలుసుకుందాం. 


చదువు..


జూన్‌ 19,1985లో పంజాబీ కుటుంబ నేపథ్యంలో ముంబైలో జన్మించింది కాజల్‌. మొదటి నుంచి యాక్టర్‌ అవ్వాలన్నది కాజల్‌ డ్రీం కాదని, తాను ఫారిన్‌లో ఎంబీయే చదవాలనుకున్నట్టు గతంలో ఎన్నోసార్లు ఓ ఇంటర్య్వూలో తెలిపింది. ఇక కాజల్‌ చదువు విషయానికి వస్తే.. స్కూలింగ్‌ మొత్తం ముంబైలో చేసింది. సెయింట్‌ ఆన్స్‌ హై స్కూల్లో విద్యాభ్యాసం చేసింది. ఆ తర్వాత జై హింద్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసింది. ఆ తర్వాత మాస్‌ మీడియాలో గ్రాడ్యూవేషన్‌ చదివింది. ఆ తర్వాత ఎంబీఏ చదవాలని కలలు కన్న కాజల్‌ అనుకొకుండ ఇండస్ట్రీకి వచ్చినట్టు చెప్పింది. 


మొదట బాలీవుడ్‌లో..


మొదట కాజల్‌ బాలీవుడ్‌ చిత్రం 'క్యూన్‌ హో గయా నా'(2004) సినీరంగ ప్రవేశం చేసింది. ఇందులో హీరోయిన్‌ ఐశ్వర్యా రాయ్ చెల్లెలిగా నటించి మెప్పించింది. ఆ తర్వాత 2007లో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్‌ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మి కళ్యాణం'(2007) సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తన యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కళ్యాణ్‌ రామ్‌ హీరోగా కాజల్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా మాత్రం ఆడియన్స్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.  దీంతో డెబ్యూ చిత్రంతోనే కాజల్‌కు ఇక్కడ నిరాశ ఎదురైంది. కానీ, ఆమె స్క్రీన్‌ ప్రజెన్స్‌కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. దీంతో కాజల్‌ లీడ్‌ రోల్లో 'చందమామ'. డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లో పాజిటివ్‌ రివ్యూస్‌ అందుకుంది.


ఫైనల్‌గా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. 'చందమామ'తో తెలుగులో తన తొలి బిగ్గెస్ట్‌ హిట్ చూసింది. ఈ దెబ్బతో కాజల్‌ని ఫ్యాన్స్‌ అంతా చందమామ అంటూ పిలవడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి కాజల్‌ కెరీర్‌లో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆఫర్స్‌ అందుకుంది. అక్కడ కూడా తన సక్సెస్‌ జోరు చూపించింది. ఇక తెలుగులో రాజమౌళి, రామ్‌ చరణ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'మగధర' చిత్రంలో హీరోయిన్‌ ఆఫర్‌ కొట్టేసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఇందులో మిత్రవింతగా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత గణేష్‌, ఆర్య 2, డార్లింగ్‌, మిస్టర్‌ ఫర్ఫెక్ట్‌, దడ, బాద్‌షా, నాయక్‌, గొవిందుడు అందరివాడే లే ఇలా వరుసగా ఆఫర్స్‌ అందుకుంటు హిట్స్‌, సూపర్‌ హిట్స్‌ ఖాతాలో వేసుకుంది. 


హ్యాపీ బర్త్ డే కాజల్...


అలాగే తమిళంలోనూ ఆఫర్స్‌ కొట్టిస్తూ అక్కడ కూడా సక్సెస్‌ చూసింది. స్టార్‌ హీరోయిన్‌ సౌత్‌ ఇండస్ట్రీ ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకుంది. ఇక ఆమె ఇండస్ట్రీ వచ్చి దశాబ్దంపైనే అవుతున్న ఇప్పటికీ ఇండస్ట్రీలో అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. ఇక్‌ కెరీర్ సక్సెఫుల్‌ కొనసాగుతున్న క్రమంలోనే సడెన్‌గా పెళ్లీ పీటలు ఎక్కింది. 2020 అక్టోబర్‌ లాక్‌డౌన్‌లో కాజల్‌ సైలెంట్‌గా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లూని పెళ్లాడిన ఈ భామ 2022లో కొడుకు నీల్‌ కిచ్లూకి జన్మనిచ్చింది. ప్రెగ్నెన్సీ కారణం సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చిన కాజల్‌ బాలక్రష్ణ భగవంత్‌ కేసరితో రీఎంట్రీ ఇచ్చింది. రీఎంట్రీలోనూ అదే జోరుతో వరుస సినిమాలు చేస్తూ సక్సెస్‌లు అందుకుంటున్న ఈ 'చందమామ' భవిష్యత్తులోనూ మరెన్నో సక్సెస్‌లు చూడాలని ఆశిస్తూ.. హ్యాపీ బర్త్‌డే కాజల్‌ అగర్వాల్‌.



Also Read: బిగ్‌ అప్‌డేట్‌, 'కల్కి' సెకండ్‌ ట్రైలర్‌ కూడా ఉంది? - ఈసారి ఫ్యాన్స్‌కి ఫుల్‌ కిక్‌ ఇచ్చేలా..