Prabhas Kalki 2898 AD‌ Trailer 2 Coming Soon: 'కల్కి 2898 AD' మూవీ రిలీజ్‌కు ఇంకా తొమ్మిది రోజులే ఉంది. ఫ్యాన్స్‌ ఆశించిన విధంగా ప్రమోషన్స్‌ జరగడం లేదు. మూవీ అప్‌డేట్స్‌ కోసం ఎంతో ఆసక్తికగా ఎదురూచూసిన ఫ్యాన్స్‌కి ట్రైలర్‌ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ మూవీ రేంజ్‌లో లేదని ఓ వర్గం ఆడియన్స్‌ అభిప్రాయం. అంతేకాదు నిన్న రిలీజ్‌ అయినా భైరవ అంథిమ్‌ సాంగ్‌ కూడా పంజాబీ స్టైల్లో ఉండటంతో తెలుగు ఆడియన్స్‌కి కనెక్ట్‌ కాలేకపోయింది. నార్త్‌లో ఈ పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.


కానీ, సౌత్‌లో ఈ మూవీ ఆడియెన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కనీసం ప్రమోషన్స్‌ అయినా కిక్‌ ఇస్తాయేమో అంటే అసలు మూవీ టీం నుంచి ఆ ఊసే రావడం లేదు. ఇక అప్‌డేట్స్‌ ఏవి కూడా ఆశించిన రేంజ్‌లో లేకపోవడంతో  ప్రమోషన్స్‌ అయినా గట్టిగా చేయండి రా బాబూ అంటూ సోషల్‌ మీడియాలో ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ నుంచి కల్కి టీంకి రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే కల్కి విషయంలో మూవీ లవర్స్‌ కాస్తా డిస్సపాయింట్‌మెంట్‌లో ఉన్నారనిపిస్తుంది. ఈ క్రమంలో వారందరిని పండగ లాంటి ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.






కల్కి నుంచి సెకండ్‌ ట్రైలర్‌ రాబోతుంది. ఫస్ట్‌ ట్రైలర్‌ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో.. కల్కికి మూవీ పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యేలా ట్రైలర్‌ 2 డిజైన్‌ చేస్తున్నారట నాగ్‌ అశ్విన్‌ అండ్‌ టీం. కల్కి ట్రైలర్‌ 2 ఉంటుందంటూ రెండో రోజులుగా ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై మూవీ టీం నుంచి క్లారిటీ లేదు. తాజాగా దీనిపై ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి క్లారిటీ ఇచ్చాడు. సుమిత్‌ కడల్‌ అనే వ్యక్తి ట్వీట్‌ చేస్తూ.. "కల్కి మూవీకి ట్రైలర్‌ 2 ఉంటుందని అంటున్నారు. మొదటి ట్రైలర్‌లో ఆశించిన రెస్పాన్స్‌ అందుకోలేకపోయింది. దీంతో అలాంటి తప్పులు ట్రైలర్‌ 2ని డిజైన్‌ చేస్తున్నారట. ఇది మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తుందట. ఒకవేళ ఈ ట్రైలర్‌ ఆడియన్స ఎక్స్‌పెక్టేషన్స్‌ మించి ఉంటే మాత్రం ఇది కల్కి ఒపెనింగ్స్‌ని భారీ పెంచే అవకాశం ఉంది.


ఈ ట్రైలర్‌ మూవీ ప్రమోషన్స్‌కి మరింత ప్లస్‌ అవుతుందట. మరి అదే నిజమైతే మాత్రం ట్రైలర్‌ 2 వల్ల హిందీ బెల్ట్‌లో రూ.30 నుంచి రూ.40 కొట్ల ఓపెనింగ్స్‌ ఇవ్వాలని ఆశిద్దాం. ఎందుకంటే బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ లాంటి సినిమాతో గట్టి పోటీ ఉన్నప్పటికీ సలార్‌ ఫస్ట్‌ డే హిందీలో రూ. 15 కోట్ల ఒపెనింగ్స్‌ ఇచ్చింది. అలాంటిది కల్కి అంతకుమించి ఒపెనింగ్స్‌ ఇస్తుందనడంలో సందేహం లేదు. కాబట్టి సెకండ్‌ ట్రైలర్‌ కల్కి మూవీకి ఎంతటి హైప్‌ ఇస్తుందో చూడాలి" అంటూ ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీంతో ట్రైలర్‌ 2 కోసం ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 


Also Read: నాగార్జున ఫోటోపై టబు ఊహించని రియాక్షన్‌ - వైరల్‌ అవుతున్న కామెంట్‌