Trisha Rejected Director Rajamouli Offer: దర్శక ధీరుడు రాజమౌళి పేరు ప్రస్తుతం ఇంటర్నేషన్‌ లెవల్లో మారుమోగుతుంది. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలతో ఇండియన్‌ మూవీ ఇండస్ట్రీ చరిత్రనే తిరగరాశారు. ఒకప్పుడు చలనచిత్ర రంగమంటే బాలీవుడ్‌ అనేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్‌ ఇండస్ట్రీ అంటున్నారు. తన మేకింగ్‌ స్టైల్‌తో హాలీవుడ్‌ దర్శక దిగ్గజాలనే ఆకట్టుకున్న జక్కన్న ప్రస్తుతం పాన్‌ వరల్డ్‌ డైరెక్టర్‌ అయ్యారు. అలాంటి దర్శకుడితో సినిమాలో నటించడమంటే ఆ నటీనటుల డ్రీమ్‌ ఫుల్‌ఫిల్‌ అయినట్టే అంటుంటారు.


మగధీర తర్వాత..


రాజమౌళి సినిమాలో ఒక్క చాన్స్‌ వస్తే చాలు అని కలలు కంటున్నారు నటీనటులు. అలాంటిది ఈ జక్కన్న ఆఫర్‌నే తిరస్కరించిందట ఈ సౌత్‌ బ్యూటీ. ఇందుకు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది విన్నవాళ్లంతా షాక్‌ అవుతున్నారు. ఆఫర్స్‌ లేక కొంతకాలం సినిమాలకు దూరమైన ఈ భామ రాజమౌళి సినిమాను తిరస్కరించడమేంటని ముక్కున వెలేసుకుంటున్నారు. అయితే, ఇంతకి ఏం జరిగిందంటే.. త్రిష ఏకంగా దర్శక ధీరుడు రాజమౌళి. 2009లో 'మగధీర' చిత్రంతో రాజమౌళి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టారు. ఇక ఈసినిమా తర్వాత ఆయన కమెడియన్‌ సునీల్‌తో మర్యాద రామన్న చేశారు. అప్పటికే స్టార్‌ హీరోలతో బ్లాక్‌బస్టర్స్‌, సూపర్‌ హిట్స్‌ కొట్టిన జక్కన్న సునీల్‌తో సినిమా చేయడం ఏంటీ! అని ఆశ్చర్యపోయారు.


మూవీ రిలీజ్‌ వరకు అంతా రాజమౌళి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు సందేహించారు. అలాగే త్రిష కూడా. అందుకే మర్యాద రామన్న కోసం రాజమౌళి త్రిషను కలిశారట. అప్పటికే ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిష ఓ కమెడియన్‌ సరసన నటించని చెప్పిందట. దీనివల్ల తన కెరీర్‌కి నష్టం కలిగే చాన్స్‌ ఉందనే భయంతో రాజమౌళి అడిగినా కాదని చెప్పిందట. దీంతో చివరకు సాలోనిని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇక ఈ సినిమా ఎంతపెద్ద హిట్‌ అయ్యిందో చెప్పనవసరం లేదు. కమెడియన్‌ను సైతం కమర్షియల్‌ హీరోని చేసిన ఘనత అందుకున్నారు జక్కన్న. అలా మర్యాద రామన్నలో హీరోయిన్‌ చాన్స్‌ వదులుకుంది.


కోలీవుడ్ లో కథనాలు..


అలా 2010లో రాజమౌళి ఇచ్చిన ఆఫర్‌ని త్రిష తిరస్కరించిందంటూ కోలీవుడ్‌లో మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడో జరిగిన ఈ సంఘటనను ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశం అవ్వడం గమనార్హం. మరి దీనిపై త్రిష ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి. కాగా సౌత్‌లో త్రిష క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జోడీ (1999) సినిమా సినీరంగ ప్రవేశం చేసిన ఆమె దాదాపు రెండు దశాబ్దాలకుపైగా తెలుగు, తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఇప్పటి పాన్‌ ఇండియా హీరోల సరసన నటించిన కమర్షియల్‌ హిట్స్‌ అందుకుంది. చిరంజీవి, వెంకటేష్‌, ప్రభాస్‌, మహేష్‌ బాబులతో నటించి స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది.


ఇక సౌత్‌ ఇండస్ట్రీలోనూ త్రిషకు మంచి క్రేజ్ ఉంది.  తమిళంలో దళపతి విజయ్‌, అజిత్‌ వంటి స్టార్స్‌తోనూ జతకట్టింది. అంతేకాదు లేడీ ఒరియంటెడ్‌ చిత్రాల్లోనూ నటించి హిట్స్‌, బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందుకుంది. అలా సక్సెస్‌ ఫుల్‌గా సాగుతున్న త్రిష కెరీర్‌కి సడెన్‌గా బ్రేక్‌ పడింది. వరుసగా ప్లాప్స్‌ పడటంతో మెల్లిమెల్లిగా ఆఫర్స్‌ తగ్గిపోయాయి. ఆ తర్వాత కొంతకాలానికి వెండితెరకు దూరమైంది. ఇక యాక్టింగ్‌కు బ్రేక్‌ ఇచ్చిన త్రిష పొన్నియిన్‌ సెల్వన్‌ సాలీడ్‌ కంబ్యాక్‌ ఇచ్చింది. రీఎంట్రీలోనూ వరుసగా పాన్‌ ఇండియా ఆఫర్స్‌ అందుకుంటుంది. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి సరసన విశ్వంభరలో హీరోయిన్‌గా నటిస్తుంది.