Tabu Comments on Nagarjuna Old Pic: సినీ ఇండస్ట్రీలో డేటింగ్‌ రూమర్స్‌ కామన్‌. ముఖ్యంగా హీరోహీరోయిన్లు క్లోజ్‌గా కనిపిస్తే వారి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అంటూ ప్రచారం మొదలెట్టేస్తారు. ఆన్‌స్క్రీన్‌ ఆ జోడీ కెమిస్ట్రీ సెట్‌ అయ్యిందంటే రియల్‌ లైఫ్‌కి ముడిపెడుతుంటారు. అలా టాలీవుడ్‌లో ఓ జంట బాగా పాపులర్‌ అయ్యింది. వారే నాగార్జున అక్కినేని, టబు. నిన్నే పెళ్లాడతా సినిమాలో జంటగా నటించిన వీరిద్దరి జోడిగా వంద మార్కుల పడ్డాయి. ఈ సినిమాలో వారి ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌ ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది.


దీంత అప్పట్లో నాగార్జున, టబులు సీక్రెట్‌ రిలేషన్‌లో ఉన్నారంటూ  ఇండస్ట్రీలో మాట్లాడుకునేవారట. ఇప్పటికీ సందర్భంగా వచ్చినప్పుడల్లా వీరి రిలేషన్‌ వార్తల్లో నిలుస్తుంది. అంతేకాదు ఏదైనా సందర్భంలో ఒకరి గురించి ఒకరు మాట్లాడిన అది హాట్‌టాపిక్‌ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా టబు చేసిన పనితో మరోసారి వీరిద్దరి వార్తల్లో నిలిచారు. నాగార్జునకి సంబంధించిన ఓ ఫోటోపై టబు రియాక్ట్‌ అయ్యింది. ఇప్పుడిదే సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.  ఇంతకి అసలేం జరిగిందంటే.. ఆదివారం (జూన్‌ 16న) ఫాదర్స డే సందర్భంగా నాగచైతన్య త్రోబ్యాక్‌ ఫోటో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. నాగార్జున యంగ్‌ లుక్‌లో కనిపించారు. ఇందులో నాగార్జున, నాగచైతన్యను తన భుజాలపై కూర్చోబెట్టుకుని కనిపించారు.






ఇదే ఫోటోలను చై షేర్‌ చేస్తూ 'ది ఓజీ' అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇక నాగార్జున త్రోబ్యాక్‌ ఫోటోకి టబు రియాక్ట్‌ అయ్యింది. ఈ పోస్ట్‌కి మూడు రెడ్‌ హర్ట్‌ ఎమోజీలతో ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్‌ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది.కాగా గతంలో నాగార్జున టబుతో రిలేషన్‌లో ఎన్నోసార్లు స్పందించారు. ఓ ఇంటర్య్వూలో నాగ్‌కి టబుతో రిలేషన్‌పై ప్రశ్న ఎదురవగా.. తామిద్దరం మంచి స్నేహితులమన్నారు. తనకంటే టబు అమలతో చాలా క్లోజ్‌ అని చెప్పారు. కానీ వారిద్దరి గురించి చాలా ప్రచారం అయ్యిందని, టబు హైదరాబాద్‌ వచ్చినప్పుడల్లా వాళ్ల ఇంట్లోనే ఉండేదన్నారు. టబుకి అమలే దగ్గరుండి ఇల్లు కట్టించిందని కూడా అన్నారు.




ఇక టబు హైదరాబాద్‌ అమ్మాయే అవ్వడం వల్ల తామిద్దరం బాగా క్లోజ్‌ అయ్యామని, పైగా తనకు ఫేవరేట్‌ హీరోయిన్‌ మాత్రమే కాదు కోవర్కర్‌ కూడా.. అందుకే తామిద్దరం సన్నిహితంగా ఉన్నామని, అందువల్లే వారిద్దరి మధ్య అలాంటి రూమార్స్‌ వచ్చాయంటూ నాగ్‌ చెప్పుకొచ్చారు. కాగా చాలా గ్యాప్‌ తర్వాత టబు మళ్లీ యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం హిందీలో ఆమె బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో బిజీ అయిపోయారు. తెలుగులో చివరిగా టబు అల్లు అర్జున్‌,త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల సినిమా 'అలా వైకుంఠపురంలో' మదర్‌ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం హిందీలో అజయ్‌ దేవగన్‌ 'ఆరోన్ మే కహన్ దమ్ థా' సినిమాలో కీ రోల్‌ పోషిస్తుంది. 


Alo Read: ఏంటీ.. త్రిష ఏకంగా రాజమౌళి మూవీ ఆఫర్‌నే తిరస్కరించిందా? - అసలేం జరిగిందంటే..!