Pahlaj Nihalani  About Shatrughan Sinha Upset: బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి గురించి కూతురు సోనాక్షి సిన్హా తనతో చెప్పకపోవడం పట్ల ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇంత ముఖ్యమైన విషయానికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు తనకు కనీసం ఒక్క మాటైనా చెప్పకపోవడం పట్ల సన్నిహితుల దగ్గర ఆయన ఆవేదన చెందారట. అయినప్పటికీ, తన కూతురు పెళ్లికి హాజరై ఆశీర్వాదం అందిస్తానని శత్రుఘ్న సిన్హా చెప్పారని తెలిసింది.


ఆ కోపం ఎక్కువ రోజులు ఉండదు- పహ్లాజ్ నిహలానీ


శత్రుఘ్న సిన్హా మనస్తాపం చెందడం పట్ల పెళ్లి కొడుకు జహీర్ ఇక్బాల్‌ తండ్రి  పహ్లాజ్ నిహలానీ తాజాగా స్పందించారు. పెళ్లి గురించి తనకు తెలియదని చెప్పడం పట్ల ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. బిడ్డ తనకు పెళ్లి విషయాన్ని చెప్పలేదని కలత చెంది ఉండొచ్చని, ఆ కోపం ఎక్కువ కాలం ఉండదని అభిప్రాయపడ్డారు.


“సోనాక్షి పెళ్లి విషయాన్ని చెప్పలేని శత్రుజీ కోపం రావచ్చు. కలత చెంది ఉండవచ్చు. కానీ, ఆ కోపం ఎక్కువ కాలం ఉండదు. అమె అంటే అతడికి ఎంతో ఇష్టం. అతడు పెళ్లికి రాడు అనే సవాలే లేదు. ఈ రోజుల్లో పిల్లలు తమ పెళ్లి గురించి తామే నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ తర్వాతే తల్లిదండ్రులకు చెప్తున్నారు. సోనాక్షి తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. అతడు బాధ పడాల్సిన అవసరం లేదు. నలభై ఏళ్ల క్రితం తనకు నచ్చిన అమ్మాయిని శత్రుజీ పెళ్లి చేసుకున్నారు. నేను కూడా నా భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పిల్లలు విషయంలో మన అంచనాలు పని చేయడం లేదనేది నా అభిప్రాయం” అని చెప్పుకొచ్చారు.


“శత్రుజీ ఎన్నికల కారణంగా మూడు నెలల పాటు ముంబైకి దూరంగా ఉన్నారు. అప్పుడు మీడియా అతడితో మాట్లాడి ఉండవచ్చు. అందుకే తను ఆమె పెళ్లి గురించి తెలియదని చెప్పారు. బాబీజీకి తెలిసి ఉంటుంది. ఆయన ఎన్నికల నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి గురించి చెప్పాలి అనుకున్నారు. ఇప్పుడు అతడు ముంబైకి వచ్చారు. సోనాక్షి తన పెళ్లి గురించి చెప్పి ఉంటుంది. ఆమె కుటుంబ సభ్యులు అంతా సంతోషంగానే ఉన్నారు” అని పహ్లాజ్ నహలానీ వెల్లడించారు.   


సోనాక్షి పెళ్లి గురించి శత్రుఘ్న ఏమన్నారంటే?


సోనాక్షి తన బాయ్ ఫ్రెండ్ జ‌హీర్ ఇక్బాల్ ని పెళ్లాడ‌బోతున్న‌ట్లు కొద్ది రోజుల కిందట వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె తండ్రి శ‌త్రుఘ్న సిన్హా స్పందించారు. “పెళ్లి గురించి నాకు ఏమీ తెలియదు. ఎన్నికల హడావిడి కారణంగా నేను నా ఫ్యామిలీతో తక్కువగా టచ్ లో ఉన్నాను. మీరు ఆమె పెళ్లి గురించి చెప్తున్నారు. నేను ఆమెను ఈ విషయం గురించి అడగలేదు. ఒకవేళ నాకు ఆ విషయం చెప్తే నేను, నా సతీమణి కచ్చితంగా ఒప్పుకుంటాం. ఆశీర్వదిస్తాం. మాకు కావాల్సింది ఆమె ఆనందమే. ఆమె ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటుంది. ఆమె నిర్ణయాన్ని మేం ఎప్పుడూ తప్పుబట్టం” అని చెప్పుకొచ్చారు. 


జూన్ 23న వివాహం


జూన్ 23న సోనాక్షి సిన్హా, జ‌హీర్ ఇక్బాల్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది మిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. ముంబైలోనే వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా సోనాక్షి, జ‌హీర్ డేటింగ్ లో ఉన్నారు. ఇద్దరు కలిసి కొన్ని సినిమాల్లోనూ నటించారు.


Read Also: యంగ్ హీరోతో సోనాక్షి సిన్హా పెళ్లి - ఇన్విటేషన్ కూడా రెడీ