Ram Charan: మెగా పవర్ స్టార్‌గా, చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్. కానీ తన స్టోరీ సెలక్షన్, యాక్టింగ్‌తో అందరినీ ఇంప్రెస్ చేస్తూ తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ‘RRR’ తర్వాత చరణ్ లైఫే మారిపోయింది. ఈ ఒక్క సినిమాతో మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ అయిపోయాడు చరణ్. ప్రస్తుతం అటు ప్రొఫెషనల్ లైఫ్‌లో, ఇటు పర్సనల్ లైఫ్‌లో రెండిటిలోనూ హ్యాపీగా గడిపేస్తున్నాడు ఈ హీరో. తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి, తను సక్సెస్, ఫెయిల్యూర్‌ను చూసే దృష్టికోణం గురించి పలు విషయాలు ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.


ఫ్యామిలీ టైమ్..


తన కెరీర్‌లో ఎక్కువగా ఒత్తిడికి ఫీల్ అయ్యే సందర్భాలను, సక్సెస్‌ను తను ఎలా హ్యాండిల్ చేస్తాడంటూ రామ్ చరణ్‌కు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘నాకు అసలు ప్రెజర్‌ను హ్యాండిల్ చేయడం రాదు. అది నాలో పాజిటివ్ అనుకోవాలా, నెగిటివ్ అనుకోవాలా నాకే అర్థం కాదు. ‘RRR’ సక్సెస్ అయినప్పుడు నాకు బాగా గుర్తుంది. నేను ఒక వారం రోజులు అసలు ఇంటి నుంచి బయటికి రాలేదు. నేను అన్నింటికి దూరంగా రిలాక్స్ అవుతూ ఫ్యామిలీ టైమ్‌ను ఎంజాయ్ చేశాను’’ అని తెలిపాడు రామ్ చరణ్. ‘RRR’లో రామ్ చరణ్ పాత్రకు, ముఖ్యంగా క్లైమాక్స్‌లో తన నటనకు ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి మార్కులు పడ్డాయి.


బ్యాలెన్స్ అవుతుంది..


ఇక తన సినిమాలు ఫెయిల్ అయినప్పుడు తన రియాక్షన్ ఏంటని అడగగా.. రామ్ చరణ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘‘నా సినిమాలు ఫెయిల్ అయినప్పుడు నేను పార్టీ చేసుకున్నాను. అలా చేస్తేనే నేను బ్యాలెన్స్‌గా ఉంటానని నేను నమ్ముతాను. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా జర్నీని ఎంజాయ్ చేయడమే నాకు చాలా ఇష్టం’’ అని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. దీంతో చరణ్ కూల్ యాటిట్యూడ్‌కు ఫ్యాన్స్ మరోసారి ఫిదా అవుతున్నారు. అలాగే తన అప్‌కమింగ్ మూవీ గురించి ఏదైనా అప్డేట్ వస్తే బాగుంటుందని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లోని ‘గేమ్ ఛేంజర్’ గురించి ఎలాంటి క్లారిటీ లేదు.


మూడు సినిమాలు..


‘RRR’ తర్వాత తన తండ్రి చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ అనే మూవీలో నటించాడు రామ్ చరణ్. కానీ ఆ మూవీ భారీ డిసాస్టర్‌గా నిలిచింది. వెంటనే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్‌’పై ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా నుంచి ఒక పాటను కూడా రిలీజ్ చేసింది మూవీ టీమ్. అంతకు మించి ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. ‘గేమ్ ఛేంజర్’ సెట్స్‌పై ఉండగానే సుకుమార్‌తో ఒక మూవీని అనౌన్స్ చేశాడు చరణ్. అంతే కాకుండా సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబుతో కూడా ఒక సినిమా ప్లాన్ చేసి దాని ఓపెనింగ్‌ను ఓ రేంజ్‌లో చేశారు. చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నా కూడా రామ్ చరణ్ అప్‌కమింగ్ మూవీపై క్లారిటీ లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.


Also Read: పుష్ప 2 విడుదల డిసెంబర్‌లో... కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అల్లు అర్జున్