Pushpa 2 Movie New Release Date: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'పుష్ప 2: ది రూల్'. ఈ చిత్రాన్ని తొలుత ఆగస్టు 15న విడుదల చేయాలని భావించారు. అయితే... ఆ తేదీకి సినిమా విడుదల కావడం లేదు. హీరోతో పాటు దర్శక నిర్మాతలు ఆ న్యూస్ గురించి క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చెప్పారు.
డిసెంబర్ 6 నుంచి పుష్పరాజ్ రూల్ షురూ!
Pushpa The Rule Release Date: 'పుష్ప: ది రూల్'ను డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు హీరో అల్లు అర్జున్, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించారు. అన్నట్టు... డిసెంబర్ అంటే 'పుష్ప'కు హిట్ సెంటిమెంట్ అని చెప్పాలి. 'పుష్ప: ది రైజ్' సినిమా డిసెంబర్ 17న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు సీక్వెల్ కూడా డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
Also Read: విజయ్ సేతుపతి 'పుష్ప'లో విలన్ రోల్ రిజెక్ట్ చేశారా? Maharaja Thank You Meetలో ఏం చెప్పారంటే?
విడుదల వాయిదా వేయడానికి కారణం ఏమిటంటే?
Reasons For Pushpa 2 Release Postpone: 'పుష్ప 2' విడుదలను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో కూడా మైత్రీ మూవీ మేకర్స్ తెలియజేసింది. సినిమా చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాలేదని, ప్రేక్షకులకు మంచి క్వాలిటీతో కూడిన సినిమా ఇవ్వడంలో రాజీ పడకూడదని, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాను వారి ముందుకు తీసుకు రావాలనే ఉద్దేశంతో సినిమా విడుదల తేదీని మార్చినట్లు నిర్మాతలు తెలిపారు.
Also Read: మీనాక్షీ చౌదరి... 27 ఏళ్ల వయసులోనే ఆ సినిమాలో యంగ్ హీరోకి భార్యగా!
పాటలకు, ప్రచార చిత్రాలకు అద్భుత స్పందన!
'పుష్ప: ది రూల్' నుంచి టైటిల్ సాంగ్, 'సూసేకి...' పాటలు విడుదల చేశారు. ఆ రెండూ చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. మిలియన్స్ వ్యూస్ అందుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ మరోసారి సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చారని ఆ రెండు పాటలతో అర్థమైంది. దాంతో పాటు ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. మరీ ముఖ్యంగా 'పుష్ప'కు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడం, పాన్ ఇండియా స్థాయిలో సినిమా సక్సెస్ కావడంతో అందుకు తగ్గ సినిమాను ఇవ్వాలని తమ టీమ్ అంతా కష్టపడుతోందని మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది.
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న 'పుష్ప 2'లో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, కన్నడ హీరో ధనుంజయ్, టాలీవుడ్ హీరో కమ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ సునీల్, స్టార్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక తారాగణం. ఈ చిత్రానికి కథ - కథనం - దర్శకత్వం: సుకుమార్ .బి, నిర్మాతలు: నవీన్ ఎర్నేని - యలమంచిలి రవిశంకర్, ఛాయాగ్రహణం: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్ రామకృష్ణ - మోనిక నిగొత్రే, సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, నిర్మాణ సంస్థలు: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్.