Latest Update On Allu Arjun's Pushpa 2 Release: 'పుష్ప 2' థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడు? నిన్న మొన్నటి వరకు అయితే తడుముకోకుండా ఆగస్టు 15 అని ప్రతి ఒక్కరూ ఠక్కున సమాధానం చెప్పేవారు. ఎప్పుడు అయితే ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న 'డబుల్ ఇస్మార్ట్'ను ఆగస్టు 15కు విడుదల చేయనున్నట్లు ప్రకటన వచ్చిందో... ఆ క్షణమే 'పుష్ప 2' విడుదల వాయిదా పడిందని ఇండస్ట్రీ జనాలకు, ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది. మరి, 'పుష్ప 2' ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అంటే... ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినబడుతున్న లేటెస్ట్ బజ్ ప్రకారం డిసెంబర్ నెలలో!


డిసెంబర్ మొదటి వారమా? రెండో వారమా?
Pushpa 2 movie to release in December 2024: 'పుష్ప: ది రైజ్'లో నటనకు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక, ఆ సినిమా ఉత్తరాదిలో సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డేవిడ్ వార్నర్ వంటి క్రికెటర్ కారణంగా సినీ ప్రేక్షకుల్లో మాత్రమే కాకుండా క్రికెట్ ప్రేమికుల్లోనూ పుష్పరాజ్ మేనరిజమ్స్ వైరల్ అయ్యాయి. దాంతో 'పుష్ప 2' విడుదల గురించి ప్రేక్షకులతో పాటు సామాన్యులు సైతం ఎదురు చూస్తున్నారు.


ఆగుతూ 15న విడుదల చేయాలని భావించినా... వర్క్ ఫినిష్ కాని కారణంగా మూవీ రిలీజ్ వాయిదా వేశారట. కొత్తగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం... డిసెంబర్ తొలి లేదా మలి వారాల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారట. ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు. ఒక్కసారి డేట్ ఫైనలైజ్ చేశాక అధికారికంగా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.


విడుదల వాయిదా వేయడానికి అసలు కారణం అదేనా?
Reason For Pushpa 2 Delay: 'పుష్ప 2' విడుదలకు మరింత సమయం కావాలని క్రియేటివ్ జీనియస్ సుకుమార్ హీరోతో పాటు నిర్మాతలను కోరారట. ఆగస్టు 15కి వర్క్ మొత్తం పూర్తి చేసి, ఫస్ట్ కాపీ ఇవ్వడం అసాధ్యమని స్పష్టంగా చెప్పేశారట. ఈ సినిమా షూటింగ్ ఇంకా 45 రోజులు బ్యాలెన్స్ ఉందట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుంది. పరిస్థితులు మొత్తం బేరీజు వేసుకుని డిసెంబర్ రిలీజ్ వైపు యూనిట్ మొగ్గు చూపుతోందట.


Also Readహైదరాబాద్ రేప్ కేసుపై బాలీవుడ్ సినిమా - కరీనా, ఆయుష్మాన్ జంటగా!



'పుష్ప 2' సినిమాలో అల్లు అర్జున్ సరసన మరోసారి శ్రీవల్లి పాత్రలో నేషనల్ క్రష్ రష్మికా మందన్న నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నారు. ఆయన కూడా ఇంకోసారి భన్వర్ సింగ్ షెకావత్ రోల్ చేస్తున్నారు. ఇంకా అనసూయ భరద్వాజ్, సునీల్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేస్తున్నారు.


Also Readమిస్టర్ బచ్చన్ రాంపేజ్... హరీష్ శంకర్ మార్క్ మాస్ మహారాజా యాక్షన్ షురూ