Ravi Teja's Mr Bachchan Show Reel: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'మిస్టర్ బచ్చన్'. నామ్ తో సునా హోగా (పేరు వినే ఉంటారు)... అనేది ఉప శీర్షిక. ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 'షాక్', 'మిరపకాయ్' తర్వాత వారిద్దరి కలయికలో హ్యాట్రిక్ చిత్రమిది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఇవాళ షో రీల్ విడుదల చేశారు.


మాస్ మహారాజా రాంపేజ్... మిస్టర్ బచ్చన్! 
'మిస్టర్ బచ్చన్' చిత్రాన్ని పనోరమా స్టూడియోస్ & టీ సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ ఎత్తున ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ రోజు విడుదల చేసిన షో రీల్ చూస్తే... మాస్ మహారాజా రవితేజ రాంపేజ్ ఫుల్లుగా ఉంది.


హరీష్ శంకర్ అంటే మాస్ పంచ్ డైలాగులకు పెట్టింది పేరు. అయితే, 'మిస్టర్ బచ్చన్' షో రీల్ (MR Bachchan Movie Showreel)లో ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేదు. వీడియో అంతా మాస్ మహారాజా మాస్ యాక్షన్ చూపించారు. అందులోనూ హరీష్ శంకర్ మార్క్ కనిపించింది.


'మిస్టర్ బచ్చన్' షో రీల్ చూస్తే... జగపతిబాబు రాజకీయ నాయకుడి క్యారెక్టర్ చేశారని అర్థం అవుతోంది. ఆయనకు, రవితేజకు మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్ అయితే... కేక! హీరోయిన్ భాగ్యశ్రీని సైతం పరిచయం చేశారు. రవితేజతో ఆమె సీన్లు బావున్నాయి.


Also Read: భైరవ యాంథమ్... ప్రభాస్ కోసం పంజాబీ గాయకుడి సాంగ్... భల్లే భల్లే... బాగుందమ్మా!






రవితేజ జోడీగా నార్త్ ఇండియన్ బ్యూటీ!
Mr Bachchan Movie Actress: 'మిస్టర్ బచ్చన్'తో ఓ నార్త్ ఇండియన్ అమ్మాయిని తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం చేస్తున్నారు రవితేజ, హరీష్ శంకర్. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. తెలుగులో ఆవిడ సంతకం చేసిన తొలి చిత్రమిది. దీని తర్వాత మరో రెండు సినిమాల్లో ఆమెకు అవకాశాలు వచ్చాయి.


Also Readదీపికా పదుకునే... ఆ తెలుగు ఏంటి? తెగులు పట్టిస్తావా? 'కల్కి'లో డబ్బింగ్ మార్చండ్రా బాబు - ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్న టాలీవుడ్ ఆడియన్స్


రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న 'మిస్టర్ బచ్చన్' సినిమాలో జగపతి బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, ఛాయాగ్రహణం: అయనంక బోస్, నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్ర సమర్పణ: పనోరమా స్టూడియోస్ & టి సిరీస్, సంగీతం: మిక్కీ జె మేయర్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణం: టీజీ విశ్వ ప్రసాద్, రచన - దర్శకత్వం: హరీష్ శంకర్.