Kalki 2898 AD Song: 'కల్కి 2898 ఏడీ'లో ఎన్ని పాటలు ఉన్నాయి? ఇప్పటి వరకు అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. కానీ, టీజర్ & ట్రైలర్ చూస్తే... పాటలు కొత్తగా ఉండబోతున్నాయని అర్థం అయ్యింది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) వైవిధ్యమైన బాణీలు అందించారని తెలిసింది. రెబల్ స్టార్ ప్రభాస్ కోసం పంజాబీ గాయకుడు, హీరో దిల్జిత్ దోశాంజ్ (Diljit Dosanjh) పాడిన 'భైరవ యాంథమ్ (Bhairava Anthem)ను ఇవాళ విడుదల చేశారు.
భైరవుడి పాట... భల్లే భల్లే ఉందట!
'కల్కి 2898 ఏడీ'లో టైటిల్ రోల్ ఎవరు చేస్తున్నారు? అనేది ఇంకా చెప్పలేదు. ఆ రోల్ ప్రభాస్ చేస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు. అయితే... భైరవుడిగా ఆయన చేస్తున్నారనేది అర్థం అయ్యింది. ఇవాళ విడుదల చేసినది ఆ భైరవుడి పాటే.
''ఒక నేనే... నాకు చుట్టూ నేనే!
ఒక్కటైనా... ఒంటరోడ్ని కానే!
స్వార్థమూ నేనే... పరమార్థమూ నేనే!''
అంటూ భైరవ యాంథమ్ సాంగ్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత పంజాబీలో దిల్జిత్ సాంగ్ మొదలైంది. ఇది తన 50వ సినిమా అని, అది ప్రభాస్ సినిమా కావడం సంతోషంగా ఉందని సంతోష్ నారాయణన్ పేర్కొన్నారు. తెలుగు లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి రాశారు.
Also Read: కల్కి టికెట్ రేట్లు... ఏపీలో భారీగా పెరుగుతాయ్, కానీ తెలంగాణ కంటే రేటు తక్కువేనా?
జూన్ 27న థియేటర్లలో 'కల్కి' సందడి!
'కల్కి 2898 ఏడీ' విడుదలకు సరిగ్గా పది రోజుల సమయం ఉంది. జూన్ 27న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ విడుదలైన చేసిన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. 'బుజ్జి అండ్ భైరవ' వెబ్ సిరీస్ ప్రభాస్ క్యారెక్టర్ మీద ఒక ఐడియా వచ్చేలా చేసింది.
'కల్కి 2898 ఏడీ' సినిమాలో ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో దిశా పటానీ నటించారు. దీపికా పదుకోన్ మెయిన్ హీరోయిన్ రోల్ చేశారు. లెజెండరీ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ సహా పశుపతి, బ్రహ్మానందం, శోభన తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 'సీతా రామం' జోడీ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ అతిథి పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి అశ్వనీదత్, స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించారు.