Hero Varun Sandesh Gives Clarity About Vithika Sheru Pregnancy : వరుణ్ సందేశ్.. కెరీర్ తొలినాళ్లలో వరుస హిట్లతో దూసుకుపోయారు. ఆ తర్వాత సినిమాలు అనుకున్నంతగా రానించలేదు. ఆ తర్వాత భార్య వితికాతో కలిసి బిగ్ బాస్ కి వెళ్లారు ఆయన. దీంతో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది ఆ జంట. ప్రస్తుతం వితికా ఇన్‌స్టాగ్రామ్ ఇన్ ఫ్య్లూయెన్సర్ గా, యూట్యూబర్ గా రానిస్తున్నారు. అయితే, ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రావడంపై క్లారిటీ ఇచ్చారు వరుణ్ సందేశ్. తనకు సినిమాల్లో ఛాన్స్ ఎలా వచ్చింది? తన కెరీర్ ఎలా మలుపు తిరిగింది అనే విషయాలపై ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఆయన.
అలా అవకాశం వచ్చింది...
'హ్యాపీ డేస్' సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిన విషయమే. యూత్ లోకి తెగ ఎక్కేసింది ఆ సినిమా. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే. అలా ఆ సినిమా ద్వారా పరిచయం అయ్యారు వరుణ్ సందేశ్. ఆ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పుకొచ్చారు ఆయన. "యూఎస్ లో ఉన్నప్పుడు ఆడిషన్ పంపించాను. శేఖర్ సార్ టీమ్ లోకి వెళ్లింది. వేల వేల ఆడిషన్స్. దాంట్లో నా ఫోటో చూసి, వీడియో చూసి ఒకే చేశారు. అనీశ్ కురివిల్లా అని 'హ్యాపీడేస్' ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన ఫోన్ చేశారు. శేఖర్ సార్ చూసి సెలెక్ట్ చేశారు మిమ్మల్ని సినిమా కోసం చెప్పారు. ఆ టైంలో నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. అది విని నేను షాక్. నా ఫ్రెండ్స్ అంతా షాక్. ఇక ఆ తర్వాత షూటింగ్ జరిగే టైంలో యాక్టర్స్ అందరం ఒక దగ్గరే ఉండేవాళ్లం. సిబీఐటీ గోడ దూకితే రిసార్ట్ ఉండేది. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా అందులోనే ఉంచారు మమ్మల్ని. దాని వల్లేనేమో అందరి మధ్య బాండింగ్ కుదిరింది. అందరం బాగా చేయగలిగాం" అని 'హ్యాపీడేస్' మెమొరీస్ గుర్తు చేసుకున్నారు వరుణ్ సందేశ్.
ఏడ్చేశాను.. వణికిపోయాను..
"'కొత్త బంగారు లోకం' నరేషన్ వినగానే భయకరంగా నచ్చేసింది. మధ్యలో ప్రకాశ్ రాజ్ గారి సీన్స్ ఉన్నాయి కదా అవి విని నా కళ్లలో నీళ్లు వచ్చేశాయి. దిల్ రాజు గారు హిట్ మిషన్.. ఆయన బ్యానర్ లో చేయడం, శ్వేత బసూ ప్రసాద్ నేషనల్ అవార్డు విన్నర్, ప్రకాశ్ రాజు గారు, జయసుధ గారు వాళ్లతో చేయాలంటే షివరింగ్ వచ్చేసేది. ఎందుకంటే అప్పటి వరకు చేసింది కొత్తవాళ్లతో. కానీ, సీనియర్స్ తో చేయడం అంటే వామ్మో అనిపించేది. కానీ, అదొక మంచి ఎక్స్ పీరియెన్స్. జయసుధ గారితో నీ ప్రశ్నలు నీవే పాటలో ఆమెను పట్టుకుని ఏడవాలి. నిజంగా ఆమె ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. అప్పుడు అర్థమైంది ఆమెను సహజనటి అని ఎందుకు అంటారో అని. అది చాలా చాలా మంచి ఎక్స్ పీరియెన్స్ నా లైఫ్ లో" అని చెప్పారు వరుణ్.
ఆ సినిమా లక్కీ సినిమా..
"'పడ్డానండి ప్రేమలో మరి' అది నాకు బ్యూటిఫుల్ మెమొరి అసలు. అక్కడే నా వైఫ్ వితికాను కలిశాను నేను. అది నా లైఫ్ లో బెస్ట్ సినిమా, లక్కీ మూమెంట్. నా వైఫ్ నా లైఫ్ లోకి వచ్చింది. లిఫ్ట్ చేసి కిందపడేసే సీన్ ఉంటుంది. అప్పుడే మొదలైంది వితికతో మాట్లాడటం. 8 ఏళ్లు ఇప్పుడు పెళ్లై. అది చాలా బ్యూటిఫుల్ మెమొరి. ఆ రోజు రిలీజ్ చేయొద్దు అని చెప్పాను సినిమాని. జూనియర్ ఎన్టీఆర్ గారి టెంపర్ సినిమా రోజు రిలీజ్ అయ్యింది. దాంతో మా సినిమాపై ఎఫెక్ట్ పడింది. ఘోస్ట్ లవ్ అనే జోనర్ లో వచ్చింది ఆ సినిమా. నిజంగా ఎవ్వరూ అలాంటి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోరు. కానీ, ఆ అమ్మాయి ఒప్పుకుని చేసింది. దురదృష్టవశాత్తు ఆమె కష్టానికి ఫలితం దక్కలేదు. ఇక వితికా ప్రగ్నెంట్ అయితే అందరికీ తెలుస్తుంది. తండ్రి కాబోతుంటే కచ్చితంగా చెప్తాను" అని వితికా ప్రెగ్నెస్సీపై క్లారిటీ ఇచ్చారు వరుణ్ సందేశ్.
Also Read: వామ్మో! 'పుష్ప' విలన్ ఒక్క రోజు రెమ్యునరేషన్ ఇన్ని లక్షలా?