Fahadh Faasil’s per day Remuneration: ఫహద్ ఫాసిల్.. పేరుకు మ‌ల‌యాళ న‌టుడే కానీ తెలుగులో కూడా ఆయ‌న‌కు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయ‌న చేసిన చాలా సినిమాలు ఓటీటీ పుణ్య‌మా అంటూ తెలుగువాళ్లు కూడా చూశారు. ఫహద్ ఫాసిల్ యాక్టింగ్ కి ఫిదా అయిపోయారు. ఇక 'పుష్ప' సినిమా త‌ర్వాత చెప్ప‌క్క‌ర్లేదు. నిజానికి ఆ సినిమాలో క‌నిపించింది కొన్ని సీన్లే అయినా.. త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు ఫహద్. ప్ర‌స్తుతం 'పుష్ప - 2' లో బిజీగా ఉన్నారు ఫహద్. అయితే, ఆయ‌న ఒక్క‌సారిగా రెమ్యున‌రేష‌న్ పెంచేశార‌ట‌. రోజువారిగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నార‌ట ఫహద్. అది కూడా భారీగా అని ఒక వార్త తెగ వైర‌ల్ అవుతోంది. ఆయ‌న తీసుకునే రెమ్యున‌రేష‌న్ ఎంతంటే? 


రోజుకి ఇన్ని డ‌బ్బులా? 


ప్ర‌స్తుతం చాలామంది యాక్ట‌ర్స్ రోజు వారి రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నార‌ట‌. తాజాగా ఫహద్ కూడా ఆ లిస్టులో చేరాడు. టాలీవుడ్ లో ఒక్కో యాక్ట‌ర్ కి ఐదు ల‌క్ష‌ల నుంచి ప‌ది ల‌క్ష‌ల మ‌ధ్య రెమ్యున‌రేష‌న్ ఉంటే ఫహద్ వాళ్ల‌ను దాటిపోయాడ‌ట. ఆయ‌న ఏకంగా ఒక రోజుకి రూ.12 ల‌క్ష‌లు తీసుకుంటున్నార‌ట‌. ఏదైనా కార‌ణాల వ‌ల్ల, ఇబ్బందులు వ‌ల్ల షూట్ క్యాన్సిల్ అయినా, వాయిదా ప‌డ్డా ఆ రోజు రెమ్యున‌రేష‌న్  కూడా ఇవ్వాల‌ట ఆయ‌న‌కు. షూటింగ్ కోసం ఫహద్ హైద‌రాబాద్ కి రావాల్సి ఉంటుంది. అలా వ‌చ్చిన రోజు షూట్ క్యాన్సిల్ అయితే అద‌నంగా రూ.2ల‌క్ష‌లు క‌ట్టాల‌ట ప్రొడ్యూస‌ర్లు. ఇది ఫహద్ ఫాసిల్ రెమ్యున‌రేష‌న్ గురించి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న వార్త‌. 


'పుష్ప - 2' లో బిజీ బిజీ.. 


పుష్ప సినిమాతో తెలుగులో డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చారు ఫహద్. ఆ సినిమాలో ఆయ‌న ఒక ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ రోల్ లో క‌నిపించారు. బ‌న్వ‌ర్ సింగ్ ష‌కావ‌త్ గా అంద‌రినీ అల‌రించారు. ఇక ఇప్పుడు 'పుష్ప -2' షూట్ లో బిజీగా ఉన్నారు ఆయ‌న‌. 'పుష్ప'లో ఫహద్ యాక్టింగ్ కి అంద‌రూ ఫిదా అయిపోయారు. నిజానికి ప్ర‌తి ఒక్క‌రు అల్లు అర్జున్ కోసం ఎంత‌లా ఎదురుచూస్తున్నారో ఫహద్, అల్లు అర్జున్ మ‌ధ్య జ‌రిగే సీన్లు ఎలా ఉండ‌బోతున్నాయి అనే అంతే ఆసక్తి గా వెయిట్ చేస్తున్నారు. 


'పుష్ప - 2' వాయిదా.. 


'పుష్ - 2' సినిమా కోసం చాలామంది ఫ్యాన్స్ ఎద‌రుచూస్తున్నారు. అల్లు అర్జున్ ఫ‌స్ట్ లుక్ చూసిన త‌ర్వాత ఇంకా ఇంట్ర‌స్ట్ పెరిగిపోయింది అంద‌రిలో. కానీ సినిమా మాత్రం వాయిదాల మీద వాయిదాలు ప‌డుతుంది. ఎట్ట‌కేల‌కు ఆగ‌స్టు 15న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌డంతో పండ‌గ చేసుకున్నారు బ‌న్నీ ఫ్యాన్స్. కానీ, ఇప్పుడు మ‌ళ్లీ వాయిదా ప‌డింది సినిమా. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే, మ‌ళ్లీ ఎప్పుడు రిలీజ్ చ‌స్తాము అనే విష‌యం మాత్రం వెల్ల‌డించ‌లేదు. దీంతో ఎప్పుడెప్పుడు సినిమా వ‌స్తుందా? అని వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్ప‌టికే రిలీజైన రెండు పాటలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. 


Also Read: విశ్వక్ సేన్ చేసిన ఆ పనికి ఇంప్రెస్ అవుతున్న ఫ్యాన్స్ - రియల్ హీరో అంటూ కామెంట్స్