Renu Desai Reply To Fan: సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌పై ప్రేక్షకులు ఎక్కువగా ఫోకస్ పెడతారు. అలాగే వారు చేసే ప్రతీ విషయంపై ఉచిత సలహాలు ఇస్తుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో ప్రజలతో పాటు రాజకీయ నాయకులు సైతం పవన్ పర్సనల్ లైఫ్‌నే టార్గెట్ చేశారు. ముఖ్యంగా రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పవన్‌ను అన్నయ్య అంటూ తనను వదినా అంటూ ఇప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. తాజా రేణు దేశాయ్‌ కామెంట్‌ సెక్షన్‌కి సంబంధించి ఓ స్క్రిన్‌ వైరల్‌ అవుతుంది. ఇందులో ఓ నెటిజన్‌ రేణు దేశాయ్‌ని అన్నయ్య(పవన్‌ కళ్యాణ్‌)ను ఎందుకు వదిలేశారు వదినా అని ప్రశ్నించింది. దీనికి ఆమె నేను కాదు ఆయనే నన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నారంటూ ఘాటూగా స్పందించింది.  


కామెంట్స్ ఆఫ్..


రేణు దేశాయ్.. గత కొన్నిరోజులుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటున్నారు. అకిరా.. తన తండ్రి పవన్ కళ్యాణ్ కలిసి దిగుతున్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ పోస్టులకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ నచ్చకపోవడంతో తను కామెంట్స్ కూడా ఆఫ్‌లోనే పెట్టేస్తున్నారు. ఒకవేళ కామెంట్స్ ఆన్‌లో ఉంటే చాలు.. తనను వదినా అని పిలుస్తూ, అకిరాను జూనియర్ పవర్ స్టార్ అంటూ ఏదో ఒకటి అంటూనే ఉన్నారు ఫ్యాన్స్. తన పర్సనల్ లైఫ్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని రేణు ఎన్నిసార్లు చెప్పినా.. కొందరు చేసే కామెంట్స్‌కు మాత్రం లిమిట్ ఉండడం లేదు. తాజాగా అలాంటి సంఘటన మళ్లీ జరిగింది.




టార్చర్ చేయొద్దు..


‘వదిన గారు మీరు కొన్నేళ్లు ఓపిక పట్టుంటే బాగుండేది. ఒక దేవుడిని వివాహం చేసుకొని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు. కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఏదేమైనా విధి అంతా నిర్ణయిస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు అది చాలు వదిన. మిమ్మల్ని మిస్ అవుతున్నాం వదిన’ అంటూ ఒక ఫ్యాన్ కామెంట్ పెట్టాడు. దానికి రేణు దేశాయ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘మీకు కొంచెం అయిన బుద్ధి ఉంటే ఇలా చెప్పేవారు కాదు. ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు, నేను కాదు. దయజేసి ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను ఇంకా టార్చర్ చేయొద్దు’ అంటూ ఆ ఫ్యాన్‌కు దండం పెట్టినట్టు ఉన్న కామెంట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. 


అయితే రేణు దేశాయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ కామెంట్‌ సెక్షన్‌ని డిసెబుల్‌ చేశారు. కానీ ఆమె ఇన్‌స్టాలో ఇలా కామెంట్‌ చేసినట్టుగా ఓ స్క్రీన్‌ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇది చూసిన నెటినన్లు ఇది ఫేక్‌ అంటున్నారు. కావాలని ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ రియాక్ట్‌ అవుతున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే రేణు దేశాయ్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.  


Also Read: పవన్‌ కళ్యాణ్‌కు సాయి దుర్గా తేజ్ స్పెషల్ గిఫ్ట్ - నెటిజన్ల ఫన్నీ కామెంట్స్