Sai Durga Tej Gift To Pawan Kalyan: ఏపీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తుండిపోయే విజయం సాధించడం మెగా ఫ్యామిలీ అంతా గర్వపడే విషయం. అందుకే ఆయన ఎన్నికల్లో గెలిచారని తెలియగానే మెగా ఫ్యామిలీ అంతా ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంది. దాదాపు ఈ కుటుంబం నుండి అందరు హీరోలు.. తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందరిలో సాయి దుర్గా తేజ్ అయితే మరీ ఎక్కువ. పవన్ కళ్యాణ్.. ఏపీ ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి వరుసగా తన గురించి పోస్టులు పెడుతూనే ఉన్నాడు ఈ హీరో. ఇక తాజాగా పవన్‌ను నేరుగా కలిసి ఒక స్పెషల్ గిఫ్ట్‌ను అందించాడు సాయి దుర్గా తేజ్.


సోషల్ మీడియాలో పోస్టులు..


పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవగానే తన సంతోషాన్ని బయటపెడుతూ ఒక పోస్ట్‌ను షేర్ చేశాడు సాయి దుర్గా తేజ్. అందులో పవన్‌ను హగ్ చేసుకొని, ఎత్తుకొని తన సంతోషాన్ని హద్దులు లేవని చూపించాడు. ఇక మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు కూడా సందడి మొత్తం ఈ మెగా హీరోదే. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా చాలామంది నెటిజన్లు.. సాయి దుర్గా తేజ్ అల్లరి గురించే మాట్లాడుకున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్‌ను స్పెషల్‌గా కలిసి ఒక గిఫ్ట్‌ను అందజేశాడు సాయి దుర్గా తేజ్.


బొమ్మ కొనిచ్చాడు..


‘నాకు స్టార్ వార్స్, లెగోను పరిచయం చేసిన నా ప్రియమైన జేడీ మాస్టర్, డిప్యూటీ సీఎం. ఫైనల్‌గా నా చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ.. తనలోని చిన్నపిల్లవాడికి నేను గిఫ్ట్ ఇచ్చే అవకాశం దొరికింది. తన ప్రియమైన పడువన్’ అంటూ పవన్ కళ్యాణ్‌కు లెగో స్టార్ వార్స్‌ను అందజేస్తున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు సాయి దుర్గా తేజ్. దీనికి ఫ్యాన్స్ చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఒక అల్లుడి కోసం మావయ్య బొమ్మలు తెచ్చి ఇవ్వడం రొటీన్, అదే ఒక మావయ్య కోసం అల్లుడు బొమ్మలు కొనడం వెరైటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే ఇద్దరూ కలిసి ఎప్పుడు ఒక ఫ్రేమ్‌లో కనిపించినా చూడముచ్చటగా ఉంటుందని అంటున్నారు.






హాట్ టాపిక్..


ప్రస్తుతం టాలీవుడ్‌లో సాయి దుర్గా తేజ్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. తన మావయ్య పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేయలేదని, వేరే పార్టీకి మద్దతులగా నిలబడ్డాడనే కోపంతో అల్లు అర్జున్‌ను సాయి దుర్గా తేజ్.. సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఈ విషయంపై మెగా హీరో ఇంతవరకు స్పందించలేదు.


Also Read: డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్‌ ప్రమాణ స్వీకారం - నటుడు అజయ్‌ ఘోష్‌ ఊహించని కామెంట్స్‌‌, ఏమన్నాడంటే!