Actor Ajay Ghosh Comments on Pawan Kalyan Victory: నటుడు అజయ్‌ ఘోస్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెండితెరపై విలన్‌గా, కమెడియన్‌గా మంచి గుర్తింపు పొందారు. ఎలాంటి పాత్ర అయినా తనదైన నటనతో ఆకట్టుకుంటారు. నటుడిగానే కాదు బయట జరిగే సామాజిక అంశాలపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తున్నారు. ఏ విషయంపై అయినా నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను బయట పట్టి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అజయ్‌ ఘోష్ పవన్‌ కళ్యాణ్‌ ఏపీ ఎన్నికల్లో (Ap Elections 2024) గెలవడంపై స్పందించారు.


ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'మ్యూజిక్ షాప్ మూర్తి' (Music Shop Murthy Movie). చాందిని చౌదరి మరో ప్రధాన పాత్రల్లో నటించారు. నిన్న జూన్‌ 14న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌ నిర్వహించి సినిమాను జోరుగా ప్రచారం చేసింది. ఈ క్రమంలో రీసెంట్‌గా జరిగిన ప్రెస్‌మీట్‌లో అజయ్‌ ఘోష్‌ పలు ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు విలేకరుల నుంచి పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan Oath As Minister) డిప్యూటి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఆసక్తికర రీతిలో స్పందించారు. 


నేను చెప్తాను. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) గారు‌ ఇండస్ట్రీకి ఏవిధంగా సహాయపడతారు అని అనుకుంటున్నారని అడగ్గా.. నేను ఏం అనుకుంటాను. నాకు అర్థం కావాట్లేదు. ఆయన అందరికి మంచి చేస్తారు. ప్రజలకు, ఇండస్ట్రీకి అందరికి ఆయన మంచే చేస్తారు. నువ్వు ఆధైర్య పడాల్సిన పనిలే" అంటూ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. కాగా పవన్‌ కళ్యాణ్‌ ఏపీ ఎన్నికల్లో పుఠాపురం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై ఆయన దాదాపు 70 వేల మెజారిటీతో గెలిచారు. ఆయన గెలుపును మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు.


ఇక ఇండస్ట్రీ అయితే ఆయన గెలుపుపై ఆనందం వ్యక్తం చేసింది. పవన్‌ గెలిచిన అనంతరం ప్రతి ఒక్కరు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక జూన్‌ 12న ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంపై ఇండస్ట్రీ మొత్తం హర్షం వ్యక్తం చేసింది. పవన్‌ గెలిచారంటూ పరిశ్రమలో గొప్ప మార్పు జరగబోతుందంటూ ఇండస్ట్రీ ప్రముఖులంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పవన్‌ కళ్యాణ్ రాష్ట్రంలో,‌ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు తీసుకువస్తారా అని సినీ ఇండస్ట్రీతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి రాష్ట్ర ప్రజలు, సినీ పరిశ్రమ కోసం పవన్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆయన విజన్‌ ఏలా ఉందో చూడాలి. 


Also Read: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి డైరెక్టర్‌గా అడుగులు - తొలి సినిమాకే నంది అవార్డు, కొరటాల గురించి ఈ విషయాలు తెలుసా..