Namitha: సాధారణంగా హీరోయిన్స్‌కు కెరీర్ స్పాన్ చాలా తక్కువ. అందుకే తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసేయాలని నటీమణులు అనుకుంటూ ఉంటారు. అలా తను వెండితెరపై మెరిసింది కొంతకాలమే అయినా కొన్ని గుర్తుండిపోయే సినిమాలు చేశారు నమిత. ‘సొంతం’ అనే మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళంలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీ అయిపోయారు. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ పూర్తిగా తన పర్సనల్ లైఫ్‌పైనే ఫోకస్ పెట్టారు. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తన జీవితం ఎదుర్కున్న చేదు అనుభవాల గురించి బయటపెట్టారు.


దానివల్లే డిప్రెషన్..


సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో బిజినెస్‌మ్యాన్ వీరేన్ చౌదరీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నమిత. పెళ్లి తర్వాత మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆమె తాజాగా బయటపెట్టారు. 2021లో తాను మొదటిసారిగా ప్రెగ్నెంట్ అయ్యానని గుర్తుచేసుకున్నారు నమిత. ఆ సమయంలో తాను సూరత్‌లో ఉన్నానని, అప్పుడు తన తల్లిదండ్రులు కూడా తనతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. కానీ అనూహ్యంగా 4 నెలలకే మిస్ క్యారేజ్ అయ్యిందని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ ఘటనపై తనపై తీవ్ర ప్రభావం చూపించిందని, దాని వల్ల కొన్నాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని అన్నారు.


కవల పిల్లలు..


మిస్ క్యారేజ్ అయిన కొన్నాళ్లకే తాను మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యానని తెలిపారు నమిత. ఇక సెకండ్ ప్రెగ్నెన్సీలో తనకు ఒకేసారి కవలలు జన్మించారు. దీంతో తన జీవితంలోకి మళ్లీ సంతోషం వచ్చింది. అయినా కూడా మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో తను పడిన బాధను మాత్రం మాత్రం మర్చిపోలేనని అన్నారు నమిత. అయితే ఇది మాత్రమే కాకుండా తన భర్త వీరేంద్ర చౌదరీతో నమిత విడాకులు తీసుకోనుందని కూడా అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. దానిని ఆమె ఖండించడంతో పాటు ఎప్పటికప్పుడు తన భర్తతో దిగిన ఫోటోలను, రీల్స్‌ను షేర్ చేస్తూ వారు మ్యారేజ్ లైఫ్‌లో ఎంత హ్యాపీగా ఉన్నారో అందరికీ గుర్తుచేస్తుంటారు.






అవే చివరి సినిమాలు..


మొదటి సినిమా ‘సొంతం’తోనే సూపర్ సక్సెస్ సాధించిన నమిత.. రెండో సినిమానే వెంకటేశ్ లాంటి స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసింది. అలా రెండేళ్ల పాటు తను తెలుగులోనే వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. అప్పుడే తనకు తమిళం నుండి కూడా పిలుపు వచ్చింది. అలా తనకు స్టార్ హీరోలతో నటించడానికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చినా.. అందులో చాలావరకు చిత్రాలు కమర్షియల్‌గా వర్కవుట్ అవ్వలేదు. దీంతో కొంతకాలానికి తనకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. 2017లో వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ‘పొట్టు’, ‘మియా’ అనే రెండు తమిళ చిత్రాల్లో మెరిశారు. ఆ తర్వాత పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు.


Also Read: అతడు మంచోడు కాదు - ఎంతవరకు తట్టుకోగలం? దర్శన్ కేసుపై నటి కస్తూరి శంకర్ షాకింగ్ కామెంట్స్