Kalki 2898 AD Pre Bookings In Amercia: ప్రస్తుతం చాలామంది ప్రేక్షకుల ఫోకస్ మాత్రం ‘కల్కి 2898 AD’పైనే ఉంది. ఈ మూవీ జూన్ 27న విడుదలకు సిద్ధమయ్యింది. అయితే ఇండియాలో మూవీ బుకింగ్స్ గురించి ఇంకా క్లారిటీ లేకపోయినా.. అమెరికాలో మాత్రం ప్రీ బుకింగ్స్ విషయంలో ‘కల్కి 2898 AD’ రికార్డులు సృష్టిస్తోంది. మామూలుగా ఒక ఇండియన్ మూవీ.. ఓవర్సీస్‌లో విడుదలయ్యి 1 మిలియన్ డాలర్ మార్క్‌ను టచ్ చేయడం చాలా పెద్ద విషయంగా భావిస్తారు. అలాంటిది ‘కల్కి 2898 AD’ విడుదల అవ్వకముందే ఈ మార్క్‌ను టచ్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


ట్రైలర్‌కు ఫిదా..


ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’పై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతున్నకొద్దీ ఔట్‌పుట్ అనేది అదిరిపోతుందని మేకర్స్ చెప్తూ వచ్చారు. ఫైనల్‌గా బుజ్జి, భైరవ గ్లింప్స్‌తోనే ‘కల్కి 2898 AD’ ఎలా ఉండబోతుందని ఆడియన్స్‌కు క్లారిటీ ఇచ్చేశారు. ఇక తాజాగా విడుదలయిన ట్రైలర్ అయితే వేరే లెవెల్ ఉందని, ఇందులో దర్శకుడు నాగ్ అశ్విన్.. సినిమాకు సంబంధించిన ఎన్నో డీటైల్స్ చెప్పడానికి ప్రయత్నించాడని ప్రేక్షకులు చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీంతో అమెరికాలో ‘కల్కి 2898 AD’పై క్రేజ్ మరింత పెరిగిపోయింది. అందుకే ప్రీ బుకింగ్స్ అనేవి ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి.


ఇండియన్ సినిమా రికార్డ్..


‘రెబెల్ స్టార్ ప్రభాస్ తన పవర్‌తో అంతటా రికార్డులను తిరగరాస్తున్నారు. ఇప్పుడు మరో ఆల్ టైమ్ రికార్డ్ ఆయన ఖాతాలో చేరింది’ అంటూ ‘కల్కి 2898 AD’ మూవీ నార్త్ అమెరికాలో 1.6 మిలియన్ డాలర్ల ప్రీ బుకింగ్ బిజినెస్ చేసిందని మేకర్స్ ప్రకటించారు. ఒక ఇండియన్ సినిమా.. ప్రీ బుకింగ్ విషయంలో ఇంత వేగంగా 1 మిలియన్ మార్క్‌ను టచ్ చేయడం ఇదే మొదటిసారి అని అన్నారు. దీంతో ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది అని ఫ్యాన్స్ అంటున్నారు. జూన్ 27న ఇండియాలో విడుదల కానున్న ‘కల్కి 2898 AD’.. అమెరికాలో మాత్రం జూన్ 26 నుండే ప్రీమియర్స్ ప్రారంభించుకోనుంది.






ఇండియాలో కూడా అంతే..


ఇండియాలో ‘కల్కి 2898 AD’ సంబంధించిన బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయా అని చాలామంది మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇక అమెరికాలో ప్రీ బుకింగ్స్ విషయంలో రికార్డులను క్రియేట్ చేస్తున్న ఈ మూవీకి.. ఇండియాలో కూడా అదే రేంజ్‌లో ప్రీ బుకింగ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా దిశా పటానీ నటించింది. మరో కీలక పాత్రల్లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె కనిపించనుంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండరీ యాక్టర్లు కూడా ‘కల్కి 2898 AD’ కూడా కీ రోల్స్ ప్లే చేశారు. ఇందులోని ప్రతీ క్యారెక్టర్ గురించి ట్రైలర్‌లోనే చిన్న గ్లింప్స్ చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్.


Also Read: ప్రభాస్ నా బ్రదర్, ప్రతి సోమవారం ఇక ‘కన్నప్ప’ మండే: మంచు విష్ణు