Kannappa Movie Duration: మంచు విష్ణు మొదటిసారి తన కెరీర్‌లో ఒక పాన్ ఇండియా మూవీ నటిస్తున్నాడు. అదే ‘కన్నప్ప’. నటించడం మాత్రమే కాకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తానే స్వయంగా నిర్మించడం విశేషం. ఇప్పటికే ‘కన్నప్ప’ గురించి ప్రేక్షకుల్లో హైప్ తీసుకురావడం కోసం స్టార్ క్యాస్ట్‌లో రంగంలోకి దించాడు విష్ణు. ఈ మూవీలో ప్రతీ సౌత్ ఇండస్ట్రీ నటులు మాత్రమే కాకుండా పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా యాక్ట్ చేశారు. తాజాగా ‘కన్నప్ప’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మూవీ టీమ్ అంతా సినిమా సక్సెస్‌పై ధీమా వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ మూవీ డ్యూరేషన్ గురించి కూడా ఒక ఆసక్తికర విషయం బయటపెట్టాడు మంచు విష్ణు.
అంతా ఆయన చేతుల్లోనే..
‘కన్నప్ప’ టీజర్ లాంచ్‌లో మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. అందులో ఎడిటర్ ఆంథోనిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు మంచు విష్ణు. అదే సమయంలో సినిమా డ్యూరేషన్ గురించి కూడా రివీల్ చేశాడు. ‘‘మేము అయిదున్నర గంటల సేపు షూట్ చేసిన సినిమాను ఇప్పుడు మూడు గంటలకు చేయడానికి ఆంథోని కష్టపడుతున్నారు. ఎన్ని త్యాగాలు చేయాలన్నది ఆయన చేతుల్లోనే ఉంది. ఆయనతో కలిసి పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనతో పనిచేయాలని ఎన్నో సంవత్సరాలుగా ఆయన వెంటపడ్డాను. ఆరు నెలల నుండి ఈ సినిమా కోసం ఆంథోని కష్టపడుతున్నారు’’ అని బయటపెట్టాడు మంచు విష్ణు. మొత్తానికి ‘కన్నప్ప’ డ్యూరేషన్ 3 గంటలు ఉంటుందని తెలియకుండానే రివీల్ చేశారు ఈ హీరో.
15 ఏళ్ల తర్వాత..
మంచు విష్ణు టైటిల్ పాత్ర పోషించిన ‘కన్నప్ప’లో శరత్ కుమార్ కూడా ఒక కీలక పాత్రలో నటించారు. అయితే ఆయనను కూడా 15 సంవత్సరాలు వెంటపడితే ఇప్పుడు తనతో నటించడానికి ఒప్పుకున్నారని విష్ణు తెలిపాడు. అలాగే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ లాంటి వాళ్లను సైతం ‘కన్నప్ప’లో నటించడానికి ఒప్పించాడు ఈ హీరో. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈ మూవీలో ఒక ముఖ్యమైన గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడని ముందు నుండి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. చాలాకాలం క్రితమే మంచు విష్ణు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. అయితే తాజాగా విడుదలయిన ‘కన్నప్ప’ టీజర్‌లో ప్రభాస్ కళ్లను చూపించడంతో ఫ్యాన్స్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
ప్రభాస్ పాత్రపై ఆసక్తి..
ముందుగా ‘కన్నప్ప’లో శివుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ ప్రభాస్‌కు కథ వినిపించిన తర్వాత తను శివుడి పాత్ర కాకుండా వేరే క్యారెక్టర్‌లో నటించడానికి ఆసక్తి చూపించాడని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చాడు. అయితే ఆ క్యారెక్టర్ ఏంటని రివీల్ చేయడానికి సమయం పడుతుందని, అప్పటివరకు ఆడియన్స్ ఏ అంచనాలకు రావద్దని కోరాడు. దీంతో అసలు ‘కన్నప్ప’లో ఇంతమంది స్టార్లు ఏయే పాత్రలో పోషిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టీజర్ కూడా చాలామంది ఆకట్టుకోవడంతో వారంతా సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు అందిస్తున్నారు.
Also Read: నేను చెప్తే డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది, ‘కన్నప్ప’ కేవలం భక్తి చిత్రం మాత్రమే కాదు - మోహన్ బాబు