Best Horror Movies On OTT: హారర్ సినిమా అంటే ప్రేక్షకులు ఊహించలేని ఏదో ట్విస్ట్ ఉండాలి. అలాంటి ట్విస్టులతో నిండిపోయిన ఒక సినిమానే ‘హాంగ్ కాంగ్ ఘోస్ట్ స్టోరీస్’ (Hong Kong Ghost Stories). టైటిల్ చూడడానికి సింపుల్‌గా ఉన్నా సినిమాలో మాత్రం ఆడియన్స్ భయపడే హారర్ ఎలిమెంట్స్, వారు ఊహించని ట్విస్టులు కూడా ఉంటాయి. ఫారిన్ భాషల్లో హారర్ మూవీస్‌ను ఎప్పుడూ చూడనివారు ‘హాంగ్ కాంగ్ ఘోస్ట్ స్టోరీస్’ను మొదటిగా ట్రై చేయవచ్చు.


కథ..


‘హాంగ్ కాంగ్ ఘోస్ట్ స్టోరీస్’ కథ విషయానికొస్తే.. ముందుగా జెన్నీఫర్.. ఒక స్కూల్‌లో టీచర్‌గా జాయిన్ అవ్వడానికి వెళ్తుంది. కానీ తను అక్కడికి వెళ్లగానే స్కూల్ అంతా ఖాళీగా కనిపిస్తుంది. బాస్కెట్ బాల్ ఆడుతున్న క్రిస్సీ అనే స్టూడెంట్‌ను వెళ్లి అడగగా లంచ్ బ్రేక్ అని చెప్తుంది. ఆ తర్వాత జెన్నీఫర్‌ను స్టాఫ్ రూమ్‌కు తీసుకెళ్తుంది. ప్రస్తుతం హిస్టరీ చెప్పే టీచర్ లేదని అందుకే జెన్నీఫర్‌ను హిస్టరీ క్లాసులు తీసుకోమని అంటుంది. అప్పటికే తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయ్యి బాధలో ఉన్న జెన్నీఫర్‌కు ఇది మంచి డైవర్షన్ అనుకుంటుంది.


తరువాతి రోజు వచ్చి చూస్తే ప్రిన్సిపల్.. జెన్నీఫర్ కోసం ఒక నోట్‌ను వదిలేస్తుంది. ఇప్పుడు తన క్లాస్ చెప్పబోయే స్టూడెంట్స్ చాలా అల్లరి చేస్తారని ఈ నోట్‌లో ఉంటుంది. తన క్లాస్ ఎక్కడో కనుక్కోవడానికి కష్టపడుతున్న జెన్నీఫర్‌కు మళ్లీ క్రిస్సీ కనిపిస్తుంది. అది తన క్లాసే అని చెప్పి తీసుకెళ్తుంది. ఆ క్లాస్‌కు వెళ్లి చూస్తే నిజంగానే పిల్లలంతా విపరీతంగా అల్లరి చేస్తుంటారు. అదేమి పట్టించుకోకుండా తన క్లాస్ ముగించేస్తుంది జెన్నీఫర్.


అదే రోజు ఇంటికి వెళ్తున్నప్పుడు తన బాయ్‌ఫ్రెండ్ వచ్చి అందరి ముందు కాళ్లు పట్టుకొని జెన్నీఫర్‌ను బాగా ఇబ్బంది పెడతాడు. అదే సమయంలో జెన్నీఫర్ తండ్రి వచ్చి తనను అక్కడి నుండి తీసుకెళ్లిపోతాడు. మరుసటి రోజు స్కూల్‌కు వెళ్లగానే క్రిస్సీ బాత్రూమ్‌కు వెళ్లడం గమనించిన జెన్నీఫర్.. తన వెనకే వెళ్తుంది. కానీ తను బాత్రూమ్‌లోకి వెళ్లగానే క్రిస్సీ అక్కడ కనిపించదు. అంతే కాకుండా డోర్లు కూడా లాక్ అయిపోయి అక్కడ తనకు భయంకరమైన ఎక్స్‌పీరియన్స్ ఎదురవుతుంది.


రాత్రైనా జెన్నీఫర్ ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి పోలీసులతో ఆ స్కూల్‌కు వెళ్తాడు. ఆమెను ఇంటికి తీసుకెళ్తాడు. మరుసటి రోజు వేరే టీచర్ ఫోన్ చేసి స్కూల్‌కు రమ్మనడంతో వేరే దారిలేక వెళ్తుంది జెన్నీఫర్. అప్పుడే ఆ టీచర్‌తో తన క్లాస్‌లో పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారని చెప్తుంది. అసలు అలాంటి క్లాసే లేదని టీచర్ చెప్పగానే షాకవుతుంది జెన్నీఫర్. దీంతో జెన్నీఫర్‌ను తీసుకెళ్లి ఆ క్లాస్ రూమ్‌ను చూపిస్తుంది టీచర్. అది తను రోజూ చూసే క్లాస్‌లాగా ఉండదు, స్టోర్ రూమ్‌లాగా ఉంటుంది. కొన్నేళ్ల క్రితం అదే క్లాస్‌లో ఒక స్టూడెంట్ పెట్రోల్ పోసి తన తోటి స్టూడెంట్స్‌ను హత్య చేశాడని, ఆ దాడిలో ఇద్దరు టీచర్లు కూడా చనిపోయారని ప్రిన్సిపల్ చెప్పడంతో జెన్నీఫర్ షాకవుతుంది.


అంతా తెలిసినా కూడా మరుసటి రోజు జెన్నీఫర్ స్కూల్‌కు వెళ్తుంది. క్లాస్‌లోకి వెళ్లగానే తనకు స్టూడెంట్స్ అంతా దెయ్యాలుగా కనిపిస్తారు. పారిపోవడానికి ప్రయత్నించినా తనను పారిపోనివ్వకుండా ఆపి క్లాస్ చెప్పమంటారు. క్లాస్ చెప్తున్న సమయంలో దెయ్యాలుగా మారి తనను భయపెడతారు. దీంతో అక్కడి నుండి పారిపోతుంది. తనకు దారిలో క్రిస్సీ కనిపిస్తుంది.


అలా జెన్నీఫర్‌తో క్రిస్సీ మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉన్న తన బాయ్‌ఫ్రెండ్ వీడియో తీస్తాడు. ఆ వీడియోలో క్రిస్సీ కనిపించదు. అది చూసి భయపడిన జెన్నీఫర్‌ను ఒక మాంత్రికుడు దగ్గరకు తీసుకెళ్తాడు. అతడు జెన్నీఫర్‌కు ఒక మ్యాజిక్ కత్తిని ఇస్తాడు. జెన్నీఫర్ ఇంటికి వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులు కనిపించరు. తన తల్లి తమ దగ్గరే ఉందని ఆ స్టూడెంట్స్‌లో ఒకరు తనకు ఫోన్ చేస్తారు. తను కంగారుగా స్కూల్‌కు వెళ్తుంది. తన కళ్ల ముందే ఆ దెయ్యాలు అన్నీ కలిసి ఆమె తల్లిని కిటికీలో నుండి తోసేస్తాయి. దీంతో ఆ మ్యాజిక్ కత్తి తీసుకొని అక్కడ ఉన్న అందరినీ చంపేస్తుంది. ఆగండి.. సినిమా అయిపోలేదు. అసలైన క్లైమాక్స్ ట్విస్ట్ తెలియాంటే తెరపై ‘హాంగ్ కాంగ్ ఘోస్ట్ స్టోరీస్’ చూడాల్సిందే.



ట్విస్ట్ హైలెట్..


‘హాంగ్ కాంగ్ ఘోస్ట్ స్టోరీస్’ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కచ్చితంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. పైగా స్టూడెంట్స్ అందరూ దెయ్యాలు అని జెన్నీఫర్‌కు తెలిసిన తర్వాత వచ్చే సీన్స్ కూడా ఆడియన్స్‌ను భయపెడతాయి. వీకెండ్‌కు ఒక హారర్ థ్రిల్లర్‌ను చూడాలనుకుంటే ‘మూబీ’ ఓటీటీలో ఉన్న ‘హాంగ్ కాంగ్ ఘోస్ట్ స్టోరీస్’ను ట్రై చేసేయండి. యూట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉంది.


Also Read: కూతురిని చంపాలనుకునే తల్లిదండ్రులు - మైండ్‌తోనే అన్నీ కంట్రోల్ చేసే ఆమె.. తన చావును తప్పించుకోగలదా?