Vijay Sethupathi Open Up on Clash With Vignesh Shivan: విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. తమిళ నటుడైన తెలుగు ఆడియన్స్‌కి బాగా సుపరిచితం. ఆయన తెలుగులోనూ మంచి ఫ్యాన్స్ ఫాలోయింది. అప్పటి వరకు డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ ఆడియన్స్‌కి దగ్గరైన ఆయన ఉప్పెనతో నేరుగా ఎంట్రీ ఇచ్చారు. భాషతో సంబంధం లేకుండ అన్ని భాషల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన 'మహారాజ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది ఆయన 50వ చిత్రం.
నిన్న జూన్ 14న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రంలో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు విజయ్ సేతుపతి. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల విజయ్ సేతుపతి ఓ కోలీవుడ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయనకు నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ఉన్న వివాదంపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ అసలు విషయం చెప్పారు. విఘ్నేశ్ తనకు గొడవ అయిన విషయం నిజమే అన్నారు.
దానివల్ల ఆభద్రతగా అనిపించింది..
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "నానుమ్ రౌడీ థాన్. తెలుగులో నేను రౌడీ. ఈ సినిమా షూటింగ్ టైంలోనే విఘ్నేశ్‌కి నాకు గొడవ అయ్యింది. సినిమా షూటింగ్ మొదలై రోజులు గడుస్తుంది. కానీ ఈ చిత్రంలో నా పాత్ర ఎంటనేది నాకు క్లారిటీ రావడం లేదు. దీంతో నేను అభద్రతాభావానికి లోనయ్యాను. దీంతో ఓ రోజు షూటింగ్ అయిపోయాక సాయంత్రం ఇంటికి వెళ్లి విఘ్నేశ్‌కి ఫోన్ చేసి 'నువ్వు నాకు నటన నేర్పిస్తున్నావా?' అని ఆయనపై కోపంగా అరిచాను. అలా మా మధ్య మాటలు తగ్గిపోయాయి.
నయనతార కలుగుజేసుకుని..
ఈ వ్యవహరంపై నయతార కలుగజేసుకున్నారు. గొడవైన నాలుగు రోజులకు మా ఇద్దరిని కూర్చోబెట్టి నచ్చజెప్పారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పోయాయి. నిజానికి ఈ విషయంలో తప్పు నాదే. నేను విఘ్నేశ్‌ని సరిగా అర్థం చేసుకోలేదు" అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "విఘ్నేశ్ నాకు ఈ మూవీ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నచ్చింది. అందుకే వెంటనే ఒకే చెప్పాను. కానీ షూటింగ్ రోజు ఆయన అంచనాకు తగ్గట్టు నేను నటించలేకపోయా. నా పాత్రను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. మొదటి నాలుగు రోజులు కన్‌ప్యూజన్‌తోనే షూటింగ్ చేశా. ఈ క్రమంలో అభద్రతకు గురైన ఆయనపై గట్టిగా అరిచాను.
Also Read: డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం - నటుడు అజయ్ ఘోష్ ఊహించని కామెంట్స్, ఏమన్నాడంటే!
కానీ విఘ్నేశ్ అంటే ఆ తర్వాత అర్థమైంది. ఇక షూటింగ్ సాఫీగా సాగింది. అప్పుడే మేం మంచి స్నేహితులం కూడా అయ్యాం. నిజానికి విఘ్నేశ్ అద్భుతమైన డైరెక్టర్. ఎవరూ టచ్ చేయని జానర్‌ని, కథలను గొప్పగా రూపొందించగలడు. తనని నమ్మి సినిమా చేస్తే అద్భుతం చేయగలడు" అంటూ విఘ్నేశ్‌పై ప్రశంసలు కురిపించారు. దీంతో విజయ్ సేతుపతి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి నటుడిగానే కాదు వ్యక్తిగతంగాను మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని సన్నిహితవర్గాలు చెబుతుంటారు. ఇండస్ట్రీలో ఆయన ఆజాతశత్రువుగా ఉంటారు. అలాంటి ఆయన విఘ్నేశ్ శివన్‌తో గొడవ పడ్డారనే వార్త రాగానే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయారు.