Alia Bhatt: చాలావరకు సినీ సెలబ్రిటీలు కేవలం యాక్టింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఇతర రంగాల్లో కూడా అడుగుపెట్టి సక్సెస్ సాధించాలని ఆశిస్తుంటారు. అలా చాలామంది ఇప్పటికే మల్టీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ఆలియా భట్ కూడా చేరడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఆలియా. తనకంటూ ఒక ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారి సినిమాలు తెరకెక్కుస్తోంది. ఇప్పుడు ఆలియా ఏకంగా ఒక రైటర్‌గా మారి బుక్ కూడా రిలీజ్ చేసేసింది.
పిల్లల కోసం..
చాలా తక్కువ సమయంలోనే ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు, పాత్రలు చేసి ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్న నటి ఆలియా భట్. ఇప్పటికే యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా బిజీగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు ఏకంగా రైటర్‌గా మారి పిల్లలకు కథలు చెప్తానంటోంది. ఆలియా తాజాగా ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ ఎడ్ ఏ మమ్మా : ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్’ అనే పిల్లల పిక్చర్ బుక్‌ను రాసింది. ఫాదర్స్ డే సందర్భంగా ఈ బుక్‌ను మార్కెట్లో లాంచ్ కూడా చేసింది. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేయడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.
కొత్త ప్రయాణం..
‘‘ఒక కొత్త అడ్వెంచర్ మొదలయ్యింది. ‘ఎడ్ ఏ మమ్మా’ అనే కొత్త బుక్ యూనివర్స్ నుంచి విడుదలయిన మొదటి పుస్తకమే ‘ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్’. నా చిన్నతనం మొత్తం కథలతో, కథలు చెప్పే వ్యక్తులతో నిండిపోయింది. అలా ఒకరోజు నాలోని చిన్నపిల్లను బయటికి తీసుకొచ్చి ఇతర పిల్లల కోసం ఒక పుస్తకం సిద్ధం చేశాను. ఈ కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ రైటర్‌గా తన కొత్త ప్రయాణం గురించి చెప్పుకొచ్చింది ఆలియా భట్. అంతే కాకుండా ఈ బుక్‌ను రెడీ చేయడం కోసం తనకు సాయం చేసిన కో రైటర్స్‌కు కూడా థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఈ పుస్తకం ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ కూడా బుక్ స్టోర్స్‌లో లభిస్తోందని తెలిపింది ఆలియా భట్.
సొంత బ్రాండ్..
‘ఎడ్ ఫైండ్స్ ఏ హోమ్’ పుస్తకం ఈ భూమిని ఎలా చూపుకోవాలి, పెట్స్‌తో ఎలా ఉండాలి అని పిల్లలకు చెప్తుందని ఆలియా భట్ అంటోంది. ‘ఎడ్ ఏ మమ్మా’ అనేది ఆలియా భట్ క్లోత్ బ్రాండ్. 2020లో ఎడ్ ఏ మమ్మా అనే పేరుతో కిడ్స్ వేర్, మెటర్నిటీ వేర్‌ను లాంచ్ చేసింది ఆలియా. ఇప్పుడు అదే పేరుతో ఒక బుక్ సిరీస్‌ను ప్రారంభించింది. పైగా అందులో మొదటి పుస్తకాన్ని తనే రాసి అందరినీ ఆశ్చర్యపరిచింది. రైటర్‌గా, బ్రాండ్ ఓనర్‌గా, నిర్మాతగా బిజీగా ఉన్న ఆలియా భట్.. యాక్టర్‌గా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ‘జిగ్రా’, ‘లవ్ అండ్ వార్’ చిత్రాలు తన ఖాతాలో ఉన్నాయి.
Also Read: మరోసారి డీప్ ఫేక్‌కు బాధితురాలైన ఆలియా భట్ - రియాక్ట్ అవుతున్న ఫ్యాన్స్