Rahul Tyson: 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘హ్యాపీ డేస్’. కానీ ఇప్పటికీ చాలామంది నటీనటులను ఆ సినిమా ద్వారానే గుర్తుపెట్టుకున్నారు ప్రేక్షకులు. అందులో రాహుల్ టైసన్ కూడా ఒకడు. ‘హ్యాపీ డేస్’ తర్వాత అందులో హీరోలుగా నటించిన ప్రతీ ఒక్కరికి సోలో హీరోలుగా సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. రాహుల్ కూడా హీరోగా పలు చిత్రాల్లో నటించినా అందులో ఒక్కటి కూడా వర్కవుట్ అవ్వలేదు. తాజాగా ‘భజే వాయు వేగం’లో కీలక పాత్రలో కనిపించి అందరినీ మెప్పించాడు. తాజాగా ఈ సినిమా గురించి, తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాడు రాహుల్.
అదొక స్ట్రాటజీ..
ప్రశాంత్ చంద్రపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘భజే వాయు వేగం’లో కార్తికేయ హీరోగా నటించగా రాహుల్ టైసన్ తన అన్న పాత్రలో కనిపించాడు. ఇది రాహుల్‌కు కమ్ బ్యాక్ మూవీ అని మేకర్స్ ప్రత్యేకంగా ప్రకటించారు. కానీ టీజర్, ట్రైలర్‌లో మాత్రం అసలు తన క్యారెక్టర్ గురించి ఎక్కువగా రివీల్ చేయలేదు. అలా ఎందుకు చేశారు అని అడగగా.. సినిమాపై హైప్ క్రియేట్ చేయడం కోసం మేకర్స్ ఒక స్ట్రాటజీని ఉపయోగించారని, అదే తాను కూడా ఫాలో అయ్యానని బయటపెట్టాడు రాహుల్. అందుకే తను ఏ ప్రెస్ మీట్‌లోనూ పాల్గొనలేదని, ‘భజే వాయు వేగం’ గురించి తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయలేదని చెప్పుకొచ్చాడు. ఈ స్ట్రాటజీ వల్లే థియేటర్లలో సినిమా చూసిన వారంతా తన క్యారెక్టర్ చూసి సర్‌ప్రైజ్ అయ్యారని సంతోషం వ్యక్తం చేశాడు రాహుల్ టైసన్.
పదేళ్ల తర్వాత..
‘‘ప్రెస్ మీట్స్, ప్రమోషన్స్ అనేవి అన్ని సినిమాలకు చేస్తాం. కానీ ఎంత చేసినా ఫైనల్‌గా సినిమానే మాట్లాడుతుంది. పదేళ్ల తర్వాత ‘భజే వాయు వేగం’తో వస్తున్నాను. అందుకే నా పర్ఫార్మెన్స్ మాట్లాడిన తర్వాతే నేను మీడియా ముందుకు రావాలి అనుకున్నాను. కార్తికేయ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయిదేళ్లలో 12 సినిమాలు చేశాడు. అందుకే తను ఫోకస్ అయ్యేలా, నా గురించి ట్రైలర్‌లో కొంచెం తక్కువ తెలిసేలా ప్లాన్ చేశాం. అది వర్కవుట్ అయ్యింది’’ అని చెప్పుకొచ్చాడు రాహుల్ టైసన్. ‘‘హ్యాపీ డేస్ తర్వాత నేను చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. ఎందుకంటే మనం ఒక సినిమా చేస్తే జనాలు ఊహించిన విధంగానే ఉండాలి’’ అంటూ ‘హ్యాపీ డేస్’ తర్వాత జర్నీ గురించి మాట్లాడాడు.
అలా చేయకూడదు..
‘‘మనకోసం సినిమా చేసుకోవడం కరెక్ట్ కాదు. దానికి చాలావరకు రీచ్ ఉండాలి. ఎందుకంటే ఒక సినిమాలో చాలా డబ్బులు ఖర్చుపెడతాం, చాలామంది కెరీర్లు దానిపై ఆధారపడి ఉంటాయి. అందుకే నేనొకటి ఫిక్స్ అయ్యాను. నేను ఒక సినిమా చేస్తే కచ్చితంగా చాలామంది ప్రేక్షకులకు రీచ్ అవ్వాలి, నిర్మాతలకు డబ్బులు రావాలి, నాకు మంచి పేరు రావాలి, ఆడియన్స్‌కు దగ్గర్వాలి. అప్పుడే నాకు యూవీ క్రియేషన్స్ నుండి రెండు సినిమాలు వచ్చాయి. అందులో ముందుగా ‘భజే వాయు వేగం’ బయటికొచ్చింది. రెండో సినిమాలో నేనే హీరో. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాను. నా ఫిజిక్ అందులో బాగా హైలెట్ అవుతుంది’’ అని బయటపెట్టాడు రాహుల్ టైసన్.
Also Read: అలా చేయకపోతే వరుణ్ సందేశ్‌ను కొడతా, నా కొడుకు పేరు అదే - ‘నింద’ ప్రెస్ మీట్‌లో హీరో నిఖిల్